సోనం కపూర్ (జననం 9 జూన్ 1985)బాలీవుడ్ నటి. బాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలకు నామినేషన్లు లభించాయి సోనంకు.

సోనమ్ కపూర్
2017లో సోనమ్ కపూర్
జననం (1985-06-09) 1985 జూన్ 9 (వయసు 39)[1]
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆనంద్ అహుజా
(m. 2018)
తల్లిదండ్రులుఅనిల్ కపూర్ (తండ్రి)
బంధువులురియా కపూర్ (సోదరి)
హర్షవర్ధన్ కపూర్ (సోదరుడు)

నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనం. సింగపూర్ లోని యునైటెడ్  వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్, ఆర్ట్స్ చదువుకున్నారు ఆమె. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా  భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు సోనం. భన్సాలీ దర్శకత్వంలో సావరియా (2007) సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం  చేశారు ఆమె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారం లభించింది. 3 సంవత్సరాల తరువాత ఇ హేట్ లవ్  స్టోరీస్ (2010) సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు సోనం.

వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన తరువాత విడుదలైన రాంఝణా (2013) సినిమా హిట్ కావడంతో ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఆ తరువాత ఆమె నటించిన ఖూబ్ సూరత్ (2014), డాలీకీ డోలీ (2015) సినిమాలు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు పొందారు. సోనం చేసిన ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) అత్యంత ఎక్కువ వసూళ్ళు చేసిన సినిమా. ఆ తరువాత 2016లో ఆమె చేసిన నీరజ సినిమా ఎక్కువ వసూళ్ళు సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది.

సోనం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి అవగాహన కార్యక్రమాలు చేశారు ఆమె. ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారామె.

వ్యక్తిగత జీవితం, కెరీర్

మార్చు

తొలినాళ్ళ జీవితం (1985–2006)

మార్చు
 
తండ్రి అనిల్ కపూర్ తో సోనం

9 జూన్ 1985న ముంబైలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు సోనం. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత, అనిల్ కపూర్ ఫిలింస్ కంపెనీ వ్యవస్థాపకుడు, నిర్మాత సురిందర్ కపూర్ కుమారుడు అయిన అనిల్ కపూర్. తల్లి సునీత మాజీ మోడల్, డిజైనర్.[2] ఈమె చెల్లెలు రియా కపూర్ నిర్మాత, తమ్ముడు హర్ష్ వర్ధన్ నటుడు.[3][4][5][6] బోనీ కపూర్సంజయ్ కపూర్ ల తమ్ముడు కుమార్తె ఈమె. తండ్రి వైపు  కజిన్స్ నటులు అర్జున్ కపూర్మోహిత్ మార్వా, తల్లి వైపు కజిన్ నటుడు రణ్ వీర్ సింగ్.[7][8]

సోనం ఏడాది పిల్లగా ఉన్నప్పుడు వారి కుటుంబం జుహు సబ్ అర్బ్ కు మారిపోయారు.[9] జుహులోని ఆర్య విద్యా మందిర్ పాఠశాలలో విద్యనభ్యసించారు.[10] చిన్నతనంలో ఆమె చాలా అల్లరి పిల్ల.[11] రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి ఆటల్లో మంచి ప్రతిభ కనపరిచేవారు.[12] కథక్, శాస్త్రీయ సంగీతం, లాటిన్ నృత్యాల్లో శిక్షణ తీసుకున్నారు సోనం.[13] హిందూ సంప్రదాయాలను తప్పక పాటిస్తారు ఆమె. "పూజల ద్వారా నా కృతజ్ఞతలను దేవునికి చెబుతాను" అని అంటుంటారు సోనం.[14]

