రిమీ సేన్

హిందీ, తెలుగు, బెంగాలీ చిత్రాలలో నటించే భారతీయురాలు

రిమీ సేన్ (జననం: 1981 సెప్టెంబరు 21) హిందీ, తెలుగు, బెంగాలీ చిత్రాలలో నటించే భారతీయురాలు.[2] ఆమె కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆమె 1996 బెంగాలీ చిత్రం దాములో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆమె 2002లో నీ తోడు కావాలి అనే తెలుగు సినిమాతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. 2003లో, ఆమె హాస్య చిత్రం హంగామాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది, దీనికిగాను ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కేటగిరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. ఆ తరువాత, ఆమె బాగ్‌బాన్ (2003), ధూమ్ (2004), గరం మసాలా (2005), క్యోన్ కి (2005), ఫిర్ హేరా ఫేరీ (2006), గోల్‌మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ (2006) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె 2015లో రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది.[3][4]

రిమీ సేన్
2017లో రిమీ సేన్
జననం
సుభమిత్ర సేన్[1]

(1981-09-21) 1981 సెప్టెంబరు 21 (వయసు 42)
జాతీయతఇండియన్
వృత్తిసినిమా నటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1996–2011
2015–2016
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ధూమ్, హంగామా (2003), ఫిర్ హేరా ఫేరి
తల్లిదండ్రులు
 • రాజా సేన్ (తండ్రి)
 • సంఘమిత్ర సేన్ (తల్లి)

ఆమె ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001), అందరివాడు (2005) తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలోని బెంగాలీ బైద్య కుటుంబంలో 1981 సెప్టెంబరు 21న సుభమిత్ర సేన్‌గా జన్మించింది. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రురాలైంది.[5]

కెరీర్ మార్చు

చిన్నప్పటి నుండి నటి కావాలని కన్న కలలు నిజం చేసుకోవాలని చదువు పూర్తయ్యాక కోల్‌కతా నుండి ముంబై చేరింది. ఆమె అమీర్ ఖాన్‌తో కోకా-కోలా వాణిజ్య ప్రకటనతో సహా మరి కొన్ని ప్రకటనలు చేసింది.[6]

ఆమె తెలుగులో నీ తోడు కావాలి (2002) సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఆమె తొలి హిందీ చిత్రం హంగామా 2003లో విడుదలైంది. ఆ తరువాత హిందీలో ధూమ్ (2004), క్యోన్ కి (2005), గరం మసాలా (2005), గోల్‌మాల్ (2006) వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో ఆమె నటించింది.[7]

2015లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది.

2016లో, ఆమె బుధియా సింగ్ - బోర్న్ టు రన్ అనే చిత్రాన్ని నిర్మించింది.[8] ఈ చిత్రం 63వ జాతీయ అవార్డులలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. అలాగే వరల్డ్‌ఫెస్ట్-హ్యూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ఉత్తమ చిత్రంగా నిలబడింది. ఆమె తన ప్రొడక్షన్ వెంచర్ కోసం తన స్క్రీన్ పేరు, రిమీ సేన్ ని తన అసలు పేరు, సుభమిత్ర సేన్‌గా మార్చుకుంది.[9]

మూలాలు మార్చు

 1. Vyavahare, Renuka (26 February 2015). "Rimi Sen resurfaces as Subhamitra". The Times of India. Retrieved 15 July 2016.
 2. "Rimi Sen: 'I was furniture in Dhoom, Phir Hera Pheri, Hungama, Golmaal and other comedies'". The Indian Express. 10 April 2021.
 3. "Rimi Sen in Bigg Boss 9 Double Trouble". The Times of India. 13 October 2015.
 4. "Took up 'Bigg Boss' to reconnect with fans: Dhoom girl Rimi Sen". The Indian Express. 12 October 2015.
 5. "Rimi Sen: Acting cannot be taught". smashits.com. Archived from the original on 29 March 2012. Retrieved 16 May 2011.
 6. "Rimi Sen: Acting cannot be taught". smashits.com. Archived from the original on 29 March 2012. Retrieved 16 May 2011.
 7. "Good things are happening to me: Rimi Sen". Rediff (in ఇంగ్లీష్). Retrieved 7 May 2020.
 8. "Rimi Sen unveils the poster of her maiden production 'Budhia Singh' - Entertainment". Mid-day.com. 21 June 2016. Retrieved 26 September 2016.
 9. "Rimi Sen is Back With her Maiden Production Venture Budhia Singh". Pinkvilla. 17 June 2016. Archived from the original on 26 సెప్టెంబర్ 2016. Retrieved 26 September 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=రిమీ_సేన్&oldid=3931306" నుండి వెలికితీశారు