రామాలయం (ప్రాముఖ్యత)

ప్రధానంగా శ్రీరాముడు పూజింజబడే హిందూ దేవాలయం రామాలయం.భారతదేశంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో రామాలయం తప్పని సరిగా ఉన్నాయి. " రామాలయం లేని ఊరు ఊర గాదని " అనే నానుడి పూర్వం నుండి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రామాలలో "శ్రీరాముని మందిరాలు" ఉన్నాయి.కొన్నింటిలో విగ్రహాలు పూజాదికాలు అందుకోవటంలేదని తెలుస్తుంది

శ్రీ రాముడు

రామాలయం ప్రాముఖ్యత

మార్చు
 
ఒంటిమిట్టలోని కోదండ రామాలయం
 
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం

రామాయణంలో శ్రీరాముడు ఈ లోకంలో మానవులు ఎలా ధర్మమార్గాన్ని అనుసరించాలో తాను ఆచరించి చూపించాడు.సీతాదేవి భర్తకుసేవే పరమార్థంగా ఎలా నడుచుకోవాలో ప్రపంచ మానవాళికి తెలియజెప్పింది. దంపతులు ఎటువంటి కష్టాలు ఎదురైనా దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం ఎలా చేయాలో రాముడు, సీతాదేవి స్వయంగా అనుభవించి చూపారు.ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచారు.ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శ దాంపత్యానికి వారి దాంపత్యం ప్రతీకగా చరిత్రలో చిరస్థాయిగా గుర్తించబడింది.ఆదర్శదంపతుల అనగానే వారి రూపమే కదలాడింది.సీతారాముల పేరును విడదీసి పలకటానికి కొంతమంది ఇష్టపడరు.[1] సీతాదేవి తనమీద వచ్చిన నిందను మాపుకోవటానికి తన ప్రాతివత్యం నిరూపించుకోవటానికి అగ్నిలో దూకి తన పవిత్రతను పునీతయై లోకానికి ప్రాతివత్యం ప్రాముఖ్యతను చాటి చెప్పింది.[2]ఇవి అన్నీ మానవాళి జీవించటానికి ఉపయోగపడే మార్గాలుగా పూర్వీకులు గ్రహించి ఆ ఉద్దేళ్యంతోనే నిత్యం మానవాళికి గుర్తుకు రావాలని  రామాలయంలేని ఊరు ఊరే గాదని నానుడి ప్రజలలో పెంపొందించి రామాలయానికి ప్రాముఖ్య కలిగించినట్లు పురాణాలు ద్వారా తెలుస్తుంది.అందువలనే అలాంటి సీతారాముల ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి.సాధారణంగా రామాలయంలో సీతారాములతో పాటు, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కనిపిస్తుంటారు. గర్భాలయంలో వీళ్ల నలుగురులో ఎవరు కనిపించకపోయినా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంటుంది.

ప్రసిద్ధ రామాలయాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఈ ఆలయ దర్శనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ." ap7am.com. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
  2. https://telugu.oneindia.com/jyotishyam/why-sita-had-to-undergo-agni-pareeksha-what-valmiki-ramayana-reveals-242828.html

వెలుపలి లంకెలు

మార్చు