తన 15వ ఏట ఒక వారం పాటు ఆమె వెయిట్రెస్ గా పనిచేశారు.[15][16] టీనేజ్ లో ఉన్నప్పుడు సోనం అధిక బరువుతో బాధపడేవారు. దాని గురించి వివరిస్తూ "బరువు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్యం కూడా బాధించేది. నా చర్మం కూడా బాగుండేదికాదు. నా మొహంపై అవాంఛిత రోమాలు పెరిగిపోయేవి" అని గుర్తుచేసుకుంటారు.[17][18] కొన్నాళ్ళు ఇన్స్యులెన్స్ రెసిస్టెన్స్, హార్మోన్ సమస్యలకు చికిత్స తీసుకున్నారు ఆమె.[17] మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేసేవారు. ఆ తరువాత సింగపూర్ లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్, ఆర్ట్స్ పై కోర్సు చేశారు సోనం.[9] అక్కడి నుండి తిరిగి వచ్చాకా ముంబై విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్ పై కొన్ని కోర్సులు కరెస్పాండెన్స్ లో చదివిన సోనం. కొన్నాళ్ళకు ముంబైకు వచ్చి అవే కోర్సుల్లో డిగ్రీ చదువుకున్నారు.[19] బ్లాక్ సినిమాలో పనిచేస్తున్నప్పుడు నటి, వీరి కుటుంబానికి సన్నిహితురాలైన రాణి ముఖర్జీ లండన్ లోని సోనం ఇంటికి వచ్చారు. సినిమాలపై అప్పటికే ఆసక్తి ఉన్న సోనం ఆమె చేస్తున్న సినిమాలో దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని కోరారు.[9] ఆ తరువాత తన తండ్రి బ్లాక్ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో మాట్లాడి ఆయనకు సహాయ దర్శకురాలిగా సోనానికి అవకాశం ఇప్పించారు. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు ఆమె.[20][21]

మొదటి సినిమా, కెరీర్ లో ఒడిదుడుకులు (2007–12)

మార్చు

బ్లాక్ సినిమాకు పనిచేస్తున్న సమయంలో సోనానికి నటనపై ఆసక్తి పెరిగింది. ఆ సినిమా దర్శకుడు భన్సాలీ తన తరువాతి సినిమా సావరియాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి, బరువు తగ్గమని సూచించారు. అప్పటివరకు 85 కేజీలు బరువు[22] ఉండే సోనం, భన్సాలీ ప్రోత్సాహంతో 2 ఏళ్ళలో దాదాపు 35 కేజీలు తగ్గారు.[17][22][23] ఆ సమయంలోనే నటనలో శిక్షణ కూడా పొందారామె. నటులు రోషన్ తనేజా, జయతి భాటియా, ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ లతో కలసి నటన నేర్చుకున్నారు ఆమె.[9] ప్రముఖ హీరోయిన్లు వహీదా రెహమాన్, నూతన్ లు తనకు ప్రేరణ అని చెప్తారు సోనం.[24]

2007లో భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలసి ఆమె నటించిన సావరియా సినిమా[25] కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ పెద్ద ఫెయిల్యూర్ అయింది.[26][27] ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థా బాలీవుడ్ సినిమాను నిర్మించడం ఇదే మొదటిసారి.[28] ఈ సినిమాలోని నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారానికి నామినేషన్, స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో -ఫిమేల్ పురస్కారం అందుకున్నారు.[1][29]

 
ఐ హేట్ లవ్ స్టోరీస్ (2010) సినిమా ప్రచారంలో సోనం కపూర్

2009లో అభిషేక్ బచ్చన్వహీదా రెహమాన్ ల తో కలసి  రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా  దర్శకత్వంలో ఆమె నటించిన ఢిల్లీ 6 సినిమా కు మంచి ప్రశంసలే లభించినా,[30] సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.[31] పలు పత్రికలు ఆమె నటనను విమర్శిస్తూ కథనాలు కూడా రాశారు. సోనం నటనకు పనికి రాదని కూడా కొంతమంది విమర్శకులు విశ్లేషించారు.[32][33]

పెళ్ళి, పిల్లలు

మార్చు

2018లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను సోనమ్ కపూర్ వివాహం చేసుకుంది. 2022 ఆగస్టు 20న మగబిడ్డకు జన్మనిచ్చింది.[34]

సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
2005 బ్లాక్  — సహాయ దర్శకుడు
2007 సావరియా సకినా
2009 ఢిల్లీ-6 బిట్టు శర్మ
2010 ఐ హేట్ లవ్ స్టోరీస్ సిమ్రన్ కౌర్
2010 అయేషా అయేషా కపూర్
2011 థాంక్యూ సంజన మల్హోత్రా
2011 మౌసమ్ ఆయత్ రసూల్
2012 ప్లేయర్స్ నైనా బ్రగంజా
2013 బాంబే టాకిస్ స్వంత పాత్ర "అప్నే బాంబే టాకిస్" పాటలో అతిథి పాత్ర[35]
2013 రంఝణ జోయా హైదర్
2013 భాగ్ మిల్కా భాగ్ బిరో
2014 బేవకూఫియా మయేరా సెహగల్
2014 ఖూబ్సూరత్ డాక్టర్. మృణాళిని "మిల్లీ" చక్రవర్తి
2015 డాలీకీ డోలీ డాలీ
2015 ధీరే ధీరే  — మ్యూజిక్ వీడియో
2015 ప్రేమ్ రతన్ ధన్ పాయో రాజకుమారీ మైథిలీ దేవి
2016 హైం ఫర్ ది వీకెండ్  — మ్యూజిక్ వీడియో
2016 నీరజ నీరజ భానోత్

