రూప మాగంటి తెలుగు సామాజికవేత్త, గ్రామీణ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శిక్షకురాలు. 2021లో భారతదేశ నీతిఆయోగ్ నుండి ఉమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అవార్డును అందుకుంది.[1]

రూప మాగంటి
జననం
రూప

1973
వృత్తిసామాజికవేత్త
జీవిత భాగస్వామిరామ్ మోహన్ మాగంటి
పిల్లలురాగ

జననం, విద్య మార్చు

రూప 1973లో జన్మించింది. చెన్నైలో పెరిగింది. రూప తండ్రి ఎ.కె.వి. ప్రసాద్ తెలుగులో మూడు సినిమాలు చేశాడు. రూప తాత అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం 1955 సాధారణ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు.[2] రూప నాయనమ్మ రాజా రాజేశ్వరి తమిళనాడులోని కుర్వీకులం పెమ్మసాని వంశానికి చెందిన జమిందారీ. అమ్మ వైపు తాత ప్రఖ్యాత తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు. కార్పోరేట్ సెక్రటరీషిప్‌లో గ్రాడ్యుయేషన్, రూరల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రూప, సైకాలజీలో పిజి డిప్లొమా చేసింది.[3]

ఉద్యోగం మార్చు

శ్రీలంకలోని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)లో అప్రెంటిస్‌గా చేరి, 13 సంవత్సరాలు శ్రీలంకలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసింది.[4]

వ్యక్తిగత జీవితం మార్చు

సినీ నటుడు మురళీమోహన్ కుమారుడు రామ్ మోహన్ తో రూప వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (రాగ) ఉంది.

వ్యాపారరంగం మార్చు

రైతులను వినియోగదారులు, అగ్రిప్రెన్యూర్‌లతో అనుసంధానించేందుకు గ్రీన్‌తత్వా అగ్రిటెక్‌ను అనే స్టార్టప్ స్థాపించింది. సహజసిద్ధంగా పండించిన, రసాయనాలు లేని పౌష్టికాహారాన్ని సమాజానికి అందించేందుకు 2019లో 'సుధాన్య' అనే సేంద్రియ ఉత్పత్తుల సంస్థను ప్రారంభించింది.[5]

ఇతర వివరాలు మార్చు

రూప 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలుగా పోటీచేసింది.[6]

అవార్డులు మార్చు

  1. ఉమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అవార్డు 2021 (నీతిఆయోగ్, 2022 మార్చి 23)
  2. ఉత్తమ మహిళా అగ్టెక్ వ్యవస్థాపకులు విభాగంలో ఎఫ్ఐసిసిఐ అగ్రి స్టార్ట్ అప్ అవార్డు-2022

మూలాలు మార్చు

  1. "ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ పురస్కారాల ప్రదానం". EENADU. 2022-03-24. Archived from the original on 2022-03-24. Retrieved 2022-12-07.
  2. "Legislative Assembly of Andhra Pradesh (1955)" (PDF). ceotelangana.nic.in. Archived (PDF) from the original on 2022-12-09. Retrieved 2022-12-09.
  3. Varma, Lipika (2019-04-17). "A political debutant". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-17. Retrieved 2022-12-07.
  4. "I want to continue my father-in-law Murali Mohan's legacy: Maganti Rupa". The New Indian Express. 2019-03-26. Archived from the original on 2019-03-31. Retrieved 2022-12-07.
  5. ABN (2022-05-14). "వారి నమ్మకమే మా బలం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-12-09. Retrieved 2022-12-09.
  6. Correspondent, Special (2022-03-23). "Four women from Telangana honoured by Niti Aayog". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-04-13. Retrieved 2022-12-07.