రామాపురం (రాచర్ల)
రామాపురం ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామాపురం (రాచర్ల) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°26′41.748″N 79°1′53.148″E / 15.44493000°N 79.03143000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | రాచర్ల |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ భౌగోళికం
మార్చుఈ గ్రామం, గుంటూరు - గుంతకల్లు రైల్వే లైనుపై ఉన్న "సోమిదేవిపల్లె" రైల్వే స్టేషనుకు 4 కి.మీ. దూరంలో ఉంది. గిద్దలూరు నుండి 20 కి.మీ. దూరంలో ఉంది.
రవాణా సౌకర్యాలు
మార్చుసోమిదేవిపల్లె స్టేషనులో ప్యాసింజరు రైళ్ళు మాత్రమే ఆగుతవి. గిద్దలూరు నుండి బస్సు, ప్రయివేటు వాహన సౌకర్యాలు ఉన్నాయి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ సిద్ధిభైరవ స్వామి ఆలయం
మార్చుగ్రామంలోని ఈ ఆలయం, అతి పురాతనమైన శైవధామంగా వినుతికెక్కింది. రామాపురం గ్రామానికి ఈశాన్యంగా ఉన్న ఆవులకొండపై ఒకప్పుడు మునులు తపస్సు చేసుకోవడానికి ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ లింగమే శ్రీ సిద్ధిభైర్వస్వామిగా భక్తులచేత పూజలందుకొనుచున్నది. ఈ క్షేత్రం ఇంతటి పురాణ ప్రాశస్థాన్ని సంతరించుకున్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం, మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
శ్రీ రామాలయం
మార్చు- ఈ గామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంతోపాటు, పోలేరమ్మ, అంకాళమ్మ, పెద్దమ్మ ఆలయాలలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-4వ తేదీ వైశాఖ పౌర్ణమి, సోమవారం నాడు ప్రారంభమైనవి. 6వ తేదీ బుధవారంనాడు, యంత్ర, విగ్రహ, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠలు వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి చేసి, భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టినారు. అనంతరం వేదపండితులు, శ్రీ సీతారామచంద్రస్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సంచర్భంగా, 2015,మే నెల-21వ తేదీ గురువారంనాడు, శ్రీ సీతారామచంద్రమూర్తి మూలవిరాట్టులకు పూజలు చేపట్టినారు. అభిషేకాలు చేసారు. భక్తులకు తీర్ధప్రసాదాలు వితరణచేసారు. రాత్రికి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.