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం చిత్రం పురస్కారం కేటగిరి ఫలితం Ref.
2008 సావరియా ఫిలింఫేర్ పురస్కారాలు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి నామినేషన్ [29]
స్క్రీన్ అవార్డులు స్టార్ స్క్రీన్ అవార్డ్ ఫర్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ – ఫీమేల్ నామినేషన్ [36]
జీ సినీ అవార్డులు జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ నామినేషన్ [37]
స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో– ఫిమేల్ గెలిచారు [1]
2010 ఢిల్లీ-6 ఆసియా ఫిలిం అవార్డులు ఆసియా ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ న్యూకమర్ నామినేషన్ [38]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [36]
స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో– ఫిమేల్ నామినేషన్ [36]
2011 ఐ హేట్ లవ్ స్టోరీస్ స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్ [36]
2012 థాంక్యూ స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్ [39]
జీ సినీ అవార్డులు అంతర్జాతీయ ఐకాన్ – ఫీమేల్ నామినేషన్ [40]
2014 రాంఝణ బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ – ఫిమేల్ నామినేషన్ [41]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ అవార్డ్ ఉత్తమ నటి నామినేషన్ [42]
ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [43]
జీ సినీ అవార్డులు జీ సినీ అవార్డు ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [44]
2015 ఖూబ్సూరత్ స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ ఉత్తమ నటి పురస్కారం గెలిచారు [45]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ ఇన్ కామెడీ – ఫీమేల్ నామినేషన్ [46]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [47]
ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [48]
2015 ప్రేమ్ రతన్ ధన్ పాయో బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ ఇన్ డ్రామా – ఫీమేల్ నామినేషన్ [49]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ ఇన్ రొమాంటిక్ రోల్ – ఫీమేల్ గెలిచారు [50]
గోల్డెన్ కేలా అవార్డులు వరస్ట్ నటి గెలిచారు [51]
2016 డాలీకీ డోలీ ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం నామినేషన్ [52]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ ఉత్తమ నటి అవార్డు నామినేషన్ [53]
2016 నీరజ ఐ యామ్ ఉమెన్ అవార్డు ఉమెన్ ఎంపవర్మెంట్ గెలిచారు [54]
హలో పత్రిక విమర్శకుల ఎంపిక గెలిచారు [55]
ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఉత్తమ నటి ఫలితం ఇంకా తెలీదు [56]
  1. 1.0 1.1 1.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; biography అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Sonam Kapoor: My love life has been unsuccessful". Gulf News. 18 June 2013. Retrieved 3 October 2015.
  3. "In pics: The Boney–Anil–Sanjay Kapoor Family Tree". CNN-IBN. 7 February 2012. Archived from the original on 16 January 2016. Retrieved 3 August 2012.
  4. "Film producer Surinder Kapoor dies". Dainik Bhaskar. 25 September 2011. Retrieved 27 September 2015.
  5. "Anil Kapoor Films Company". Bollywood Hungama. Retrieved 25 September 2015.
  6. "I am not an actor, so I can be a star". The Indian Express. 8 March 2014. Retrieved 5 October 2015.
  7. Bajwa, Dimpal (9 June 2015). "On Sonam Kapoor's 30th birthday, brother Arjun Kapoor shares a throwback picture". The Indian Express. Retrieved 23 September 2015.
  8. "Fugly screening: Cousins Sonam, Jhanvi, aunt Sridevi cheer for Mohit Marwah". The Indian Express. Retrieved 23 September 2015.
  9. 9.0 9.1 9.2 9.3 Gupta, Priya (24 May 2013). "I don't need a tall, dark and handsome man: Sonam Kapoor". The Times of India. Retrieved 24 May 2014.
  10. "'Guddi' inspired Sonam Kapoor's school girl act in 'Raanjhnaa'". Daily News and Analysis. 24 May 2013. Retrieved 5 December 2014.
  11. "'Naughty' Sonam Kapoor loved to bully boys". The Indian Express. 22 June 2015. Retrieved 3 October 2015.
  12. Banerjee, Arnab (2 October 2009). "Being Sonam Kapoor..." India Today. Retrieved 25 September 2015.
  13. "The Sonam Kapoor we know". Filmfare. Archived from the original on 25 September 2015. Retrieved 23 September 2015.
  14. Gupta, Priya (2 September 2014). "Sonam Kapoor: My mom has brought all these religious things in our lives". The Times of India. Retrieved 22 September 2015.
  15. Shrivastava, Priyanka; Joshi, Sonali (15 July 2011). "Sonam Kapoor is a working girl since 15". India Today. Archived from the original on 24 April 2015. Retrieved 3 October 2015. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 23 ఏప్రిల్ 2015 suggested (help)
  16. Arora, Prerna (31 August 2014). "Ten Things You Didn't Know About Sonam Kapoor and Arjun Kapoor". Colors. Archived from the original on 23 March 2016. Retrieved 3 October 2015.
  17. 17.0 17.1 17.2 "Sonam Kapoor launches Kalli Purie's book in Delhi". India Today. 20 January 2012. Retrieved 7 August 2014.
  18. Bansal, Robin (28 January 2012). "There is no way I can be size zero: Sonam". Hindustan Times. Archived from the original on 6 December 2014. Retrieved 7 August 2014.
  19. http://indiatoday.intoday.in/story/sonam-kapoor-prem-ratan-dhan-paayo-dolly-ki-doli-cannes/1/362598.html
  20. Masand, Rajeev (8 October 2007). "Saawariya Spl: Ranbir will be a huge star, says Sonam". CNN-IBN. Archived from the original on 26 January 2013. Retrieved 5 December 2014.
