చిలుక
చిలుక (చిలక, రామచిలుక) ఒక రంగులతో ఆకర్షణీయంగా వుండే పక్షి. దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ , సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) , కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా , దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
చిలుక | |
---|---|
భారతదేశంలో కనిపించే రామచిలుక | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | సిట్టసిఫార్మిస్ |
Systematics | |
(but see below) Family Cacatuidae (cockatoos)
|
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు , చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని , చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి. చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.
భారతదేశములో చిలుక
మార్చుభారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట ఉంది. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా చిలుక[permanent dead link]ను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్తగా చూస్తే గాని చెప్పలేం.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో చిలుక పదానికి ముద్దుల చిలక, చిలక పలుకులు, అకుచిలక, గడ్డిచిలక, చిలుకలకొలికి లాంటి వివిధ ప్రయోగాలున్నాయి.[3]
వర్గీకరణ
మార్చుఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడా జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.
ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.
- జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,
కియ , కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.
- తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో
ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్
- ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
- ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
- ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్
ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు
- ఉపప్రజాతి అరినాయె: నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.[4][5]
- ఉపప్రజాతి లోరినాయె: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా, ఇండొనేషియా , ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన, సుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు, లోరికీట్లు ఉన్నాయి.
- ఉపప్రజాతి మైక్రొప్సిట్టినాయె:ఒకే వర్గానికి చెందిన 6 జాతుల పిగ్మీ చిలకలు ఉన్నాయి.
- ఉపప్రజాతి ప్సిట్టినాయె
- తెగ సైక్లోప్సిట్టాసిని: న్యూ గినియా, దగ్గరలో ఉన్న 3 వర్గాలకి చెందిన ఫిగ్ చిలకలు.
- తెగ పోలిటేలిని: పూర్వం వెడల్పు తోకలు కలిగిన చిలుకలతో కలుపబడిన, ఆస్ట్రేలియా , వెల్లసియాకు చెమ్దిన 3 వర్గాలు.
- తెగ ప్సిట్ట్రిచాదిని: ఒకే జాతి, పెస్క్వెట్ చిలక.
- తెగ ప్సిట్టాసిని: ఆఫ్రికా ఉష్ణ మండల చిలుకలు, ఒక 3 వర్గాలకి చెఆందిన 12 జాతులు
- తెగ ప్సిట్టాకులిని: పాలియో ఉష్ణమండలానికి చెందిన ప్సిట్టాకులైన్ చిలుకలు, ఇండియా నుండి ఆస్ట్రేలియా వరకు విస్తరించిఉన్న దగ్గరగా 12 వర్గాలకి చెందిన 70 జాతులు.
- ఉపప్రజాతిప్లాటిసెర్ సినాయె: ఒక్ డజను వర్గాలకి చెందిన 30 జాతులు, ముఖ్యంగా వెడల్పుతోక చిలుకలు.
- తెగ మెలోప్సిట్టాసిని: ఒక వర్గానికి చెందిన ఒక జాతిబడ్జరిగార్.
- తెగ నియోఫెమిని: రెండు వర్గాల చిన్న చిలుకలు.
- తెగ పెజోపోరిని: రెందు విభిన్నమైన జాతులు కల ఒకే వర్గము
- తెగ ప్లాటిసెర్సిని: రోసెల్లాలు , వాటి సంబంధం కలిగిన,8 వర్గాలకి చెందిన 20 జాతులు;
ఇతర సూచీలు
మార్చు- అన్ని చిలుకల సూచీ పేర్ల ఆధారంగా విభజించ గలవి 350 జాతులు.
- కకాటుయిడాయె జాతుల సూచీ , 7 వర్గాలలో ఉన్న 21 జాతులు
- [[చిలుకల ప్రజాతి సూచీ|నిజమైన చిలుకల సూచీ]] ప్సిట్టాసిడాయె వర్గంలోని 330 జాతులు.
- స్ట్రిగోపిడాయె సూచీ
- మకావ్ ల సూచీ
- అమెజాన్ చిలుకల సూచీ
- అరటింగా పారాకీట్ల సూచీ
మూలాలు
మార్చు- ↑ "Psittacine". American Heritage Dictionary of the English Language, Fourth Edition. Houghton Mifflin Company. 2000. Retrieved 2007-09-09.
- ↑ "Psittacine". Merriam-Webster Online Dictionary. Merriam-Webster, Inc. Retrieved 2007-09-09.
- ↑ "చిలుక( బ్రౌన్ నిఘంటువు)". DSAL.
- ↑ de Kloet, RS; de Kloet SR (2005). "The evolution of the spindlin gene in birds: Sequence analysis of an intron of the spindlin W and Z gene reveals four major divisions of the Psittaciformes". Molecular Phylogenetics and Evolution. 36 (3): 706–721. doi:10.1016/j.ympev.2005.03.013. PMID 16099384.
- ↑ Miyaki, Y.; Matioli, R.; Burke, T.; Wajntal, A. (1998). "Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence" (PDF). Molecular Biology and Evolution. 15 (5): 544–551.