రాపాక వరప్రసాద రావు

రాపాక వరప్రసాద రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు రాజోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాపాక వరప్రసాద రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు గొల్లపల్లి సూర్యారావు
తరువాత దేవ వరప్రసాద్
నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు అల్లూరి కృష్ణం రాజు
తరువాత గొల్లపల్లి సూర్యారావు
నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ,
జనసేన పార్టీ
తల్లిదండ్రులు వెంకట రావు
జీవిత భాగస్వామి నాగరత్నం
సంతానం రాపాక వెంకట్‌ రామ్‌ [1]
నివాసం చింతలమోరి గ్రామం, మలికిపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

జననం, విద్యాభాస్యం

మార్చు

రాపాక వరప్రసాద రావు 1958లోఆంధ్రప్రదేశ్,తూర్పు గోదావరి జిల్లా,మలికిపురం మండలం, చింతలమోరి గ్రామంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ లో చేరి బీఏ మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం

మార్చు

రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నల్లి వెంకటకృష్ణ మల్లిక్ పై 5869 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించగా టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] రాపాక వరప్రసాద్ 14 సెప్టెంబర్ 2018లో జనసేన పార్టీలో చేరి[3] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (4 December 2020). "వైఎస్సార్‌ సీపీలో చేరిన రాపాక వెంకట్ రామ్". Archived from the original on 31 డిసెంబరు 2021. Retrieved 31 December 2021.
  2. Sakshi (15 April 2014). "రాజోలులో బిజేపీ 'గోచీ కోసం పేచీ'!". Retrieved 31 December 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. The Hans India (14 September 2018). "Ex-MLA Rapaka Varaprasad to join Jana Sena" (in ఇంగ్లీష్). Archived from the original on 31 డిసెంబరు 2021. Retrieved 31 December 2021.