  21. Singh, Apurva (9 November 2013). "Sonam Kapoor thanks fans as she completes completes six years in Bollywood". The Financial Express. Archived from the original on 25 సెప్టెంబరు 2015. Retrieved 5 December 2014.
  22. 22.0 22.1 "How Sonam Kapoor lost 35 kilos". Rediff.com. 27 December 2010. Retrieved 28 May 2014.
  23. "Sonam Kapoor talks about her major weight–loss programme". Mid Day. 13 November 2009. Retrieved 28 May 2014.[permanent dead link]
  24. Ganguly, Prithwish (25 September 2009). "Sonam Kapoor adores Nutan and Waheeda Rehman". Daily News and Analysis. Retrieved 24 September 2015.
  25. "'Saawariya' Bollywood Answer to Moulin Rogue". Los Angeles Daily News. 9 November 2007. Archived from the original on 22 ఫిబ్రవరి 2016. Retrieved 26 September 2015.
  26. "Saawariya (2007)". Rotten Tomatoes. Retrieved 23 December 2015.
  27. "Box Office 2007". Box Office India. Archived from the original on 26 January 2014. Retrieved 22 September 2015. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 14 అక్టోబరు 2013 suggested (help)
  28. Giridharadas, Anand (8 August 2007). "Hollywood Starts Making Bollywood Films in India". The New York Times. Retrieved 22 September 2015.
  29. 29.0 29.1 "I'm no underdog: Sonam Kapoor". Sify. 24 January 2009. Retrieved 19 October 2015.
  30. "Delhi 6 (2009)". Rotten Tomatoes. Retrieved 23 December 2015.
  31. "Box Office 2009". Box Office India. Archived from the original on 28 January 2014. Retrieved 28 January 2014. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 14 అక్టోబరు 2013 suggested (help)
  32. Masand, Rajeev (21 February 2009). "Delhi–6, a film with heart". CNN-IBN. Archived from the original on 8 సెప్టెంబరు 2013. Retrieved 25 జూలై 2016.
  33. Chopra, Sonia (20 February 2009). "Delhi–6, a tad too loud". Sify. Archived from the original on 14 May 2014. Retrieved 7 October 2015. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 17 జనవరి 2014 suggested (help)
  34. "Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్‌ కపూర్‌". web.archive.org. 2022-08-21. Archived from the original on 2022-08-21. Retrieved 2022-08-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  35. "Watch: Stars shine in 'Apna Bombay Talikes' song". CNN-IBN. 26 April 2013. Archived from the original on 25 జనవరి 2016. Retrieved 6 December 2015.
  36. 36.0 36.1 36.2 36.3 "Sonam Kapoor: Awards & Nominations". Bollywood Hungama. Archived from the original on 30 November 2014. Retrieved 30 November 2014. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 ఏప్రిల్ 2011 suggested (help)
  37. "Sonam Kapoor: A new milestone". The Daily Star. 17 September 2009. Archived from the original on 1 May 2016. Retrieved 30 September 2015.
  38. "4th AFA Nominees & Winners by Nominees". Asian Film Awards. Archived from the original on 29 October 2013. Retrieved 28 October 2013.
  39. "Nominations of Stardust Awards 2012". Bollywod Hungama. 6 February 2012. Retrieved 28 October 2013.
  40. "Zee Cine Awards 2012–Nomination List". Zee News. 18 January 2012. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 28 October 2013.
  41. "Nominations for 4th Big Star Entertainment Awards". Bollywood Hungama. 12 December 2013. Retrieved 20 January 2014.
  42. "20th Annual Screen Awards 2014: The complete list of nominees". CNN-IBN. 8 January 2014. Archived from the original on 3 February 2016. Retrieved 20 January 2014.
  43. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ff08 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  44. "Zee Cine Awards: Deepika gets maximum nominations for Best female Actor". India Today. 20 January 2014. Retrieved 21 January 2014.
  45. "Winners of Stardust Awards 2014". Bollywood Hungama. 15 December 2014. Retrieved 15 December 2014.
  46. "Big Star Entertainment Award's Nomination". BIG FM 92.7. Archived from the original on 16 December 2015. Retrieved 21 September 2015.
  47. "Screen Awards 2015: Vote for Best Actor Male and Female Popular Choice". The Indian Express. 6 January 2015. Retrieved 21 September 2015.
  48. "Nominations for the 60th Britannia Filmfare Awards". Filmfare. Archived from the original on 10 జనవరి 2016. Retrieved 21 September 2015.
  49. Jha, Subhash K. (9 December 2015). "Big Star entertainment awards: Salman Khan, Nawazuddin nominated in the same category". Firstpost. Retrieved 21 December 2015.
  50. Sarkar, Prarthna (14 December 2015). "Big Star Entertainment Awards 2015 winners list: Deepika, Salman bag top honours; 'Sultan' actor entertains audience". International Business Times. Retrieved 21 December 2015.
  51. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Golden Kela అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  52. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  53. "Watch Star Screen Awards episode 1". Hotstar. Archived from the original on 17 మార్చి 2016. Retrieved 26 January 2016.
  54. "Sonam Kapoor receives award for 'Neerja'". Daily News and Analysis. 6 April 2016. Retrieved 9 April 2016.
  55. Kaur, Kiran (12 April 2016). "Hello! Hall of Fame Awards 2016: Complete list of winners". Retrieved 13 April 2016.
  56. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-14. Retrieved 2016-07-25.