రామ్ సుందర్ దాస్

రామ్ సుందర్ దాస్ ( 1921 జనవరి 9 - 2015 మార్చి 6)భారతీయ రాజకీయ నాయకుడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రాం సుందర్ దాస్ హాజీపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకి ఎన్నికయ్యాడు.

రామ్ సుందర్ దాస్
బీహార్ ముఖ్యమంత్రి
In office
1979 ఏప్రిల్ 21 – 1980 ఫిబ్రవరి 17
అంతకు ముందు వారుకర్పూరీ ఠాకూర్
తరువాత వారుజగన్నాథ్ మిశ్రా
వ్యక్తిగత వివరాలు
జననం(1921-01-09)1921 జనవరి 9
బీహార్ భారతదేశం
మరణం2015 మార్చి 6(2015-03-06) (వయసు 94)
పాట్నా, బీహార్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీజనతా దళ్
ఇతర రాజకీయ
పదవులు
జనతాదళ్, జనతా పార్టీ
జీవిత భాగస్వామిసవిత దేవి
సంతానంఇద్దరు కొడుకులు ఒక కూతురు
వృత్తిరాజకీయ నాయకుడు
As of 6 March, 2015
Source: [1]

వ్యక్తిగత జీవితం

మార్చు

రాం సుందర్ దాస్ 1921 జనవరి 9న బీహార్‌లోని సరన్ జిల్లా సోన్‌పూర్ సమీపంలోని గంగాజల్‌లో చమర్ కులంలో జన్మించాడు.[1][2] రామ్ సుందర్ దాస్ సోన్‌పూర్‌లోని పాఠశాలలో మెట్రిక్యులేట్ పూర్తి చేసాడు. రామ్ సుందర్ దాస్ కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. రామ్ సుందర్ దాస్ కాలేజీ నుంచి బయటికి వచ్చేసి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. రామ్ సుందర్ దాస్ కు 1956లో సవితదేవితో వివాహం జరిగింది ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.[1][3]

రాజకీయ జీవితం

మార్చు

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రామ్ సుందర్ దాస్ భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.[1] రామ్ సుందర్ దాస్ తన స్వస్థలమైన సోన్‌పూర్‌లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో కార్యకర్తగా పనిచేశారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, వరుస విలీనాల ద్వారా ప్రజా సోషలిస్ట్ పార్టీ (PSP)లో భాగమైంది. 1957 లోక్‌సభ ఎన్నికలలో, రామ్ సుందర్ దాస్ హాజీపూర్ నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. రామ్ సుందర్ దాస్ ఓడిపోయిన హాజీపూర్ నుండి మళ్లీ పోటీ చేసి రెండుసార్లు ఎంపీగా హాజీపూర్ నుండి గెలిచాడు . 1968లో, రామ్ సుందర్ దాస్ బీహార్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1977 వరకు రామ్ సుందర్ దాస్ శాసనమండలి సభ్యుడుగా పనిచేశాడు.[3]

1977 బీహార్ శాసనసభ ఎన్నికలలో, రామ్ సుందర్ దాస్ సోన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో పోరాటం చెలరేగింది. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి జనతా పార్టీ సభ్యులు ప్రయత్నించారు . దళితులను ఆకర్షించడానికి రామ్ సుందర్ దాస్ ను బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. దీంతో కర్పూరీ ఠాకూర్ అనుకూల సభ్యులు రామ్ సుందర్ దాస్ అనుకూల సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు . రామ్ సుందర్ దాస్ కు మద్దతు ఎక్కువగా ఉండటంతో కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. [ citation needed ] కర్పూరి ఠాకూర్ రాజీనామా చేసిన తర్వాత రామ్ సుందర్ దాస్ 1979 ఏప్రిల్ 21న బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు [1] 1994 జనవరి 9న పాట్నాలో లోక్‌తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించాడు.

రామ్ సుందర్ దాస్ 2015 మార్చి 6న 94 సంవత్సరాల వయస్సులో మరణించాడు [4]

నిర్వహించిన పదవులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Former Bihar Chief Minister Ram Sundar Das passes away at 95". India Today (in ఇంగ్లీష్). India Today. 7 March 2015. Retrieved 21 February 2021.
  2. Farz, Ahmed (15 May 1996). find-the-going-tough-this-time-833180-1996-05-15 "Elections 1996: Ram Vilas Paswan may find the going tough this time". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-06-05. {{cite web}}: Check |url= value (help)
  3. 3.0 3.1 "Members Bioprofile". Parliament of India. Retrieved 8 April 2020.
  4. "Former Bihar Chief Minister Ram Sundar Das passes away". The Economics Times. 6 March 2015. Retrieved 6 March 2015.
  5. "A victory after 32 years of trying". Hindustan Times (in ఇంగ్లీష్). 2009-05-22. Retrieved 2021-09-25.
  6. "Bihar Assembly Election Results in 1977". Elections in India. Retrieved 2021-09-25.
  7. "Sonepur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2021-09-25.
  8. "1991 India General (10th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2021-09-25.
  9. "Flaming torch a free symbol, EC can allot it to any other party: Delhi HC dismisses Samata Party's appeal". The Indian Express (in ఇంగ్లీష్). 2022-11-19. Retrieved 2022-11-26.
  10. "Hajipur Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Retrieved 2021-09-25.