రాజ్ (సినిమా)
రాజ్ వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 2011 తెలుగు చిత్రం. కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై నిర్మించారు. సుమంత్, ప్రియమణి, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. కోటి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. [1] ఇది 2011 ఫిబ్రవరి చివరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీన్ని తరువాత తమిళ, మలయాళాల్లోకి మహారాణి -ది బ్యూటీ క్వీన్ అనే పేరుతో అనువదించారు. హిందీతోపాటు ఇతర ఉత్తర భారతీయ భాషలన్నిటికీ ఈ చిత్రపు హక్కులను ఆర్కెడి స్టూడియోస్ కొనుగోలు చేసింది.
రాజ్ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.ఎన్.ఆదిత్య |
---|---|
కథ | వి.ఎన్.ఆదిత్య |
చిత్రానువాదం | వి.ఎన్.ఆదిత్య |
తారాగణం | సుమంత్, ప్రియామణి, విమలా రామన్, గిరిబాబు, గుండు హనుమంతరావు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | కుమార్ బ్రదర్స్ సినిమా |
విడుదల తేదీ | 2011 మార్చి 18 |
నిడివి | 110 ని. |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుఈ కథ రాజ్ (సుమంత్) అనే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, అతని భార్య మైథిలి (ప్రియమణి), అతని మాజీ ప్రేయసి ప్రియ (విమల రామన్) ల మధ్య నడుస్తుంది. ప్రియ గురించి మిథిలీకి చెప్పకూడదని రాజ్ అనుకుంటాడు. పెళ్ళైన తొలినాళ్ళలో భార్యతో సర్దుబాటు చేసుకోవడం అతడికి చాలా కష్టమౌతుంది. అయితే, కాలం గడిచేకొద్దీ వారి అనుబంధం మెరుగుపడుతుంది. చివరకు వారు దగ్గరవుతారు. పరిస్థితులు చక్కబడుతూ ఉండే సమయానికి అనుకోకుండా ప్రియ రాజ్ జీవితంలోకి తిరిగి వస్తుంది. అంతకుముందు ప్రియ తనను ఎందుకు అకస్మాత్తుగా విడిచిపెట్టిందో తెలుసుకోవాలని రాజ్‌కు కుతూహలం కలిగింది. తరువాత ప్రియ పాత ప్రేమికుడు (అజయ్) ఆమెను కిడ్నాప్ చేస్తాడు. రాజ్ ఆమెను కాపాడుతాడు. ఊహించని మలుపులో మైథిలి ప్రియలు పాఠశాలలో క్లాస్‌మేట్లని తెలుస్తుంది. రాజ్ తరువాత ప్రియ అసలు ఉద్దేశ్యాన్ని వెలికితీసి, మైథిలికి నిజం చెప్పి, భార్యతో రాజీపడతాడు. [2]
తారాగణం
మార్చు- సుమంత్ . . . . రాజ్
- విమల రామన్ . . . . ప్రియా
- ప్రియమణి . . . . మైథిలీ
- అజయ్ . . . . ప్రియా మాజీ ప్రేమికుడు
- మురళి మోహన్
- సత్యం రాజేష్
- గిరి బాబు
పాటలు
మార్చు- "సూటిగా చూసేవా" | హేమచంద్ర, సునీత
- "అందముతో పందెముగా" | సిద్ధార్థ్, మాలవికా
- "కలకాదుగ" | శశికిరణ్, అంజనా సౌమ్య
- "నన్నే నేను మరిచిపోయా" | దీపు, శ్రావణ భార్గవి
- "ప్రతీ కళా నాలో" | శ్రీకృష్ణ, ప్రణవి
- "భీమవరం బుల్లోడా" | శ్రీకృష్ణ, సునీత
మూలాలు
మార్చు- ↑ "Raaj Telugu Movie Promo Songs". Archived from the original on 2013-12-05. Retrieved 2020-08-08.
- ↑ "Sumanth's RAJ releasing on 25th of this month || Movie Multiplex". Mysitemania.blogspot.com. Archived from the original on 2012-07-17. Retrieved 2012-08-04.