రామన్నగూడెం (తాడేపల్లిగూడెం మండలం)

రామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]. తాడేపల్లిగూడెం నుండి పెదతాడేపల్లి మీదుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల వెళ్ళే రహదారిలో పెదతాడేపల్లి వరకు వెళ్ళి, అక్కడి నుండి ఊరి మధ్యలో ఉత్తరంగా 3 కిలోమీటర్లు వెళ్ళితే రామన్నగూడెం వస్తుంది. తాడేపల్లిగూడెం-నల్లజర్ల రహదారిలో పెదతాడేపల్లి తరువాత వచ్చే వెంకటరామన్నగూడెం, రామన్నగూడెంకు 2 కిలోమీటర్ల దూరంలో పశ్చిమంగా ఉంటుంది.

రామన్నగూడెం (తాడేపల్లిగూడెం మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తాడేపల్లిగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534146
ఎస్.టి.డి కోడ్

వ్యవసాయంసవరించు

రామన్నగూడెం వ్యవసాయ గ్రామం. వరి, చెరకు ప్రధానమైన పంటలు. మిరప, వంగ, కందులు వగైరా ఇతర పంటలు కూడా పండిస్తారు. మామిడి, జీడిమామిడి తోటలు కూడా ఉన్నాయి. వ్యవసాయానికి భూగర్భ జలమే ఆధారం.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.