బాజీ రావు II

మరాఠాసామ్రాజ్యానికి 13వ (చివరి పీష్వా).
(రెండవ బాజీ రావు నుండి దారిమార్పు చెందింది)

పీష్వా బాజీ రావు II (1775 జనవరి 10- 1851 జనవరి 28) మరాఠా సామ్రాజ్యానికి 13వ (చివరి పీష్వా) గా పనిచేసాడు. అతను 1795 నుండి1818 వరకు పరిపాలించాడు. అతనిని మరాఠా ప్రభువుల వారి చెప్పుచేతలలో ఉండే ఒక తోలుబొమ్మ పాలకునిగా నియమించారు. అతనికి సంక్రమించిన, పెరుగుతున్న అధికారాలు, సైన్యం, అతని రాజధాని పూనా నుండి పారిపోవడానికి కారణమయ్యాయి. ఇది బ్రిటీష్ వారితో బస్సేన్ ఒప్పందం (1802)పై సంతకం చేయడానికి ప్రేరేపించింది. దీని ఫలితంగా రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-1805) జరిగింది. దీనిలో బ్రిటీష్ వారు విజయం సాధించి, అతనిని నామమాత్రపు పీష్వాగా తిరిగి నిలబెట్టారు.1817లో బాజీ రావ్ II ఆదాయ-భాగస్వామ్య వివాదంలో గైక్వాడ్ ప్రభువులకు అనుకూలంగా వ్యవహరించిన తరువాత, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో చేరాడు. అనేక యుద్ధ పరాజయాలను చవిచూసిన తరువాత, పీష్వా బాజీ రావు II బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. చివరకు ప్రతిఫలంగా బితూర్ వద్ద ఒక సంస్థానం, వార్షిక పించను చెల్లించే పద్దతిపై పదవీ విరమణ చేయడానికి అంగీకరించాడు.

బాజీ రావు II
బాజీ రావు II


మరాఠా సామ్రాజ్యం 13వ పీష్వా
పదవిలో
1796 డిసెంబరు 6 – 1818 జూన్ 3
చక్రవర్తి సతారాకు చెందిన షాహు II, ప్రతాప్ సింగ్, సతారా రాజు
మునుపు మాధవరావు II
తరువాత స్థానం వాస్తవంగా అంతరించిపోయింది
(నానా సాహిబ్ పీష్వాగా బిరుదు పొందాడు)

జననం (1775-01-10)1775 జనవరి 10
ధార్, మరాఠా సామ్రాజ్యం
మరణం 1851 జనవరి 28(1851-01-28) (వయసు 76)
బితూర్
భార్య/భర్త సరస్వతీ బాయి
సంతానం నానా సాహెబ్ (దత్తత తీసుకున్నాడు)

వ్యక్తిగత జీవితం

మార్చు
 
బాజీరావు II

బాజీ రావు తండ్రి మాజీ పీష్వా రఘునాథరావు, తల్లి ఆనందీబాయి. బాజీ రావు II 1775లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరనీ అప్పటి పీష్వా పాలకవర్గం జైలులో ఉంచింది.19 సంవత్సరాల వయస్సు వరకు, బాజీ రావు తన సోదరులతో పాటు నిర్బంధంలో ఉన్నాడు.విద్య, ఇతర ప్రాథమిక హక్కులను కోల్పోయాడు. తండ్రి రఘునాథరావు ఆంగ్లేయులతో విభేదించాడు. ఇది మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి కారణమై, సల్బాయి ఒప్పందంతో ముగిసింది.

పీష్వాగా రఘునాథరావు వారసుడు, మాధవరావు II 1795లో ఆత్మహత్య చేసుకున్నాడు. రఘునాథ రావు తరువాత పీష్వాగా వారసుడు లేకుండా మాధవరావు II మరణించాడు. సమాఖ్య నియంత్రణ కోసం మరాఠా ప్రభువుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. శక్తివంతమైన జనరల్ దౌలత్ రావ్ సింధియా, మంత్రి నానా ఫడ్నవీస్, బాజీ రావ్ IIని వారి చెప్పుచేతలలో ఉండేలాగున పీష్వాగా నియమించారు. బాజీ రావు II అదే బ్రాహ్మణ కుటుంబానికి చెందినప్పటికీ, తన తల్లిదండ్రుల దురదృష్టకర వారసత్వాన్ని పొందాడు. 1774లో యువ ఐదవ పీష్వా నారాయణరావు హత్యలో బాజీ రావ్ II తండ్రి ప్రమేయం ఉందని అనుమానించారు. అనుమానిత హంతకుల కుమారుడైనందున, అతనిని, అతని మంత్రులు, ప్రభువులు, ప్రజలు, పరివారం అందరూ చాలా చిన్న చూపుతో చూసేవారు. అతని ప్రతి చర్యను పక్షపాతంతో చూసారు. ఆధునిక పూణే నిర్మాణానికి నిర్మాణకర్త, మంచి నిర్వాహకుడు అయినప్పటికీ అతను తరచుగా అసమర్థుడు, పిరికి పీష్వాగా ప్రజలచేత ముద్రించబడ్డాడు.

