రాజా (1999 సినిమా)
రాజా 1999 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా.[1] ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998 లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్ అనే సినిమాకు పునర్నిర్మాణం.
రాజా | |
---|---|
![]() | |
దర్శకత్వం | ముప్పలనేని శివ |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
రచన | రాజేంద్రకుమార్ |
స్క్రీన్ ప్లే | ముప్పలనేని శివ |
కథ | విక్రమన్ |
నటులు | వెంకటేష్ , సౌందర్య |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల | మార్చి 18, 1999[1] |
భాష | తెలుగు |
కథసవరించు
రాజా, బాలు తోడుదొంగలు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. ఒకసారి వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించడానికి ఒప్పుకుని పోలీసులకు భయపడి ఒక ఇంట్లో దాక్కుంటారు. ఆ ఇంట్లో ఉన్న అంజలి వీళ్ళని అక్కడే కొద్ది రోజులు బంధించి ఇంట్లో పనులు చేయించుకుని తర్వాత దొంగతనాలు మానేసి బుద్ధిగా బతకమని వదిలేస్తుంది. వీళ్ళు వెళ్ళేటపుడు బాలు దొంగతనంగా అంజలి డైరీ తమతో పాటు తీసుకుని వెళతారు. దాని ద్వారా ఆమె గతం గురించి తెలుసుకుంటాడు రాజా. అతని జీవన విధానంలో నెమ్మదిగా మార్పు వస్తుంది.
అంజలి తండ్రి లాయర్ విశ్వనాథం. ఆయన అంజలి తల్లితో రహస్యంగా పెళ్ళి చేసుకుని వదిలేసి ఉంటాడు. తర్వాత భాగ్యలక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈలోపు అంజలి తల్లి మరణిస్తుంది. విశ్వనాథం భార్యకు భయపడి ఈమె బాగోగులు పెద్దగా పట్టించుకోడు. కానీ కొద్ది రోజులకు ఆమె మీద జాలితో స్నేహితుడి కూతురని అబద్ధం చెప్పి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళంతా ఆమెను పనిమనిషిలా చూస్తుంటారు. ఇదంతా తెలుసుకున్న రాజాకు ఆమె మీద జాలితో పాటు నెమ్మదిగా అభిమానం పెరుగుతుంది.
తారాగణంసవరించు
- రాజా గా వెంకటేష్
- అంజలి గా సౌందర్య
- బాలు గా సుధాకర్
- సంజయ్ గా అబ్బాస్
- విశ్వనాథం గా చంద్రమోహన్
- భాగ్యలక్ష్మి గా వై. విజయ
- తనికెళ్ళ భరణి
- సన
- దాదా గా బ్రహ్మానందం
- రాజా ఇంటి యజమాని గా ఎ. వి. ఎస్
- తన స్వంత పాత్రలో కె. చక్రవర్తి
- టీవీ యాంకర్ గా అనితా చౌదరి
- పోలీసు కానిస్టేబుల్ గా గౌతంరాజు
- అంజలి తల్లి గా అన్నపూర్ణ
- స్వామీజీ గా జూనియర్ రేలంగి
పాటలుసవరించు
- ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
- మల్లెల వానా మల్లెల వానా
- కవ్వించకే ఓ ప్రేమా
- పల్లవించు తొలి రాగమే సూర్యోదయం
- కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది