రాజశ్రీ ఓజా
రాజశ్రీ ఓజా (జననం 1976) భారతీయ సినిమా నిర్మాత, దర్శకురాలు. ఐషా (2010), చౌరాహెన్ (2007) సినిమాలకు దర్శకత్వం వహించింది.
రాజశ్రీ ఓజా | |
---|---|
జననం | కోల్‌కతా, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకురాలు |
క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
జీవితం తొలి దశలో
మార్చురాజశ్రీ 1976లో కోల్‌కతాలో జన్మించింది. బెంగళూరులో పెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, న్యూయార్క్ యూనివర్సిటీ నుండి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది. 2002లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్స్ చేసింది.[1] డిప్లొమాలో భాగంగా తీసిన బ్యాడ్జర్ అనే ఆమె షార్ట్ ఫిల్మ్, అత్యుత్తమ దర్శకత్వం కోసం అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాచే ఆసియా వాయిస్‌గా కూడా గౌరవించబడింది.[2] 2005లో భారతదేశానికి తిరిగి వచ్చింది.
సినిమా కెరీర్
మార్చుప్రముఖ హిందీ నవలా రచయిత నిర్మల్ వర్మ నాలుగు చిన్న కథల ఆధారంగా రూపొందించి చౌరాహెన్ పేరుతో తొలి సినిమా చేసింది. ఈ సినిమా పనులు 2002 ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో సోహా అలీఖాన్, జీనత్ అమన్, కైరా చాప్లిన్, నేదురుమూడి వేణు వారు నటించారు. అయితే నిర్మాత ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో రాజశ్రీ స్వయంగా సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నది. ఎట్టకేలకు 2005లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా 1.80 కోట్ల బడ్జెట్‌తో 2007లో పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక సమస్యల కారణంగా చాలాసార్లు వాయిదా వేయబడింది. చివరకు 2012లో పివిఆర్ పిక్చర్స్ చొరవతో డైరెక్టర్స్ రేర్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3][4][5]
చౌరాహెన్ రాజశ్రీ తొలి సినిమా అయినప్పటికీ, ఐషా అనేది ఆన తొలి సినిమాగా పరిగణించబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు 2009లో ప్రారంభమయ్యాయి. సోనమ్ కపూర్, అభయ్ డియోల్ జంటగా నటించిన ఈ సినిమాను అనిల్ కపూర్ నిర్మించాడు. ఈ సినిమా జేన్ ఆస్టెన్ ఎమ్మా (నవల) ఆధారంగా రూపొందించబడింది, దేవికా భగత్ స్క్రీన్ ప్లే అందించంది. ఈ సినిమా 2010లో విడుదలై మిశ్రమ స్పందనలను అందుకుంది. తరువాత రాజశ్రీ మాట్లాడుతూ, ఫైనల్ కట్‌పై తనకు నియంత్రణ లేదని, దానిని నిర్మాత అనిల్ కపూర్ పూర్తిగా రూపొందించారని చెప్పారు.[6]
రాజశ్రీ తదుపరి వెంచర్ సినిమా ఎక్స్: పాస్ట్ ఈజ్ ప్రెజెంట్, ఇది 8 మంది దర్శకులతో కూడిన సినిమా. రాధికా ఆప్టే, రజత్ కపూర్ ప్రధాన పాత్రలలో బిరియానీ అనే సెగ్మెంట్ చేసింది.[7]
ఫిల్మోగ్రఫీ
మార్చు- చౌరాహెన్ (2007) (దర్శకురాలు & రచయిత)
- ఐషా (2010) (దర్శకురాలు)
- ఎక్స్: పాస్ట్ ఈజ్ ప్రెజెంట్ (2015) ( బిరియాని సెగ్మెంట్ డైరెక్టర్, రచయత్రి)
- బిన్ కుచ్ కహే (2017) (రచయిత్రి, నిర్మాత)
- పాట్‌లక్ (ఇండియన్ వెబ్ సిరీస్) (2021) (దర్శకురాలు)
- పాట్‌లక్ సీజన్ 2 (2023) (దర్శకురాలు)
మూలాలు
మార్చు- ↑ "Rajshree Ojha on directing Aisha - Rediff.com".
- ↑ "I know the box office outcome of Chaurahen won't be great at all: Rajshree Ojha". 29 February 2012.
- ↑ "Second debut? - The Hindu". The Hindu.
- ↑ "Rajshree Ojha returns with Chaurahen, says no compromise this time".
- ↑ "A Decade of Despair". 15 March 2012.
- ↑ "Aisha was not my film - Times of India". The Times of India.
- ↑ "Rajshree Ojha's next stars Radhika Apte and is called 'Biryani'".
బాహ్య లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజశ్రీ ఓజా పేజీ