పండిత రమాబాయి తన రచనలలో బాజీరావు II, అతని 60 సంవత్సరాల వయస్సులో కేవలం 9 లేదా 10 సంవత్సరాల వయస్సు గల బాలికను వివాహం చేసుకున్నందుకు అతనిని విమర్శించింది. [1]

హోల్కర్ పూనాను జయించడం

మార్చు

1800లో ఫడ్నవీస్ మరణానంతరం, దౌలత్ రావ్ సింధియా పీష్వా ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ సాధించాడు. సింధియా, ప్రభుత్వంలోని తన ప్రత్యర్థులను తొలగించడం ప్రారంభించడంతో, పీష్వా బాజీ రావు II తన స్వంత భద్రత గురించి ఆందోళన చెందాడు. అతను సహాయం కోసం బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ విలియం పామర్‌ను ఆశ్రయించాడు.ఆ సమయంలో జనరల్ ఆర్థర్ వెల్లెస్లీ ధోండియా వాఘ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ముగించి, మరాఠా భూభాగం లోని దక్షిణ ప్రాంతాలలో కల్నల్ విలియం ఉన్నాడు. అయితే బాజీరావు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అతను ఇష్టపడలేదు. 1802లో, సింధియా ప్రత్యర్థి అధినేత యశ్వంత్ రావ్ హోల్కర్ పూనాపై దాడిచేశాడు.అతను పీష్వాకు విధేయతను ప్రకటించాడు. సింధియా నియంత్రణ నుండి పూనాను విడిపించడానికి మాత్రమే తాను కోరుకుంటున్నానని హామీని పంపాడు. అయితే యశ్వంత్‌రావు సోదరుడు విఠోజీ రావ్ హోల్కర్‌ని చంపమని గతంలో ఆదేశించినందున బాజీరావు II భయపడ్డాడు. ఆ సమయంలో పూనాకు దూరంగా ఉన్న సింధియా సహాయం కోరాడు. 1802 అక్టోబరు 22న పూనాకు సింధియా సైన్యాన్నిపంపాడు. అక్టోబరు 25న హడప్సర్ యుద్ధంలో హోల్కర్ పీష్వా, సింధియా సంయుక్త దళాలను ఓడించాడు. [2] ఒప్పందం కోసం యుద్ధానికి ముందు అక్టోబరు 25 ఉదయం బాజీరావు బ్రిటిష్ వారికి ప్రాథమిక నిబంధనలను పంపాడు.యుద్ధంలో హోల్కర్ విజయం తర్వాత, అతను వసైకు పారిపోయి, బొంబాయిలో బ్రిటిష్ వారి సహాయం కోరాడు. [2] హోల్కర్ బాజీరావు పెంపుడు సోదరుడు అమృతరావ్ నేతృత్వంలో తాత్కాలిక మండలిని ఏర్పాటు చేసి, అమృత్ రావ్ పేరు మీద పీష్వా ప్రభుత్వాన్ని నడిపాడు.[3]

