అనితా చౌదరి
అనితా చౌదరి తెలుగు సినిమా, టివి నటి, వ్యాఖ్యాత. యాంకరింగ్, సీరియళ్ళతో అడుగుపెట్టి వెండితెర మీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.
అనితా చౌదరి | |
---|---|
జననం | అనితా చౌదరి కలకత్తా[1] |
వృత్తి | వ్యాఖ్యాత |
జననం - విద్యాభ్యాసం సవరించు
అనిత కలకత్తాలో జన్మించింది. చదువంతా హైదరాబాదులోనే కొనసాగింది. ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, డాన్స్ బ్యాలేలూ, కథక్ నేర్చుకొన్నది. అనిత డ్యాన్స్ చూసిన అశోక్‌రావు టెలిఫిల్మ్‌లో అవకాశం ఇచ్చాడు. కానీ, అది ప్రసారం కాలేదు.
టివిరంగం సవరించు
ఇంటర్ చదువుతున్నప్పుడు ఈటీవీలో యాంకర్ల కోసం ఆడిషన్లు జరుగుతున్నాయంటే తన ఫ్రెండ్స్ తనకి తెలియకుండా ఫొటో పంపించగా, ఆడిషన్‌కు వెళ్ళింది. బ్రహ్మానందంతో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేయమని కొన్నిరోజుల తరువాత ఈటీవీ నుంచి పిలుపువచ్చింది. ఆ కార్యక్రమం హిట్ అయింది. తరవాత నరేష్ తో కలిసి కౌంట్‌డౌన్ కార్యక్రమం, పబ్లిక్ డిమాండ్ లైవ్ షో కార్యక్రమాలు చేసింది. అప్పటినుంచి అన్నీ వరుస అవకాశాలు వచ్చాయి. తరువాత మంజులా నాయుడు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన కస్తూరి డైలీ సీరియల్లో నటించడంతో అనితా చౌదరికి గుర్తింపు వచ్చింది. వరసగా ఆ సీరియల్‌కి ఏడు సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డుని అందుకొన్నది.
నటించినవి సవరించు
- కస్తూరి
- ఋతురాగాలు
- నాన్న (జెమిని టివి)
సినిమారంగం సవరించు
శ్రీకాంత్ హీరోగా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తాళి సినిమా తీస్తున్న సమయంలో హీరోయిన్ పాత్రకోసం అనితకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. షూటింగ్ ఆరునెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో అనిత ఆ సినిమా చేయలేదు. 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన రాజా సినిమాలో టివి యాంకర్ పాత్రలో తొలిసారిగా నటించింది. ఆతర్వాత దాదాపు 50 సినిమాల్లో నటించింది.
నటించిన సినిమాలు సవరించు
- రాజా (1999)
- మురారి
- సంతోషం (2002)
- ఆనందం
- ప్రాణం
- నువ్వే నువ్వే (2002)
- గోల్మాల్ (2003)
- ఓరి నీ ప్రేమ బంగారంగానూ
- ఛత్రపతి
- ఉయ్యాల జంపాల (2013)
- రాజ్ (2001)
- వరుడు (2010)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- మన్మధుడు (2002)
- నీ ప్రేమకై
- జై శ్రీరామ్ (2013)[2]
- కేరింత (2015)[3]
- తులసీదళం (2016)[4]
- గురు (2017)[5]
- సైకిల్ (2021)
- కరణ్ అర్జున్ (2022)
మూలాలు సవరించు
- ↑ "ఎంత వరకూ వచ్చిందీ మీ ప్రేమాయణం?". ఈనాడు.నెట్. ఈనాడు. 9 May 2018. Archived from the original on 10 May 2018. Retrieved 10 May 2018.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ "Kerintha: Coming-of-age stories".
- ↑ India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.
- ↑ తుపాకి, రివ్యూ (31 March 2017). "గురు సినిమా రివ్యూ". www.tupaki.com. Archived from the original on 8 జూన్ 2020. Retrieved 8 June 2020.