రాట్నాలకుంట, ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామం ఏలూరు జిల్లా, ఏలూరు జిల్లాలకు సరిహద్దు గ్రామంగా ఉంది. అదేవిధెగా, పశ్చిమాన కృష్ణా జిల్లాకు చెందిన ముసునూరు గ్రామం ఉంది.

రాట్నాలకుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాట్నాలకుంట is located in Andhra Pradesh
రాట్నాలకుంట
రాట్నాలకుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°50′11″N 81°04′12″E / 16.836501°N 81.070089°E / 16.836501; 81.070089
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం పెదవేగి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534475
ఎస్.టి.డి కోడ్ 08812
గ్రామంలో ప్రధానవీధి

వ్యవసాయం

మార్చు

ఇక్కడ మెరక తోటల వ్యవసాయం అధికం. కొబ్బరి, పామాయిల్, మామిడి, కూరగాయలు, మల్బరీ, ప్రొద్దుతిరుగుడు వంటివి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు.

దేవాలయాలు

మార్చు
దస్త్రం:APvillage Ratnalakunta 1.JPG
రాట్నాలమ్మ తల్లి దేవాలయం
 
రాట్నాలమ్మ తల్లి దేవాలయం వెలుపలి బోర్డు "జంతు బలులు నిషేధం"

ఇక్కడి గ్రామ దేవత రాట్నాలమ్మ తల్లి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుప బడుతున్నది. మందిరం పునర్నిర్మాణం ప్రణాళిక జరుగుతున్నది.

రవాణా

మార్చు

ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళే రహదారిపై ఉన్న విజయరాయి గ్రామం నుండి కి.మీ దూరంలో రాట్నాలకుంట ఉంది. ఈ గ్రామం ఏలూరు నుండి 13 కి.మీ. దూరంలో ఉంది.

రోడ్డు

మార్చు

రాట్నాలకుంట గ్రామానికి దగ్గరగా ఉన్న ఏలూరు నగరం నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చును.

బస్సు

మార్చు

పెదవేగి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ప్రయాణ ప్రాంగణం నుండి ఈ గ్రామానికి రవాణా సౌకర్యం ఉంది. అదేవిధముగా, రాట్నాలకుంట నుండి ఇతర అనేక నగరాల నుండి అనేక ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల సౌకర్యం కూడా ఉంది.

ఈ గ్రామానికి దెందులూరు రైల్వే స్టేషను, ఏలూరు దగ్గరలోని పవర్ పేట రైల్వే స్టేషను, ఏలూరు రైల్వే స్టేషను ద్వారా ఇతర నగరాల నుండి చేరుకోవచ్చును. అయినప్పటికి, ఈ గ్రామం నుండి అతి పెద్ద విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 68 కి.మీ. దూరాన ఉంది.

విద్య

మార్చు

సమీప కళాశాలలు

మార్చు
  1. ఎపిఎస్‌డబ్ల్యు రెసిడెన్‌షియల్ జూనియర్ కాలేజీ (బాయ్స్), పెదవేగి.
  2. డి-పాల్ జూనియర్ కాలేజీ, పినకడిమి.
  3. లూర్ధ్ మాతా జూనియర్ కాలేజీ, వేగివాడ, పెదవేగి.
  4. సెయింట్ విన్‌సెంట్ డి-పాల్ డిగ్రీ కాలేజీ, ఎ.దుగ్గిరాల, ఏలూరు.
  5. విజ్ఞాన నిలయం డిగ్రీ కాలేజీ.

సమీప పాఠశాలలు

మార్చు
  1. జవహర్ నవోదయ విద్యాలయం, పెదవేగి.
  2. శ్రీ సాయి పబ్లిక్ స్కూలు
  3. ఎస్.ఎం.సి. పబ్లిక్ స్కూలు

గ్రామ ప్రత్యేకతలు

మార్చు

2016 సం.లో రియో ​​నగరం వద్ద జరిగిన ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ చేరుకుని రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు తండ్రి పి.వి. రమణ నివసించిన గ్రామం, ఈ గ్రామంలోని రాట్నాలమ్మ తల్లి వీళ్ళ ఇంటికి కులదేవత.[1]:

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రాట్నాలమ్మ వారి ఆలయం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-23.

వెలుపలి లంకెలు

మార్చు