బ్రిటిష్ వారితో ఒప్పందం

మార్చు

బాజీ రావ్ II, బ్రిటిషువారితో 1802 డిసెంబరులో బస్సేన్ ఒప్పందం చేసుకున్నాడు. దీనిలో బ్రిటీష్ వారు 6,000 మంది పదాతిదళ దళాలను తుపాకులతో మరాఠా భూభాగంలోకి అనుమతించినందుకు బదులుగా బాజీ రావ్ IIను బ్రిటీష్ అధికారులచే పీష్వాగా తిరిగి నియమించడానికి, దాని నిర్వహణ బాద్యత, పూనాలో శాశ్వత బ్రిటీష్ రాజకీయ ఏజెంట్ (నివాసి) స్థిరీకరణను సాగించే ఒప్పందపై అంగీకరించారు. హోల్కర్, సింధియా మరాఠా వ్యవహారాల్లో బ్రిటిష్ చొరబాటును ప్రతిఘటించారు. దీని ఫలితంగా 1803-1805 రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం జరిగింది. [4] దానిలో బ్రిటీష్ వారు విజయం సాధించారు. హోల్కర్లు సింధియాల మధ్య అంతర్గత శత్రుత్వం కారణంగా మరాఠాలు భూభాగాల నష్టాలను అంగీకరించవలసి వచ్చింది. మరాఠా సైన్యంలో దిగుమతి చేసుకున్నతుపాకులను ఎక్కువగా నిర్వహించే సింధియా, ఫ్రెంచ్ ఇతర యూరోపియన్ అధికారులు చేసిన అన్ని యుద్ధాలలో ద్రోహం చేశారు.దిగుమతి చేసుకున్న తుపాకులను నిర్వహించడానికి తగిన సంఖ్యలో తమ సొంత మనుషులకు శిక్షణ ఇవ్వడంలో మరాఠాలు విఫలమయ్యారు.

1817 నవంబరు 5 న, పూనాలోని బ్రిటిష్ రెసిడెంట్‌పై అతని న్యాయవాది మోర్ దీక్షిత్ నేతృత్వంలోని బాజీ రావు II సైన్యం దాడి చేసింది.కాల్పుల విరమణ కోసం బ్రిటీష్ నివాసి ఎల్ఫిన్‌స్టోన్ అభ్యర్థనకు లొంగి తన దళాల పురోగతిని ఆపకపోతే బాజీరావు II ఈ యుద్ధంలో గెలిచేవాడు.యద్దం జరిగే సమయంలో పార్వతి అనే కొండపై నుండి బాజీరావు II తన దళాలకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాన్ని వీక్షించాడు.1817 నవంబరు 5న జరిగిన ఈ యుద్ధం ఖడ్కీ యుద్ధంగా పేర్కొనబడింది. దీనిలో పీష్వాదళాలు ఓటమి పాలైయ్యారు.[5]

తరువాత,జల్నా నుండి వస్తున్న బ్రిటీష్ సేనలను అడ్డుకునేందుకు అతని సేనలు శివార్లలోని గర్పిర్‌కి నేటి షోలాపూర్ రోడ్డు వైపు వెళ్లాయి.అయితే బాజీ రావ్ ముఖ్యులలో ఒకరైన సర్దార్ ఘోర్‌పడే సోండూర్కర్ రాజద్రోహం అతని బలగాన్ని ఉపసంహరించుకోవడానికి దారితీసింది. తదనంతరం, బాజీరావు చకన్ కోటను బ్రిటిష్ దళాల నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఇంతలో బ్రిటిష్ వారు పూనాను కల్నల్ బర్ స్వాదీనంలో ఉంచారు.అయితే జనరల్ జోసెఫ్ స్మిత్ నేతృత్వంలోని బ్రిటిష్ దళం పీష్వాను అనుసరించింది.1817 డిసెంబరు చివరినాటికి, కల్నల్ బర్ పీష్వా దాడి ఉద్దేశించిన వార్త తెలిసి, పూనే, బడ్డ కంపెనీ దళాలు షిరూర్ సహాయం కోరాయి. షిరూర్ నుండి పంపబడిన సేనలు పీష్వా సేనలపైకి వచ్చాయి.ఫలితంగా కోరేగావ్ యుద్ధం జరిగింది. షిరూర్ దళాన్ని ఓడించడంలో పీష్వా విఫలమయ్యాడు. జనరల్ స్మిత్ నేతృత్వంలోని పెద్ద కంపెనీదళం రాకతో భయపడి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.

