ఫ్రాన్స్‌లో హిందూమతం

హిందూమతం ఫ్రాన్స్ లో మైనారిటీ స్థాయిలో ఉంది. దేశంలో హిందూ జనాభా 1,21.312. ఇది ఫ్రాన్స్ దేశ జనాభాలో దాదాపు 0.2%. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ తదితర దేశాలకు చెందిన చాలా మంది హిందువులు ఉన్నప్పటికీ, హిందువులు ప్రధానంగా భారతీయ డయాస్పోరాకు చెందినవారు

ఫ్రాన్స్‌లో హిందూమతం
ఫ్రాన్సులో ఇస్కాన్ వారి హిందూ దేవాలయం
మొత్తం జనాభా
1,21,312
మొత్తం జనాభాలో 0.2%
మతాలు
హిందూమతం
వైష్ణవం (మెజారిటీ)
శైవం
గ్రంథాలు
భగవద్గీత, వేదాలు,..
భాషలు
మతపరంగా
సంస్కృతం

ప్రాంతీయంగా
ఫ్రెంచి, ఇంగ్లీషు

ఇతరాలు
హిందీ, తమిళం, పంజాబీ, ఇతర భారతీయ భాషలు

యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీల తర్వాత ఐరోపాలో ఐదవ అతిపెద్ద హిందూసమాజం ఫ్రాన్సులో ఉంది. [1]

ఫ్రెంచ్ విదేశీ భూభాగాల్లో హిందూమతం

మార్చు

మార్టినిక్‌లో హిందూమతం

మార్చు

హిందూమతం మార్టినిక్‌లో ఇండో-మార్టినిక్వాలచే అనుసరించబడుతుంది . అయితే ఇండో-మార్టినిక్వాలు మొత్తం ద్వీప జనాభాలో సుమారు 10% ఉన్నప్పటికీ, వారిలో 15% మాత్రమే హిందువులు. [2]

ఫ్రెంచ్ గయానాలో హిందూమతం

మార్చు

2010 నాటికి, ఫ్రెంచ్ గయానా జనాభాలో 1.6% మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. [3] 2014 నాటికి, దాదాపు 3,60,000 మంది ఇండో-గయానీస్ వారసులు దీనిని ఎక్కువగా ఆచరిస్తున్నారు. [4]

రీయూనియన్‌లో హిందూమతం

మార్చు

ఫ్రెంచ్ ప్రభుత్వం మతపరమైన అనుబంధంపై ఎటువంటి గణాంకాలను సేకరించలేదు. దీని వల్ల రీయూనియన్‌లో ఎంత మంది హిందువులు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం అసాధ్యం. హిందువుల జనాభా అంచనాలు 6.7% [5] నుండి 10.7% వరకు ఉంటాయి. [6] చాలా పెద్ద పట్టణాలలో హిందూ దేవాలయం ఉంది. [7] అయినప్పటికీ, దేశంలోని ఖచ్చితమైన హిందువుల సంఖ్యపై అనిశ్చితి ఏర్పడింది, ఎందుకంటే భారతీయ జనాభాలోని చాలా మంది సభ్యులు రోమన్ కాథలిక్, ముస్లిం, హిందూ మతాలతో గుర్తింపు పొందారు.

రీయూనియన్‌లో దాదాపు 59% గుజరాతీలు, 40% పంజాబీలు, 10% తమిళులు హిందువులు. ఒక ఆసక్తికరమైన లక్షణం, బహుశా రీయూనియన్‌కు విశిష్టమైనదే ఏంటంటే కొంతమంది జాతి భారతీయులు కాథలిక్, హిందూ ఆచారాలు రెండింటినీ ఏకకాలంలో పాటించడం. ఈ అభ్యాసం వారికి "సామాజికంగా క్యాథలిక్, ప్రైవేట్‌గా హిందూ" అనే గుర్తింపు తెచ్చిపెట్టింది.

గ్వాడలోప్‌లో హిందూమతం

మార్చు

గ్వాడలోప్‌లో 0.5% మంది హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. [8]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "European Countries With The Highest Number Of Hindus: 2010 To 2050". WorldAtlas (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
  2. "Martinique" (PDF). World Maps. Retrieved 6 June 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Religions in French Guiana | PEW-GRF". www.globalreligiousfutures.org. Archived from the original on 2019-07-21. Retrieved 2021-06-06.
  4. Heenan, Patrick; Lamontagne, Monique, eds. (2014). The South America Handbook. Routledge. p. 318. ISBN 9781135973216.
  5. "Indian diaspora" (PDF). Archived from the original (PDF) on 2010-08-21. Retrieved 2018-08-10.
  6. "Country Profile: Reunion (Department of Reunion)". Archived from the original on 13 October 2007. Retrieved 2015-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Peoples of Africa: Réunion-Somalia. Marshall Cavendish. 2001. pp. 412–. ISBN 978-0-7614-7166-0.
  8. "RELIGIONS IN GUADELOUPE". www.religion-facts.com. Archived from the original on 2018-10-23. Retrieved 2021-06-06.