బిమల్ జలాన్ భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త . ఇతడు భారతీయ రిజర్వ్ బాంక్కు రెండు పర్యాయాలు గవర్నర్ గా పనిచేసాడు. 2000 నవంబర్ 22 నుంచి 2002 నవంబర్ 21 వరకు ప్రథమ పర్యాయం, మళ్ళీ 2002 నవంబర్ 22 నుంచి 2004 సెప్టెంబర్ 6 వరకు పనిచేసి ప్రస్తుత గవర్నర్ వై. వేణుగోపాలరెడ్డికి పదవి అప్పగించాడు[1]. బిమల జలాన్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే మనదేశంలో ప్రస్తుతం వాడకంలో ఉన్న రూ.1000 నోటు విడుదల కాబడింది .[2] . 2003 లోనే జలాన్ భారత దేశ పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభకు రాష్ట్రపతి చే నామినేట్ కాబడినాడు.

జీవితంసవరించు

బిమల్ జలాన్, 1941 జూలై 3న కోల్‌కతలో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణ నంద జలాన్, తల్లి జానకీ దేవి జలాన్.[3] కొల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో, విదేశాలలో కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు. వృతి రీత్యా ఆర్థికవేత్త అయిన జలాన్ భారత ప్రభుత్వపు పలు పరిపాలన, సలహా పదవులు చేపట్టినాడు. 1980 ప్రాంతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా, 1985 నుంచి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక కార్యదర్శిగా పదవిని నిర్వహించాడు. రిజర్వ్ బ్యాంక్ యొక్క కేంద్రీయ బోర్డు డైరెక్టర్టలో ఒకడుగా, 1991-1992 ప్రాంతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్ గా పదవులు పొందినాడు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బోర్డులకు భారత దేశం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశాడు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా పదవి చేపట్టే నాటికి బిమల్ జలాన్ ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

మూలాలుసవరించు

  1. "List of Governors". Reserve Bank of India. Retrieved 2006-12-08. Cite web requires |website= (help)
  2. Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. p. 77.
  3. Detailed Profile: Dr. Bimal Jalan[permanent dead link] - india.gov.in