రాగల 24 గంటల్లో
రాగల 24 గంటల్లో 2019, నవంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్ పతాకాలపై కానూరు శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన, శ్రీరామ్, గణేష్ వెంకట్రామ్, ముస్కాన్ సేథి నటించగా, రఘు కుంచె సంగీతం అందించాడు.[3] అగాథ క్రిస్టీ రాసిన ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్ అనే నాటకం నుండి ఈ చిత్ర కథాంశం తీసుకోబడింది.[4]
రాగల 24 గంటల్లో | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
రచన | కృష్ణ భగవాన్ (మాటలు) బయ్యవరపు రవి |
నిర్మాత | కానూరు శ్రీనివాస్ |
తారాగణం | ఈషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన, శ్రీరామ్, గణేష్ వెంకట్రామ్, ముస్కాన్ సేథి |
ఛాయాగ్రహణం | అంజి[1] |
కూర్పు | తమ్మిరాజు[1] |
సంగీతం | రఘు కుంచె |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 22 నవంబరు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఈషా రెబ్బా (విద్య)
- సత్యదేవ్ కంచరాన (రాహుల్)[4]
- శ్రీరామ్ (పోలీసు నరసింహ)
- గణేష్ వెంకట్రామన్ (గణేష్)[5]
- ముస్కాన్ సేథి (మేఘన)
- రవిప్రకాష్
- కృష్ణ భగవాన్ (పాల్)[6]
- రవివర్మ
- అనురాగ్
- అయాజ్
- దేవిప్రియ
- అభినయ కృష్ణ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
- నిర్మాత: కానూరు శ్రీనివాస్
- మాటలు: కృష్ణ భగవాన్
- రచన: బయ్యవరపు రవి
- సంగీతం: రఘు కుంచె
- ఛాయాగ్రహణం: అంజి
- కూర్పు: తమ్మిరాజు
- నిర్మాణ సంస్థ: శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్
నిర్మాణం
మార్చుఇప్పటివరకు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంతో థ్రిల్లర్ నేపథ్యంలోకి అడుగుపెట్టాడు.[7] ఈ చిత్రకథ విన్న తరువాత శ్రీరామ్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాడు.[8] ఈ చిత్రానికి సంగీతం అందించడానకి రఘు కుంచె తీసుకున్నారు. సెప్టెంబరు తొలివారంలో ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలవ్వగా, సెప్టెంబరు చివరివారంలో టీజర్ విడుదలైంది. నవంబరులో ట్రైలర్ విడుదలైంది.[3]
పాటలు
మార్చురఘు కుంచె ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. [9][10] వై.వి.సుబ్బారెడ్డి "నారాయణతే నమో నమో" పాటను విడుదలచేశాడు. రఘు బాబు, అలీ పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.[11] దేవి శ్రీ ప్రసాద్ "రెబ్బా" అనే ప్రచార పాటను విడుదల చేశాడు.[12] అక్టోబరులో రెండవ పాట "నమో నమో" విడుదలైంది.[13]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రెబ్బా" | శ్రీమణి | రఘు కుంచె | 4:40 |
2. | "నీ చిరునవ్వుకి నమో (నమో నమో)" | శ్రీమణి | హరిచరణ్, రమ్యశ్రీ కామరాజు | 4:21 |
3. | "ఆకాశాన్నే" | భాస్కరభట్ల రవికుమార్ | నరేష్ అయ్యర్, ముస్కాన్ సేథీ | 4:23 |
4. | "నీ చిరునవ్వుకి" | భాస్కరభట్ల రవికుమార్ | రమ్యశ్రీ కామరాజు | 4:28 |
మొత్తం నిడివి: | 17:52 |
విడుదల
మార్చుఈ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "రాగల 24 గంటల్లో సినిమా స్క్రిప్ట్ విషయంలో కాస్త విఫలమయింది. ఈ చిత్రంలోని థ్రిల్లర్ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలనే మనముందు ఉంచుతుంది" అని పేర్కొంది.[4] "రాగల 24 గంటల్లో అనేది సినిమా పేరుకు తగ్గట్టుగా, ఆ సినిమా చూడటానికి వస్తున్న ప్రేక్షకులకు ఒక హెచ్చరిక" అని ది హిందూ పత్రిక రాసింది.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Ragala 24 Gantallo: Motion poster of Eesha Rebba's upcoming film is out - Times of India". The Times of India.
- ↑ 2.0 2.1 "Ragala 24 Gantallo is successful in entertaining masses: Sathyadev". Telangana Today.
- ↑ 3.0 3.1 "Raagala 24 Gantallo trailer: Eesha Rebba leads the proceedings in this riveting murder-mystery - Times of India". The Times of India.
- ↑ 4.0 4.1 4.2 "Raagala 24 Gantallo Movie Review: An exciting story let down by a poor screenplay". The Times of India.
- ↑ "Raagala 24 Gantalu Telugu Movie Review". November 24, 2019.
- ↑ 6.0 6.1 Chowdhary, Y. Sunita (November 22, 2019). "'Ragala 24 Gantallo' movie review: A confusing whodunit". The Hindu.
- ↑ Pecheti, AuthorPrakash. "Ragala 24 Gantallo is an engrossing thriller tale: Srinivas Reddy". Telangana Today.
- ↑ Kumar, AuthorP Nagendra. "'Story is the hero in Ragala 24 Gantallo'". Telangana Today.
- ↑ "Ragala 24 Gantallo - All Songs - Download or Listen Free - JioSaavn". JioSaavn.
- ↑ "Raagala 24 Gantallo Full Songs Jukebox - Satya Dev, Eesha Rebba - Sreenivaas Redde". Aditya Music. 20 November 2019.
- ↑ "Lyrical video of Ragala 24 Gantalo released". Telangana Today.
- ↑ "Raagala 24 Gantallo promotional song to be released soon - Times of India". The Times of India.
- ↑ "Namo Namo from Eesha Rebba and Satyadev's Raagala 24 Gantallo released - Times of India". The Times of India.