రూప పబ్లికేషన్స్

రూప పబ్లికేషన్స్ (Rupa Publications) ప్రధాన కార్యాలయం  న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక భారతీయ ప్రచురణ సంస్థ. సంస్థ కార్యాలయాలు కోల్ కతా, అలహాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్, హైదరాబాద్, ఖాట్మండులలో ఉన్నాయి.

రూప పబ్లికేషన్స్
మాతృ కంపెనీరూప పబ్లికేషన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్
స్థితిActive
స్థాపన1936
వ్యవస్థాపకుడుడి.మెహ్రా
మూలమైన దేశంభారతదేశం
ప్రధాన కార్యాలయం స్థానంఢిల్లీ
పంపిణీకోల్ కతా, అలహాబాద్, చెన్నై,ముంబై,హైదరాబాద్,జైపూర్,ఖాట్మండ్, ప్రపంచ వ్యాప్తంగా
ముఖ్యమైన ప్రజలుడి. మెహ్రా, ఆర్. కె. మెహ్రా కపిష్ మెహ్రా
ప్రచురణల సంఖ్యRed Turtle

చరిత్ర మార్చు

భారతదేశపు అతిపెద్ద పుస్తక ప్రచురణకర్తలు, పంపిణీదారులలో  రూప పబ్లికేషన్స్ (పూర్వం  రూప అండ్ కో) ఎనభై సంవత్సరాల క్రితం, కోల్ కతాలోని కాలేజ్ స్ట్రీట్ లో ప్రారంభమైన సంస్థ. రూప కంపెనీ భారతీయ ప్రచురణ  నియమాలను పునర్నిర్వచించింది, మొదటిది ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రెండింటిలోనూ  ప్రతిభను కనుగొనడం, ప్రోత్సహించడం, రెండవది జీవిత చరిత్రలు, చరిత్ర, తత్వశాస్త్రం నుండి క్రీడలు, స్వీయ-సహాయం (సెల్ఫ్ కాన్ఫిడెన్సు) వ్యాపారం వరకు పుస్తకములను ప్రచురణ చేస్తున్న సంస్థ.

1936లో, కలకత్తాలోని న్యూ మార్కెట్ లో పుస్తకాలు అమ్మే ఆంగ్లేయుడు కె. జాక్సన్ మార్షల్, పుస్తకాలను అమ్మడంలో తనతో చేరమని డి. మెహ్రా ను కోరాడు   కొద్దిపాటి పెట్టుబడి, ఇల్లు తన కార్యాలయంగా రెట్టింపు కావడంత, డి. మెహ్రా  పుస్తక విక్రేత ప్రతినిధిగా మారి, తర్వాత రూప  కంపెనీ  ప్రారంభించాడు. సత్యజిత్ రే రూపొందించిన రూప సంస్థ  లోగో 'చదవడానికి కొన్ని మంచి పుస్తకాలు!'

1970 నుంచి 1980 సంవత్సరాలలో కంపెనీ విస్తరిస్తూ, ఢిల్లీలోనే కాకుండా చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేసింది, తద్వారా భారతదేశంలోని ప్రధాన పుస్తక మార్కెట్లలో ప్రధాన పుస్తక ప్రచురణ సంస్థగా మార్కెటులో  ప్రాతినిధ్యంగా మారింది.[1]

అభివృద్ధి మార్చు

1936 నుండి, రూప పబ్లికేషన్స్ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రచయితల  అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల వాటిలో అహ్మద్ అలీ, అనురాగ్ మాథుర్, అరుణ్ శౌరీ, చేతన్ భగత్, జస్వంత్ సింగ్, రవి సుబ్రమణియన్, రస్కిన్ బాండ్, గుల్జార్ ఉన్నారు.

2013 సంవత్సరంలో, రూప పబ్లికేషన్స్ లో హార్డ్ బ్యాక్, పేపర్ బ్యాక్ ముద్రణలలో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ ను ప్రచురించడం కొనసాగించడం, అల్కా పాండే, అనుజా చౌహాన్, ఎపిజె అబ్దుల్ కలాం, బినా రమణి, చేతన్ భగత్, డెరెక్ ఓబ్రెయిన్, దేవప్రియ రాయ్, దీపాంకర్ గుప్తా, గుల్జార్, జస్వంత్ సింగ్, ఖుష్వంత్ సింగ్, మనోహర్ శెట్టి, నందితా హక్సర్, పియూష్ ఝా, రఘు రామ్, రస్కిన్ బాండ్, సమిత్ బసు, సిదిన్ వడుకుట్ వంటి రచయితల పుస్తకముల ముద్రణ జరిగింది.

రూప పబ్లికేషన్స్ కొత్త వాటిలో ప్రవేశించడం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, రచయితలకు, పాఠకులకు నాణ్యతతో కూడిన  నిబద్ధతతో కంపెనీ పురోగతి సాధిస్తున్నది[2].

ప్రచురణలు మార్చు

డాన్ బ్రాడ్ మాన్  పుస్తకాలతో క్రీడా సంబంధిత ప్రచురణ ప్రపంచంలోకి రూప విజయం సాధించింది. వినూ మన్కడ్, విజయ్ హజారే, ముస్తాక్ అలీ, సునీల్ గవాస్కర్, ఎరపల్లి ప్రసన్న, సందీప్ పాటిల్ లు రూప ప్రచురణ బృందంలో రచయితలుగా చేరారు. గవాస్కర్  సన్నీ డేస్ అండ్ ఐడల్స్- క్రీడా పుస్తకాలలో, అమ్మకాలలో రికార్డులను బద్దలు కొట్టాయి.  గవాస్కర్ చివరి పుస్తకం స్ట్రెయిట్ డ్రైవ్ (2009) కూడా బెస్ట్ సెల్లర్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, పుల్లెల గోపీచంద్, మిల్కా సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్యల స్ఫూర్తిదాయక జీవిత చరిత్రలతో, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్ వంటి వారి  జీవితాలను వివరించే 'ది విన్నింగ్ సిరీస్'ను ప్రచురణ చేసారు[1]. భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్, ప్రణబ్ ముఖర్జీ, ఆచార్య కృపలానీ, ఎల్.కె.అద్వానీ, జె.ఆర్.డి.టాటా, ఎఫ్.సి.కోహ్లీ, కిశోర్ బియానీ, మహారాణి గాయత్రీ దేవి, విక్రమ్ సంపత్, రామ్ జెఠ్మలానీ, మార్క్ తుల్లీ, ఎస్.వై.ఖురేషి వంటి ప్రవారి పుస్తకములను ప్రచురించడం[3], రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ బిమల్ జలాన్ పుస్తకాలను ప్రచురించడం, మన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిష్కరించాల్సిన తక్షణ ప్రాధాన్యతల గురించి రాయడం; మోహన్ భగవత్ సమతుల్యమైన జీవితచరిత్రను వ్రాసిన ప్రముఖ రచయిత, రాజకీయ పాత్రికేయుడు కింగ్ షక్ నాగ్; బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ అరుణ్ మైరా, కొత్త టూల్ కిట్ పై వారి సిఫారసులు, ఆలోచనా విధానాలతో ప్రచురణ చేసారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Rupa Publications". www.garudabooks.com. Retrieved 2022-11-25.
  2. "Rupa Publications India Private Limited - Service Provider from New Delhi, India | About Us". www.indiamart.com. Retrieved 2022-11-25.
  3. "Biographies & Memoirs | Book Categories | Rupa Publications" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-11-25.