లోంగిపోవటం, విశ్రాంతి జీవితం

మార్చు

ఐదు బ్రిటీష్ దళాలు పూర్తి నిరాశతో బయలుదేరాయి. వెంటాడే దశచివరిలో ఉన్నసమయంలో నగదు బహుమతి ఆలోచనలో బానిసలుగా మారారు.ఒక కోట నుండి మరొక కోటకు ఐదు నెలల పాటు పరిగెత్తిన తర్వాత, సింధియాస్, హోల్కర్లు, భోంస్లేల నుండి వాగ్దానం చేసిన సహాయం కోసం ఎదురుచూస్తూ, రాని బాజీ రావ్ II చివరకు సర్ జాన్ మాల్కంకు లొంగిపోయాడు. కంపెనీ గవర్నర్-జనరల్ ఫ్రాన్సిస్ రాడన్-హేస్టింగ్స్,1వ మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ (భారతదేశపు మొదటి గవర్నర్-జనరల్ వారెన్ హేస్టింగ్స్‌తో సంబంధం లేదు), మాల్కం బాజీ రావును జీవితకాల యువరాజుగా ఉంచడానికి సిద్ధమయ్యాడు. అతనిని కొనసాగించడానికి అనుమతించాడు. అతని వ్యక్తిగత సంపద, అతనికి ప్రతి సంవత్సరం £80,000 (కొన్ని మూలాల ప్రకారం £100,000) వార్షిక పెన్షన్ చెల్లించటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.ప్రతిగా బాజీ రావ్ II పూనాలోని తన స్వదేశానికి తిరిగి రాకూడదనే షరతుతో తన విశ్రాంతి జీవితంతో  బ్రిటిష్ వారు కేటాయించిన ప్రదేశంలో నివసించాల్సిఉంది. అతను తన వారసత్వానికి సంబంధించిన అన్ని వాదనలను వదులుకున్నాడు.చివరకు తనను తాను పీష్వాగా చెప్పుకోలేకపోవటానికి కారణమైంది.కానీ అతనిని 'మహారాజా' అని పిలవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.ఫ్రాన్సిస్ రాడన్-హేస్టింగ్స్ మాల్కం చేసిన ఒప్పందాన్ని ఆమోదించడానికి ఏకైక కారణం బాజీ రావ్ II అతను ఇప్పటికే 40 ఏళ్లు పైబడినందున ఎక్కువ కాలం జీవించలేడని, అతని పూర్వీకులు చాలా మంది ఆ వయస్సు కంటే ఎక్కువ జీవించలేదని నమ్మకంతో ఆ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బాజీరావు IIని జాగ్రత్తగా చూసేందుకు,బ్రిటిష్ వారు కాన్పూర్ సమీపంలోని బితూర్ ప్రదేశంలో గంగానది కుడి ఒడ్డున ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడ వారి పెద్ద సైనిక స్థావరం కలిగి ఉంది. ఎంపిక చేయబడిన స్థలం సరిగ్గా ఆరు చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది.1818లో అతనితో పాటు పూణే నుండి వెళ్లిన అతని బంధువులు, ఇతరులతో కలిపి దాదాపు 15,000 మంది నివాసితులు ఉండటానికి అది అనువైన ప్రదేశంగా ఉంది.అతను ఒకప్పుడు 50 మిలియన్లను జనాభాను పాలించాడు.కంపెనీ కోరికలకు విరుద్ధంగా, బాజీరావు మరో 33 సంవత్సరాలు జీవించి 1851లో బితూర్‌లో మరణించాడు.

టెలివిజన్ ఫిల్మ్

మార్చు
  • జాతీయ దూరదర్శన్ ప్రసారమైన 2001 హిందీ హిస్టారికల్ డ్రామా సిరీస్ 1857 క్రాంతిలో, బాజీరావ్ II పాత్రను లలిత్ మోహన్ తివారీ పోషించాడు. 
  • 2019 హిందీ చిత్రం మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో, సురేష్ ఒబెరాయ్ బహిష్కరించబడిన పీష్వా పాత్రను పోషించాడు.

ఇది కూడ చూడు

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. Meera Kosambi (22 January 2016). Pandita Ramabai: Life and Landmark Writings. Routledge, Taylor and Francis Group, London and New York. p. 120. ISBN 9781317334019. [Peshwa] Bajirao II had married a girl of 9 or 10 when he was 60 and blind, to maintain the perpetual sacred fire [agnihotra]. This lady now lives in Nepal. Oh, the fate of our Indian women! Bajirao-saheb was a ruler who belonged to my caste, and he was also my kinsman. But that does not mean that I approve of his vices.
  2. 2.0 2.1 Rory Muir (2013). Wellington: The Path to Victory 1769-1814. Yale University Press. pp. 107–124. ISBN 9780300186659.
  3. Arthur Wellesley Duke of Wellington (1877). A Selection from the Despatches, Treaties, and Other Papers of the Marquess Wellesley, K.G., During His Government of India. Clarendon. p. 218.
  4. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 64–66. ISBN 9788131300343.
  5. John F. Riddick (2006). The History of British India: A Chronology. Greenwood Publishing Group. p. 34. ISBN 978-0-313-32280-8.

వెలుపలి లంకెలు

మార్చు