రాబర్ట్ ఆల్ట్‌మాన్
రాబర్ట్ బెర్నార్డ్ ఆల్ట్‌మాన్ (1925, ఫిబ్రవరి 20 - 2006, నవంబరు 20) అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. ఐదుసార్లు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
రాబర్ట్ ఆల్ట్‌మాన్ | |
---|---|
జననం | రాబర్ట్ బెర్నార్డ్ ఆల్ట్‌మాన్ 1925 ఫిబ్రవరి 20 కాన్సాస్ సిటీ, మిస్సౌరీ, యుఎస్ |
మరణం | 2006 నవంబరు 20 | (వయసు 81)
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. |
క్రియాశీల సంవత్సరాలు | 1947–2006 |
జీవిత భాగస్వామి | లావోన్నే ఎల్మెర్
(m. 1946–1951)లోటస్ కోరెల్లి (m. 1954–1957)కాథరిన్ రీడ్ (m. 1959) |
పిల్లలు | 6, స్టీఫెన్ ఆల్ట్‌మాన్ |
ఆల్ట్‌మాన్ సినిమాలు అనేక శైలులను కలిగి ఉంటాయి. సాధారణంగా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వ్యంగ్యం, హాస్యం మీద ఆధారపడి ఉంటాయి. ఆల్ట్‌మాన్ "యాంటి-హాలీవుడ్", ఇతివృత్తాలు, దర్శకత్వ శైలి రెండింటిలోనూ నాన్-కన్ఫార్మిస్ట్‌గా ఖ్యాతిని పెంచుకున్నాడు.
జననం
మార్చుఆల్ట్మాన్ 1925, ఫిబ్రవరి 20న హెలెన్ - బెర్నార్డ్ క్లెమెంట్ ఆల్ట్‌మాన్ దంపతులకు మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో జన్మించాడు. కాన్సాస్ సిటీలోని రాక్‌హర్స్ట్ హైస్కూల్‌తోపాటు జెస్యూట్ పాఠశాలల్లో చదువుకున్నాడు.[1] 1943లో మిస్సౌరీలోని లెక్సింగ్టన్‌లోని వెంట్‌వర్త్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు.
సినిమారంగం
మార్చుతన సినిమాలలో పెద్ద సమిష్టి నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కువ నటీనటుల తో మల్టీట్రాక్ రికార్డింగ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశాడు. స్క్రీన్‌పై జరిగే కార్యాచరణను మెరుగుపరచడానికి అత్యంత మొబైల్ కెమెరా పనిని, జూమ్ లెన్స్‌లను కూడా ఉపయోగించాడు.[2] మాష్ (1970), మెక్‌కేబ్ అండ్ మిస్సెస్ మిల్లర్ (1971), ది లాంగ్ గుడ్‌బై (1973), నాష్‌విల్లే (1975), త్రీ ఉమెన్ (1977), ది ప్లేయర్ (1992), షార్ట్ కట్స్ (1993), గోస్ఫోర్డ్ పార్క్ (2001) వంటి సినిమాలు విజయాన్ని సాధించాయి. అవార్డులను కూడా తెచ్చాయి.
అవార్డులు
మార్చుసినిమారంగంలో ఆల్ట్‌మాన్ చేసిన కృషికి 2006లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ గౌరవ పురస్కారంతో సత్కరించింది. ఏడుసార్లు నామినేషన్లు పొందినప్నటికీ అతను ఎప్పుడూ కూడా ఆస్కార్ అవార్డను గెలుచుకోలేదు. అతని సినిమాలు మాష్, మెక్‌కేబ్ అండ్ మిస్సెస్ మిల్లర్, ది లాంగ్ గుడ్‌బై, నాష్‌విల్లే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీకి ఎంపికయ్యాయి. బెర్లిన్‌లో గోల్డెన్ బేర్, వెనిస్‌లో గోల్డెన్ లయన్, కేన్స్‌లో గోల్డెన్ పామ్ గెలుచుకున్న ముగ్గురు సినిమా నిర్మాతలలో ఆల్ట్‌మాన్ ఒకరు.
