రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి

రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1966
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి, హైమావతమ్మ[1]
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఆర్‌. రమేష్ రెడ్డి తన తండ్రి, మాజీ మంత్రి ఆర్. రాజగోపాల్‌రెడ్డి వారసుడిగా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డిపై 10145 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డి చేతిలో 13052 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఆర్‌. రమేష్ రెడ్డి 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014, 2019లో టీడీపీ తరపున రాయచోటి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (26 March 2019). "Kadapa: 80-year-old campaigns for her son". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. CEO Telangana (2022). "Affidavit" (PDF). Archived from the original (PDF) on 2017-09-11. Retrieved 8 June 2022.
  3. Andhra Jyothy (22 May 2019). "'ఆయన గెలుపునకు వచ్చిన ఢోకా ఏమీ లేదు'". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.