రాజా (1999 సినిమా)

1999 సినిమా
(రాజ (1999 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

రాజా 1999 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా.[1] ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998 లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్ అనే సినిమాకు పునర్నిర్మాణం.

రాజా
దర్శకత్వంముప్పలనేని శివ
రచనరాజేంద్రకుమార్
స్క్రీన్ ప్లేముప్పలనేని శివ
కథవిక్రమన్
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంవెంకటేష్,
సౌందర్య
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 18, 1999 (1999-03-18)[1]
భాషతెలుగు

రాజా, బాలు తోడుదొంగలు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. ఒకసారి వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించడానికి ఒప్పుకుని పోలీసులకు భయపడి ఒక ఇంట్లో దాక్కుంటారు. ఆ ఇంట్లో ఉన్న అంజలి వీళ్ళని అక్కడే కొద్ది రోజులు బంధించి ఇంట్లో పనులు చేయించుకుని తర్వాత దొంగతనాలు మానేసి బుద్ధిగా బతకమని వదిలేస్తుంది. వీళ్ళు వెళ్ళేటపుడు బాలు దొంగతనంగా అంజలి డైరీ తమతో పాటు తీసుకుని వెళతారు. దాని ద్వారా ఆమె గతం గురించి తెలుసుకుంటాడు రాజా. అతని జీవన విధానంలో నెమ్మదిగా మార్పు వస్తుంది.

అంజలి తండ్రి లాయర్ విశ్వనాథం. ఆయన అంజలి తల్లిni రహస్యంగా పెళ్ళి చేసుకుని వదిలేసి ఉంటాడు. తర్వాత భాగ్యలక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈలోపు అంజలి తల్లి మరణిస్తుంది. విశ్వనాథం భార్యకు భయపడి ఈమె బాగోగులు పెద్దగా పట్టించుకోడు. కానీ కొద్ది రోజులకు ఆమె మీద జాలితో స్నేహితుడి కూతురని అబద్ధం చెప్పి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళంతా ఆమెను పనిమనిషిలా చూస్తుంటారు. ఒకసారి భాగ్యలక్ష్మి తమ్ముడు విదేశాల నుంచి వస్తాడు. అంజలి అంటే అభిమానం చూపిస్తాడు. విశ్వనాథం ఆమెను అతనికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ అతను ఒప్పుకోడు. ఇదంతా తెలుసుకున్న రాజాకు ఆమె మీద జాలితో పాటు నెమ్మదిగా అభిమానం పెరుగుతుంది.

బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళి తిరిగొచ్చిన భాగ్యలక్ష్మికి ఇంట్లో నెక్లెస్ పోయిందని అంజలి మీద అబాండం వేస్తుంది. ఈలోపు రాజా, బాలు వదిలేసిన సిగరెట్ల ముక్కలు చూసి ఆమెను అవమానించి ఇంటిలోనుంచి తరిమేస్తారు. విశ్వనాథం కూడా ఏమీ చేయలేక ఊరుకుంటాడు. తమ వల్లనే అంజలికి ఈ గతి పట్టిందని బాధపడ్డ రాజా ఆమెను ఒక లేడీస్ హాస్టల్ లో చేర్చి ఆమె బాగోగులు చూసుకుంటాడు. ఆమె కోసం నిజాయితీగా కష్టపడటం మొదలుపెడతాడు. ఆమెకు సంగీతంలో ఉన్న అభినివేశాన్ని గుర్తించి ఆమెకు శిక్షణ ఇప్పిస్తాడు. ఆమెకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి ఆమెను ఓ మంచి గాయనిని చేస్తాడు. ఆమెకు బాగా అవకాశాలు వచ్చి విజయవంతమైన గాయనిగా పేరు తెచ్చుకుంటుంది.

ఒకానొక ఇంటర్వ్యూలో ఆమెను తండ్రి గురించి అడగ్గా చెప్పుకోవడానికి మొహమాటపడుతూ ఉండగా విశ్వనాథం ఫోన్ చేసి తానే ఆమె తండ్రిని అని ధైర్యంగా చెప్పమంటాడు. దాంతో భాగ్యలక్ష్మి మొదట విస్తుపోయినా తర్వాత అంజలిని బంగారు గుడ్లు పెట్టే బాతుగా భావించి ఆమె దగ్గరకే అందరూ వచ్చేస్తారు. రాజా, బాలును నెమ్మదిగా పక్కకు పెట్టడం మొదలుపెడతారు. అంజలికి రాజా మీద నమ్మకం పోయేలా చేస్తారు. రాజా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మామూలు జీవితం గడుపుతుంటాడు. ఈ లోపు భాగ్యలక్ష్మి తన తమ్ముడికి అంజలినిచ్చి పెళ్ళి చేయాలని చూస్తుంది. అదే సమయంలో అంజలికి జాతీయ పురస్కారం వస్తుంది. ఆమె ఆ సన్మాన సభలో అందరికీ నిజాలు వెల్లడించి రాజానే తన భర్తగా ఎన్నుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  • ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ (ఫిమేల్ వాయిస్) కె ఎస్ చిత్ర , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • మల్లెల వానా మల్లెల వానా , మనో, చిత్ర, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • కవ్వించకే ఓ ప్రేమా , రాజేష్ కృష్ణన్,సుజాత మోహన్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • పల్లవించు తొలి రాగమే సూర్యోదయం , కె ఎస్ చిత్ర, రచన: షణ్ముఖ శర్మ
  • ఏదో ఓక రాగం ,(మేల్ వాయిస్), ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • షేప్ చూసి, గోపాలరావు, అనుపమ, రచన: ఇ. ఎస్. మూర్తి
  • కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది , చిత్ర, ఉన్ని కృష్ణన్ రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "రాజా". Retrieved 24 February 2018.