రామ్ సింగ్ భానావత్
రామ్ సింగ్ భానావత్
మార్చురామ్ సింగ్ భానావత్ (Ramsingh Bhanawat, हिंदी रामसिंग भानावत) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన స్వతంత్ర్య సమరయోధుడు.తొలి బంజారా పద్మశ్రీ , ప్రముఖ సామాజిక కార్యకర్త. ఆయనకు సామాజిక సేవా కు గాను భారత ప్రభుత్వం 1992 లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ని ప్రదానం చేసింది.[1][2][3][4]
రామ్ సింగ్ ఫకీరాజీ భానావత్ | |
---|---|
జననం | రామ్ సింగ్ భానావత్ 1906, ఆగష్టు 15 వాషిమ్ జిల్లా, ఫుల్ ఉమ్రి, మనోరా తాలుకా |
మరణం | 2002 జూన్ 10 ఫుల్ ఉమ్రి, మనోరా తాలుకా వాషిమ్ జిల్లా మహారాష్ట్ర | (వయసు 95)
మరణ కారణం | వృధాప్యం |
నివాస ప్రాంతం | ఫుల్ ఉమ్రి వాషిమ్ జిల్లా మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | ప్రముఖ సమాజ సేవకుడు |
ప్రసిద్ధి | సామాజిక కార్యకర్త |
తర్వాత వారు | 1971 దళిత మిత్రా,1992 పద్మశ్రీ అవార్డు అందుకున్నారు |
మతం | హిందూ |
తండ్రి | ఫకీరా భానావత్ |
తల్లి | పిప్ళిబాయి |
జననం,విద్య
మార్చురామ్ సింగ్ భానావత్ 1906 ఆగష్టు 15 న ఫకీరా భానావత్, పిప్ళిబాయి దంపతులకు బంజారా సమాజంలోని ధాడీ బంజారా ఉపకులం భానావత్ గోత్రంలో మహారాష్ట్ర రాష్ట్రం, వాషిమ్ జిల్లా మనోరా తాలుకాలోని ఫూల్ ఉమ్రి తండా లో జన్మించాడు. ప్రాథమిక విద్యను తన స్వంత గ్రామం ఫూల్ ఉమ్రి లో చదువుకుని ఉన్నత విద్య కోసం తన మిత్రులు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్ రావు నాయక్ తో కలసి మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతమైన అమరావతి నాగపూర్ ప్రాంతాలకు వెళ్ళి మరాఠీ మాధ్యమంలో హైయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేశాడు.ఉన్నత విద్యను కుటుంబ పరిస్థితులు సరిగా లేక పోవడంతో మద్యలోనే ఆపివేయాల్సి వచ్చింది.
సేవా కార్యక్రమాలు
మార్చురామ్ సింగ్ భానావత్ గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1925 లో జాతిపిత మహాత్మా గాంధీజీని కలవడానికి గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీజీతో నెల రోజులు పాటు ఆశ్రమంలో గడిపి సత్యం,అహింస,విద్య, వైద్యం, మద్యపాననిషేధం,గ్రామీణాభివృధ్ధి,ఖద్దరు,పారిశుధ్యం, గ్రామీణ సైద్ధాంతిక బలం, కఠోరమైన ఆచరణ,మంచిని మాత్రమే కోరే లక్షణాలు అన్ని మహాత్ముని ద్వారా నేర్చుకొని గాంధీజీకి రాజకీయ గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రలోని పూణే లో స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి ఇందు చేరి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు.ఆ సమయంలో చాలా మంది సంఘ సంస్కర్తలు స్వాతంత్ర్యం సాధించడానికి గాంధీజీ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు.
1933 లో మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతంలో జమీందారులకు,దోపిడి దారులకు వ్యతిరేకంగా కిసాన్ ఆందోళన ఉద్యమాన్ని బాబు సింగ్ రాథోడ్ తో కలసి ప్రారంభించారు.సమాజంలో అసమానతలను అంతం చేయడానికి విదర్భ కుల్ సేవా సంఘాన్ని స్థాపించి రైతులకు మద్దతుగా నిలిచారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.గాంధీజీ సిద్ధాంతాలు, ఉద్యమం స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,ఛత్రపతి షాహూ మహారాజ్ లను కలుసుకుని వారి ఉద్యమంలో క్రియాశీలకంగా మారారు. అతను దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటు పడడంతో అతని సేవాలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో ఎటువంటి ప్రతిపాదన లేకుండానే దళిత మిత్రా అవార్డు తో పాటు నగదు రాశితో సత్కరించింది. బహుమానంగా లభించిన నగదు మొత్తం ఒక లక్ష, పదివేల ,ఒక వంద ఒకటి రూపాయిలను బంగ్లాదేశ్ లోని శరణార్థుల పేరుట ఆ నిధిని జమ చేయడం అతని విశ్వసనీయత,విలువలకు నిదర్శనం.
