రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT).దీనిని ఆంధ్రప్రదేశ్ - ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా కూడా వ్యవహరిస్తారు (AP-IIIT). దీనిని సాధారణంగా ట్రిపులైటీలంటారు. ఇది ఎంతో మందికి సుపరిచితమైన పదము. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టం 18-2008 ద్వారా ఏర్పాటు చేయబడింది. దీనిని కీర్తిశేషులు ముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థాపించారు. దీనికి చాన్సలర్ గా, అమెరికాలో పిట్స్ బర్గ్న్లోని కార్నిగీమెల్లన్ యూనివర్సిటీలో అచార్యులుగా ఉన్న డా. రాజ్ రెడ్డిని నియమించారు. ఇది ఆరేళ్ళ ఇంటిగ్రేటిడ్ కోర్సు (ఇంటర్ + బీ. టెక్). ఇక్కడ చేరడానికి ఎటువంటి ప్రవేశ పరీక్ష వుండదు. పదవతరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారిని ప్రతిభ ఆధారంగా తీసుకుంటారు. దీనిని 2000-2009 విద్యా సంవత్సరములో స్థాపించారు.
రకం | కళాశాల |
---|---|
స్థాపితం | 2008 |
ఛాన్సలర్ | ప్రొ. డి. రాజ రెడ్డి |
వైస్ ఛాన్సలర్ | ప్రొ. ఆర్.వి. రాజ కుమార్ |
స్థానం | Gachibowli, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, భారతదేశము |
కాంపస్ | అర్బన్ |
రంగులు | |
జాలగూడు | www.rgukt.in |
ప్రవేశార్హతలు
మార్చుపదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారిని తీసుకుంటారు.
ఉపకులపతి
మార్చుఈ విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. కె.సి రెడ్డి వ్యవహరించారు. ఆ తరువాత ఉప కులపతిగా ప్రొ.రాజ్ కుమార్ నియమించబడ్డారు.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
మార్చుఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
వివిధ శాఖలు
మార్చు- ఇది ఆంధ్రప్రదేశ్ లో మూడు శాఖలను కలిగి ఉంది.అవి :
- ఇడుపులపాయ: ఇది కడప జిల్లాలోని పులివెందుల సమీపములో గల వేంపల్లి మండలంలో ఉంది. దీనిని ఆర్కెవాలీ అంటారు. ఇది కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణములో ఉంది. ఇది కడప నుంచి సుమారు 60 కి.మీ దూరములో ఉంది. ఇక్కడికి పోవుటకు కడప నుండి వేంపల్లి ఆర్టీసీ బస్సులు, జీపులు వుంటాయి.
- నూజివీడు: ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఇది విజయవాడ నుంచి సుమారు 59 కి.మీ దూరములో ఉంది. విజయవాడ - విశాఖపట్నం మార్గంలో నూజివీడు రైల్వే స్టేషను ఉంది.
- బాసర: ఇది అదిలాబద్ జిల్లాలోని ముధోల్ మండలానికి చెందిన గ్రామం. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. ఇక్కడికి పోవుటకు హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్, భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
ప్రశంశలు
మార్చుదీని వలన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.పేదలకు ఉచితంగా ఐఐటీ విద్యను అందిస్తుంది.ఇందులో ప్రస్తుతం 18,000 మంది విద్యనభ్యసిస్తున్నారు.
సీట్లు
మార్చుమొదటి రెందు సంవత్సరాలు ఒక్కొక్క కాంపస్ కు 2000 సీట్లు ఇచ్చారుకాని2010 -2011 బాచ్ నుంచి కాంపస్కు 1000 సీట్లుమాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఈ విశ్వ విద్యాలయంలో 6000 మంది విద్యను అభ్యసిస్తున్నారు.