గుడివాడ శాసనసభ నియోజకవర్గం
గుడివాడ శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోగలదు.
నియోజకవర్గంలోని మండలాలు సవరించు
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్‌పై 8862 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావు 57843 ఓట్లు పొందగా, ఈశ్వర్ కుమార్ 48981 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.వెంకటేశ్వరరావు (నాని) పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున పి.వెంకటేశ్వరరావు పోటీపడ్డాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వి.రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వి.రావుపై 17630 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1]
2014 ఎన్నికలు సవరించు
2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు పై 11537 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కొడాలి వెంకటేశ్వరరావు 81298 ఓట్లు పొందగా, రావి వెంకటేశ్వరరావు 69761 ఓట్లు సాధించాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు సవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) | పు | వై.కా.పా | 81298 | రావి వెంకటేశ్వరరావు | పు | తె.దే.పా | 69761 | ||
2009 | కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) | పు | తె.దే.పా | 68034 | పిన్నమనేని వెంకటేశ్వర రావు | పు | కాంగ్రెస్ | 50404 | ||
2004 | కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) | పు | తె.దే.పా | 57843 | ఈశ్వర కుమార్ కటారి | పు | కాంగ్రెస్ | 48981 | ||
2000(ఉప ఎన్నిక) | రావి వెంకటేశ్వర రావు | పు | తె.దే.పా | 62559 | రమేష్ శిస్ట్ల | పు | కాంగ్రెస్ | 30562 | ||
1999 | రవి హరి గోపల్ | పు | తె.దే.పా | 43126 | శేగు వెంకటేశ్వర్లు | పు | కాంగ్రెస్ | 26180 | ||
1994 | రావి శోభనాద్రి చౌదరి | పు | తె.దే.పా | 59022 | ఈశ్వర కుమార్ కఠారి | పు | కాంగ్రెస్ | 38032 | ||
1989 | ఈశ్వర కుమార్ కఠారి | పు | కాంగ్రెస్ | 52723 | రావి శోభనాద్రి చౌదరి | పు | తె.దే.పా | 52213 | ||
1985 | నందమూరి తారక రామారావు | పు | తె.దే.పా | 49600 | ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు | పు | కాంగ్రెస్ | 42003 | ||
1985ఉప ఎన్నిక | రావి శోభనాద్రి చౌదరి | పు | తె.దే.పా | 53106 | యు.ఎస్.బాబు | పు | కాంగ్రెస్ | 31463 | ||
1983 | నందమూరి తారక రామారావు | పు | తె.దే.పా | 53906 | కటారి సత్యనారాయణ రావు | పు | కాంగ్రెస్ | 27368 | ||
1978 | కటారి సత్యనారాయణ రావు | పు | కాంగ్రెస్[ఐ] | 38060 | పి.వెంకటసుబ్బారావు | పు | సిపిఐ(ఎం) | 32236 | ||
1972 | కటారి సత్యనారాయణ రావు | పు | కాంగ్రెస్ | 34373 | పి.వెంకటసుబ్బారావు | పు | సిపిఐ(ఎం) | 27434 | ||
1967 | ఎం.కె.దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 24854 | వి.ఎస్.ఆర్.పుట్టగుంట | పు | సిపిఐ(ఎం) | 15851 | ||
1962ఎస్.సి | గంజి రామా రావు | పు | సి.పి.ఐ | 27267 | వేముల కూర్మయ్య | పు | కాంగ్రెస్ | 23767 | ||
1955 | అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం | పు | స్వతంత్ర అభ్యర్థి | 52210 | వేముల కూర్మయ్య | పు | కాంగ్రెస్ | 49939 |
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009