ఒక సామాజిక కార్యకర్తగా వినయపూర్వకంగా సామాజిక సమస్యల పై అవగాహన కల్పించడం,అణగారిన, పేద, బలహీన వర్గాల సామాజిక సమస్యలను సున్నితమైన వాతావరణంలో పరిష్కరించే దిశగా కృషి చేయడంతో అతని సేవా భావాన్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం,11వ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్ ఆయనకు పద్మశ్రీ పూరష్కారం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిచారు. ఎంపిక చేసిన కేంద్రప్రభుత్వం 26 జనవరి 1992లో భారత రాష్ట్రపతి ఆర్. వెంకట్ రామన్ చేతుల మీదుగా పద్మశ్రీ పురష్కారం ప్రదానం చేసింది.
రామ్ సింగ్ భానావత్ ఒక సామాజిక కార్యకర్తగా అనేక వెనుకబడిన సంస్థలకు ఆఫీస్ బేరర్‌గా పని చేశారు.అఖిల భారతీయ బంజారా సేవా సంఘం వ్వవస్థాపకులలో ఒకరైన రామ్ సింగ్ బంజారా భాష, సంస్కృతి సాంప్రదాయాలను,పరిరక్షణ కోసం కృషి చేస్తూ బంజారా సమాజ అభివృద్ధి కోసం ఇందిరా ప్రభుత్వాన్ని నివేదికను సమర్పించారు. 1953 నుండి1980 వరకు అఖిల భారతీయ సేవా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వసంతరావు నాయక్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక గ్రామీణ పథకాల అమలుపై ప్రభుత్వానికి అనేక సలహాలు సూచనలు ఇచ్చారు.1981 సంవత్సరంలో అతను యూరప్‌తో సహా అనేక దేశాలలో పర్యటించి బంజారా సమాజం యొక్క మూలాన్ని పరిశోధించి అధ్యయనం చేయడం ద్వారా విశ్వబంజారా సమాజ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించాడు. అతని కాలంలో ఆయన చేసిన సాహిత్య పరిశోధనలు చాలా వరకు ప్రచురణ కాలేక అలానే ఉండిపోయినాయి. గొప్ప మేధావులు ఆయన భావజాలంతో ఏకీభవించారు.అధికారం, సంపద, పేరు ప్రఖ్యాతులు లేని జీవితాన్ని గడిపిన ఆ మహానుభావుని నైతిక ఆలోచనలు, ఆయన కృషి సమాజంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అవార్డులు
మార్చుసమాజ సేవాలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం 1971లో దళిత మిత్రా పురస్కారంతో సత్కరించింది. మొత్తం రూ,1,10,101/- ఈ మొత్తం రూపాయిలను అతను బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. సమాజిక సేవాలకు భారత ప్రభుత్వం భారత ఎనిమిదవ రాష్ట్రపతి ఆర్. వెంకట్ రామన్ చేతుల మీదుగా న్యూఢిల్లీ లో 26 జనవరి 1992 లో పద్మశ్రీ పురస్కారం లభించింది.[5]
మరణం
మార్చుతొమ్మభై ఐదు సంవత్సరాలు ఒక సామాన్య పౌరుడిలా జీవితాన్ని గడిపినా ఆయన తేదీ: 10 జూన్ 2002 లో తన స్వంత గ్రామం ఫూల్ ఉమ్మిలో మనోరా తాలుకా వాషిమ్ జిల్లా మహారాష్ట్ర లో వృధాప్యం తో బాదపడుతు తుది శ్వాస విడిచారు.
ఇదికూడా చూడండీ
మార్చు1990-1999 లో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
మూలాలు
మార్చు- ↑ "List of Padma Shri award recipients (1990–1999)". Military Wiki (in ఇంగ్లీష్). Retrieved 2024-05-04.
- ↑ ""बंजारा समाज सुधारक" :पद्मश्री रामसींगजी भानावत (Padmshree Ramsing Bhanawat) - Welcome To Banjara One Formerly GoarBanjara.com" (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-13. Retrieved 2024-05-04.
- ↑ "Padma Awards". web.archive.org. 2021-10-22. Archived from the original on 2021-10-22. Retrieved 2024-05-05.
- ↑ "Padma Awards". web.archive.org. 2021-10-22. Archived from the original on 2021-10-22. Retrieved 2024-05-07.
- ↑ "Padma Awards | Interactive Dashboard". dashboard-padmaawards.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2024-05-05.