రాజౌరీ జిల్లా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా
(రాజౌరీ నుండి దారిమార్పు చెందింది)

జమ్మూ , కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో రాజౌరీ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో పూంచ్ (జమ్మూ , కాశ్మీర్]] దక్షిణ సరిహద్దులో నౌషెరా , చాంబు ఉన్నాయి. రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ (బారోలు) ఉన్నాయి : ఈ భూభాగం అత్యంత సారవంతం , పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న, వరి పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు , ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి , డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు , గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు , గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐకమత్యంగా మెలుగుతుంటారు. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు , ఇతరులు ఉన్నారు.

చరిత్రసవరించు

రాజౌరీ పూర్వంలో రాజపుర అని పిలువబడేది. మహాభారత కాలంలో దీనికి ప్రాధాన్యత ఉండేది.[1] ఇదుకు చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ వద్ద కొంత ఆధారాలు ఉన్నాయి.[2] రాజౌరీ, పూంచ్ , అభిసర కాంభోజరాజ్య ఆధీనంలో ఉంటూ ఉండేది.[3] పురాణ కాలంలో ఈ ప్రాంతం రాజపురం కాంభోజ రాజ్యంలో భాగమై ఉండేది. కామ-రాజపురం - గత్వ-కాంభోజ-నిర్జితస్వ..[4]

నిర్వహణసవరించు

 • పుల్వామా జిల్లాలో 7 తెహ్సిల్స్ ఉన్నాయి : రాజౌరీ, డర్హల్, సునర్బని, కోటెరంక, నౌషెరా, తన్నమండి , కలకోట్.
 • జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి : రాజౌరీ, డర్హల్, సునర్బని, డూంగి, నౌషెహ్రా, కలకోట్, మంజకోటె, తన్నమండ్ , బుధ.[5] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.

రాజకీయాలుసవరించు

రాజౌరీ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : నౌషెరా, డర్హల్, రాజౌరీ , కాలకోట్.[6]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 642,415, [7]
ఇది దాదాపు. సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 518 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 235 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.14%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 863: 1000 [7]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.54%.[7]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

 1. MBH 7.4.5; 7/91/39-40.
 2. Watters, Yuan Chawang, Vol I, p 284.
 3. See: Political History of Ancient India, 1996, pp 133, 219/220, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; A History of India, pp 269-71, N. R. Ray, N. K. Sinha.
 4. Mahabharata 7.4.5.
 5. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
 6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 22 అక్టోబర్ 2008. Retrieved 28 August 2008. Check date values in: |archive-date= (help)
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Solomon Islands 571,890 July 2011 est. line feed character in |quote= at position 16 (help)
 9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 30 September 2011. Vermont 625,741 line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులుసవరించు