రాణి పులోమజాదేవి

రాణి పులోమజాదేవి(Rani Pulomajadevi) తెలుగు సినిమా పాటల రచయిత్రి, తెలుగు రచయిత్రి. ఆమె ప్రపంచంలో అత్యధిక పాటలు (789) వ్రాసిన తొలి మహిళా గేయరచయిత్రిగా గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. ఆమె అనేక పత్రికలలో కథలను వ్రాసారు.[1] ఆమె రాసిన కథలను "రాణి పులోమజాదేవి కథలు" పేరుతో పుస్తకాన్ని వ్రాసారు.[2]

రాణి పులోమజాదేవి

జీవిత విశేషాలు

మార్చు

ఆమె సుబ్రహ్మణ్య శర్మ,లలితాదేవి దంపతులకు నవంబరు 11 1967 న జన్మించారు. గణితశాస్త్రంలో బి.యస్సీ చదివారు. ఉప ఉపాధి అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రవృత్తి పరంగా సినీ గేయ రచన, నాటక రచన, కథారచనలు చేసేవారు. ఆమె భర్త అర్జున్‌ సీనియర్‌ సంగీత దర్శకుడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సినిమా ప్రస్థానం

మార్చు

2007లో ‘బుల్లెబ్బాయ్‌’ అనే సినిమాతో పాటలు రాయడం ప్రారంభించిన ఆమె కేవలం ఈ ఎనిమిదేళ్ల కాలంలోనే 60 సినిమాలకు పైగా పాటలు రాశారు. డబ్బింగ్‌ సినిమాలు, లలిత గీతాలు కలుపుకొని ఇప్పటివరకూ 789 పాటలు రచించారు. లలిత గీతాలు, ఇతర సాంస్కృతిక సంబంధించిన గీతాలు అందించిన ఘనత ఆమె సొంతం. గురుకిరణ్‌, తమన్‌, అర్జున్‌ సంగీత దర్శకత్వంలో పాటలు రాసిన ఆమె రాంగోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్‌’లో కూడా తన కుమారుడు ప్రద్యోతన్‌ సంగీత దర్శకత్వంలో పాట రాయడం విశేషం. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర పోషించిన ‘జెంటిల్మన్‌’ సినిమాలో ఇంగ్లీష్‌ డ్యూయెట్‌ను కూడా రాశారు.[3][4]

పురస్కారాలు

మార్చు
  • ఉత్తమ గేయరచయిత్రి 2012 -భరతముని అకాడమి.[5]
  • బెస్ట్ లేడీ 2010(సినీగీత రచన) - అభినందన సంస్థ , హైదరాబాద్.
  • విశిష్ట మహిళ - యునెస్కో క్లబ్
  • ఆకెళ్ళ సాహితీ పురస్కారం - 2013
  • గౌరవ డాక్టరేట్ - USSRD యునివర్సిటీ
  • GENUIS BOOK, WONDER BOOK OF WORLD RECORDS.[6]
  • మహిళారత్న పురస్కారం 2015

ఆమె గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 16, 2015 న ఆపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

మూలాలు

మార్చు
  1. రచయిత: రాణి పులోమజాదేవి - కథానిలయంలో
  2. రాణీ పులోమజాదేవి కథలు కథా సంపుటి
  3. "గేయ రచయిత్రి రాణి పులోమజాదేవి మృతి Updated : 22-Sep-2015". Archived from the original on 2015-09-24. Retrieved 2016-06-19.
  4. "రచయిత్రి రాణి పులోమజాదేవి ఇక లేరు". Archived from the original on 2016-09-03. Retrieved 2016-06-19.
  5. గేయ రచయిత్రి రాణీపులోమజాదేవి మృతి Published on: 22nd, Sep-2015[permanent dead link]
  6. GENUIS BOOK records[permanent dead link]

ఇతర లింకులు

మార్చు