సంవత్సరం | పేరు | అకాడమీ అవార్డులు | బ్రిటీష్ అవార్డులు | గోల్డెన్ గ్లోబ్ అవార్డులు | |||
---|---|---|---|---|---|---|---|
నామినేషన్లు | గెలిచినవి | నామినేషన్లు | గెలిచినవి | నామినేషన్లు | గెలిచినవి | ||
1970 | మాష్ | 5 | 1 | 6 | 1 | 6 | 1 |
1971 | మెక్‌కేబ్ & మిస్సెస్ మిల్లర్ | 1 | 1 | ||||
1972 | ఇమేజేస్ | 1 | 1 | 1 | |||
1975 | నాష్విల్లే | 5 | 1 | 5 | 1 | 11 | 1 |
1977 | త్రీ వుమెన్ | 1 | |||||
1978 | ఏ వెడ్డింగ్ | 2 | 1 | ||||
1982 | కమ్ బ్యాక్ టు ది ఫైవ్ అండ్ డైమ్, జిమ్మీ డీన్, జిమ్మీ డీన్ | 1 | |||||
1992 | ది ప్లేయర్ | 3 | 5 | 2 | 4 | 2 | |
1993 | షార్ట్ కట్స్ | 1 | 2 | 1 | |||
1994 | ప్రెక్ట్-ఎ-పోర్టర్ | 2 | |||||
2001 | గోస్ఫోర్డ్ పార్క్ | 7 | 1 | 9 | 2 | 5 | 1 |
మొత్తం | 21 | 3 | 30 | 6 | 33 | 6 |
మరణం
మార్చుఆల్ట్మాన్ లుకేమియాతో బాధపడుతూ 81 సంవత్సరాల వయస్సులో 2006, నవంబరు 20న లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో మరణించాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Butler, Robert W. (March 5, 2006). "Finally, An Attitude Adjustment: Hollywood's Establishment Now Embraces Rebel Director Altman". The Kansas City Star. p. 5.
- ↑ John Wakeman, ed. World Film Directors – Vol. 2, H. W. Wilson Co., N.Y. (1988) pp. 29–39
- ↑ Lyman, Rick (November 22, 2006). "Robert Altman, Director With Daring, Dies at 81". The New York Times. Retrieved 2023-05-22.
- ↑ Ebert, Roger; Madsen, Virginia (November 10, 2008). "Robert Altman (1925 – 2006): His dangerous angel remembers". RogerEbert.com. Retrieved 2023-05-22.
బయటి లింకులు
మార్చు- ఫైండింగ్ ఎయిడ్స్ ఫర్ ది రాబర్ట్ ఆల్ట్‌మాన్ పేపర్స్ (1945-2007), స్పెషల్ కలెక్షన్స్ లైబ్రరీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాబర్ట్ ఆల్ట్‌మాన్ పేజీ
- రాబర్ట్ ఆల్ట్‌మాన్ at the Internet Broadway Database
- క్రైటీరియన్ కలెక్షన్ వద్ద రాబర్ట్ ఆల్ట్‌మాన్
- రాబర్ట్ ఆల్ట్‌మాన్ తన కెరీర్ గురించి చర్చిస్తున్నట్లు వినండి Archived 2012-01-19 at the Wayback Machine - బ్రిటిష్ లైబ్రరీ రికార్డింగ్.
- UC బర్కిలీ మీడియా రిసోర్సెస్ సెంటర్ ద్వారా రాబర్ట్ ఆల్ట్‌మాన్ గ్రంథ పట్టిక
- ఇంకా అల్లకల్లోలం– ది గార్డియన్, మే 1, 2004
- రివర్స్ షాట్ ఇంటర్వ్యూ
- ఎబర్ట్ యొక్క ఆల్ట్‌మాన్ హోమ్ కంపానియన్ Archived ఫిబ్రవరి 8, 2013 at the Wayback Machine
- గెరాల్డ్ పీరీ ఇంటర్వ్యూ Archived 2006-12-10 at the Wayback Machine
- రాబర్ట్ ఆల్ట్మన్పై సాహిత్యం
- "ఆల్ట్‌మాన్: మీరు ఒక కళాఖండంగా ప్రశంసించబడిన చిత్రానికి వెళతారా?" రోజర్ ఎబర్ట్ ద్వారా వద్ద Archived జూలై 22, 2012 at the Wayback Machine
- బాంబ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ వద్ద Archived నవంబరు 13, 2011 at the Wayback Machine
- ఆర్టిస్ట్ ఆఫ్ ది మంత్: హైనా ప్రొడక్షన్స్‌లో రాబర్ట్ ఆల్ట్‌మాన్ నవంబర్ 6, 2011న Archived నవంబరు 6, 2011 at the Wayback Machine
- రాబర్ట్ ఆల్ట్‌మాన్ సినిమాలు, హెల్ ఈజ్ ఫర్ హైఫెనేట్స్, జూన్ 30, 2014
- రాబర్ట్ ఆల్ట్‌మాన్ సంస్మరణ, స్టీఫెన్ రియా ద్వారా, 'ఫీల్డ్ డే రివ్యూ 3' (డబ్లిన్, 2007)