రాజస్థాన్ పర్యాటకం

రాజస్థాన్ రాష్ట్రం ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాలు

రాజస్థాన్ పర్యాటకం, భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం పర్యాటక ప్రదేశాల్లో చాలా ప్రసిద్ధమైనది.  జాతీయం గానూ, అంతర్జాతీయం గానూ కూడా ఎందరో పర్యాటకులు ఇక్కడకి వస్తూంటారు. రాజస్థాన్ లోని చారిత్రక భవంతులు, కోటలు, కళలు, సంస్కృతులు, కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశానికి వచ్చే ప్రతి ముగ్గురు విదేశీ పర్యటకుల్లో ఒకరు  రాజస్థాన్ ను తప్పక సందర్శిస్తారు.[1][2]

రాజస్థాన్ పర్యాటకానికి చెందిన మౌళికమైన మ్యాప్

ప్రకృతి సౌందర్యం, చరిత్ర రెండూ కలగలసిన ప్రాంతం రాజస్థాన్. దాంతో పర్యాటక పరిశ్రమ విషయంలో భారతదేశంలో ముందు స్థానంలో నిలిబడింది. ఆ రాష్ట్రం. జైపూర్ లోని ప్యాలెస్ లు, ఉదయ్ పూర్ లోని సరస్సులు, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ లలోని ఎడారి కోటలు పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటకం 8శాతం ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు. పాతబడిపోయిన, మరుగున పడిపోయిన ఎన్నో కోటల్ని, భవంతల్నీ ప్రస్తుతం సుందరీకరణ చేసి వారసత్వ ప్రదేశాలు గానూ, ముఖ్యంగా హోటల్స్ గానూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో పర్యాటకం ఒక పెద్ద ఉపాధి పరిశ్రమగా మరిపోయింది. ఘెవర్ అనేది ఇక్కడి ముఖ్యమైన స్వీట్లలో ఒకటి.

ప్యాలెస్ లు

మార్చు

ప్యాలెస్ లు, రాజభవంతులకు రాజస్థాన్ పెట్టింది పేరు. ఈ ప్యాలస్ ల చుట్టూనే ప్రస్తుతం రాజస్థాన్ పర్యాటకం ఎక్కువగా తిరుగుతోంది.[3]రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు:

  • ఉమైద్ భవన్ ప్యాలెస్: రాజస్థాన్ లోని ఒకానొక రాజభవంతి ఇది. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యక్తిగత నివాస స్థానం(ప్రైవేట్ రెసిడెన్స్) కూడా.
  • తాజ్ లేక్ ప్యాలెస్: ఉదయ్ పూర్ లోని ఈ ప్యాలెస్ ప్రస్తుతం లగ్జరీ  హోటల్ గా మారిపోయింది. ఈ ప్యాలెస్ పిచోలా సరస్సులో ఉంది.
  • హవా మహల్: హవా మహల్ అంటే గాలి మహల్ అని అర్ధం.  దాదాపు 950 కిటికీలతో ఉంటుంది కాబట్టే దానికి  ఆ పేరు వచ్చింది.
  • రాం బాగ్ ప్యాలెస్: అసలు ఇది ఒక రాజభవంతి. కానీ ప్రస్తుతం ఇది ఒక వారసత్వ హోటల్ గా మారిపోయింది. ప్రపంచంలోనే ఉత్తమ వారసత్వ హోటల్ గా గుర్తించబడింది ఈ ప్యాలెస్.
  • దేవి గఢ్ ప్యాలస్: ఇది కూడా పూర్వం రాజభవంతే. ప్రస్తుతం హోటల్ గా తీర్చిదిద్దారు. 2006లో ది న్యూ యార్క్ టైమ్స్ దీనిని భారతదేశంలోనే అత్యుత్తమ లగ్జరీ హోటల్ గా పేర్కొంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Rajasthan, by Monique Choy, Sarina Singh.
  2. In Rajasthan, by Royina Grewal.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-16. Retrieved 2016-09-20.

వెలుపలి లంకెలు

మార్చు