రాడ్ మార్ష్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు

రాడ్ మార్ష్ (ఆగ్లం: Rodney William Marsh) (నవంబర్ 4, 1947 - మార్చి 4, 2022) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను వికెట్ కీపర్‌గా జట్టులో బాగా స్థిరపడ్డాడు. 1970-71 వరకు టెస్ట్ క్రికెట్ ఆడి 96 టెస్టులలో వికెట్ కీపర్‌గా 355 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసిన ఘనత పొందినాడు. ఇది అప్పటికి ప్రపంచ రికార్డు. సహచరుడు డెన్నిస్ లిల్లీ కూడా ఇదే సంఖ్యలో బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించాడు. బౌలింగ్, కీపింగ్ లలో ఈ జంటను మంచి భాగస్వామ్య జంటగా పరిగణిస్తారు. లిల్లీ బౌలింగ్‌లోనే మార్ష్ 95 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేయడంలో తన పాత్ర వహించాడు.

రాడ్ మార్ష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాడ్నీ విలియం మార్ష్
పుట్టిన తేదీ (1947-11-04) 1947 నవంబరు 4 (వయసు 76)
ఆర్మడేల్, ఆస్ట్రేలియా
మారుపేరుబచ్చూస్, ఐరన్ గ్లోవ్స్
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్ కీపర్, క్రికెట్ శిక్షకుడు
బంధువులుగ్రాహం మార్ష్ (సోదరుడు)
డేనియల్ మార్ష్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 249)1970 నవంబరు 27 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1984 జనవరి 6 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 7)1971 జనవరి 5 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1984 ఫిబ్రవరి 12 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1969–1984Western Australia
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 96 92 257 140
చేసిన పరుగులు 3,633 1,225 11,067 2,119
బ్యాటింగు సగటు 26.51 20.08 31.17 23.03
100లు/50లు 3/16 0/4 12/55 0/9
అత్యుత్తమ స్కోరు 132 66 236 99*
వేసిన బంతులు 72 0 142 23
వికెట్లు 0 1 0
బౌలింగు సగటు 84.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 343/12 120/4 803/66 182/6
మూలం: Cricinfo, 2008 నవంబరు 20

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

రాడ్ మార్ష్ 95 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 343 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లతో 355 బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. బ్యాటింగ్‌లో 26.51 సగటుతో 3633 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 132 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

రాడ్ మార్ష్ 92 వన్డేలు ఆడి 120 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లతో 124 బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపడంలో సఫలుడైనాడు. బ్యాటింగ్‌లో 20.08 సగటుతో 1225 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 66 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్ మార్చు

మార్ష్ 1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఇయాన్ చాపెల్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి వికెట్ కీపర్ విధులను నిర్వహించాడు. 1983లో మూడవ ప్రపంచ కప్‌లో కిమ్ హ్యుగ్స్ నాయకత్వంలోని జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

మరణం మార్చు

74 ఏళ్ల వయసులో రాడ్ మార్ష్ 2022 మార్చి 4న క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో నిధుల సేకరణ కార్యక్రమంలో గుండెపోటుతో మరణించాడు.[1]

మూలాలు మార్చు

  1. "ఆస్ట్రేలియాn లెజెండరీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి". andhrajyothy. Retrieved 4 మార్చి 2022.

ఇతర లింకులు మార్చు