రీయూనియన్‌లో హిందూమతం

రీయూనియన్‌, హిందూ మహాసముద్రం లోని దీవి. ఇది ఫ్రాన్సుకు చెందిన విదేశీ భూభాగం. హిందువులు (ప్రధానంగా శైవం) ఈ ద్వీప జనాభాలో గణనీయమైన భాగం ఉంటారు. సుమారు 8,00,000 రీయూనియన్ జనాభాలో దాదాపు 2,00,000 మంది భారతీయ సంతతికి చెందినవారు. [1] హిందువుల సంఖ్య 6.7% [2] నుండి 10.7% వరకు ఉంటుంది. [3] అయినప్పటికీ, దేశంలోని ఖచ్చితమైన హిందువుల సంఖ్యపై అనిశ్చితి ఉంది. ఫ్రెంచి జనాభా గణనలలో జాతి, మతపరమైన ప్రశ్నలు ఉండేవి కావు. భారతీయ జనాభాలోని సభ్యులు కొన్నిసార్లు రోమన్ క్యాథలిక్ గాను, కొన్నిసార్లు హిందూ విశ్వాసాలతోనూ గుర్తించబడతారు.

సెయింట్-డెనిస్, రీయూనియన్‌లోని శ్రీ మహా కాళికాంబాల్ ఆలయం

ఇటీవలి కాలంలో తమిళ హిందువులు శ్రీలంక నుండి శరణార్థులుగా వచ్చారు. [4]

చరిత్ర

మార్చు

రీయూనియన్‌లో హిందూమతం చరిత్ర పంతొమ్మిదవ శతాబ్దం మధ్య - చివరి కాలంలో మొదలైంది. చాలా మంది భారతీయులు క్రైస్తవ పేర్లను పెట్టుకున్నారు. వారి యజమానులు లేదా ప్రభుత్వాల ఒత్తిడితో వారి పిల్లలను కాథలిక్ చర్చిలో బాప్టిజం చేయించేవారు. [1] అయినప్పటికీ, వారు హిందూ మతాన్ని విడిచిపెట్టలేదు. క్రైస్తవ మిషనరీలు, హిందూ దేవుడి ముందు కర్పూరం వెలిగించే ఆచారం చేతబడికి దృష్టాంతం అని చెబుతూ, చర్చిలో కొవ్వొత్తి వెలిగించడం మాత్రం మోక్షానికి ఖచ్చితమైన మార్గమంటూ వాదించేవారు. [5]

గుజరాత్ నుండి ద్వీపానికి వచ్చిన ముస్లింలను మినహాయించి, భారతీయులందరినీ దాదాపుగా బలవంతంగానే కాథలిక్కులుగా మార్చారు. క్రైస్తవ మతంలోకి చాలా మతమార్పిడులు ఒప్పందాల సమయంలో జరిగాయి. [1]

నేటి హిందూమతం

మార్చు
 
సెయింట్-పియర్ బీచ్‌లో హిందూ కర్మకాండ.

చాలా మంది క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ, ప్రతి తమిళ క్రైస్తవుల ఇంటి వెనుక భాగంలో సాధారణంగా వారు పూజించే హిందూ దేవత మారియమ్మన్‌కు చిన్నపాటి మందిరం ఉంటుంది. అనేక హిందూ సంప్రదాయాల స్థానంలో క్రైస్తవ సంప్రదాయాలు వచ్చాయి. మారియమ్మన్ ఆరాధన వర్జిన్ మేరీ ఆరాధనలో కలిసిపోయింది. కృష్ణ భగవానుడి జన్మదినమైన జన్మాష్టమి , యేసుక్రీస్తు పుట్టిన తేదీగా పరిగణించబడుతోంది. స్థానికంగా పూజించే సెయింట్ ఎక్స్‌పెడిట్‌ను కాళీ దేవిగా గుర్తిస్తారు. [5]

ఇటీవలి సంవత్సరాలలో, తమిళ సమాజ సభ్యులలో హిందూ మత పునరుద్ధరణ జరిగింది. [1] ఇది అనేక దేవాలయాలు, ఆశ్రమాలు స్థాపించడానికి దారితీసింది. ఇందులో భాగంగా తమిళనాడు నుంచి కొందరు ఆలయ పూజారులను కూడా రప్పించారు. ఏది ఏమైనప్పటికీ, 2018లో చెన్నై సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్‌లో రీయూనియన్‌లోని తమిళ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కలై సెల్వం షణ్ముగం మాట్లాడుతూ తమిళనాడు నుండి తీసుకువచ్చిన కొంతమంది ఆలయ పూజారులు హిందూ మతాన్ని వ్యాప్తి చేయడం కంటే డబ్బు సంపాదించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని విచారం వ్యక్తం చేశాడు. [5] ఒక ఆసక్తికరమైన లక్షణం, రీయూనియన్‌కి మాత్రమే ప్రత్యేకించినదీ ఏమిటంటే కాథలిక్, హిందూ ఆచారాలు రెండింటినీ కొంతమంది జాతి భారతీయులు ఏకకాలంలో పాటించడం. ఈ ఆచారం "సామాజికంగా క్యాథలిక్కు, ప్రైవేట్‌గా హిందూ" అనే గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Himalayan Academy (November 1991). "Reunion Hindus Try For a Revival". Hinduism Today. Archived from the original on 2019-12-05. Retrieved 2007-03-21. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "hindutoday" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Indian diaspora" (PDF). Archived from the original (PDF) on 2010-08-21. Retrieved 2007-02-08.
  3. "Country Profile: Reunion (Department of Reunion)". Archived from the original on 13 October 2007. Retrieved 2015-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Sri Lankans risk it all to seek asylum on tiny island near Africa". Update NewZ. March 3, 2019. Archived from the original on 2019-03-27. Retrieved 2021-12-31.
  5. 5.0 5.1 5.2 SAAG (2018-10-12). "Tamils In Re-Union: Losing Cultural Identity – Analysis". Eurasia Review (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-27. Retrieved 2020-05-01. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "eurasiareview1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు