రేణూ దేశాయ్

తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్

రేణూ దేశాయ్ (జ. డిసెంబరు 4, 1981) ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్.[2]

రేణూ దేశాయ్
జననం
రేణూ దేశాయ్

(1981-12-04) 1981 డిసెంబరు 4 (వయసు 42)
వృత్తిమోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు2000-2006
జీవిత భాగస్వామిపవన్ కళ్యాణ్[1]
పిల్లలుఅకీరా నందన్ (జ. 2004)
ఆద్య(జ. 2010)

నేపథ్యం

మార్చు

రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చ కు దారితీసింది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే జానీ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 జనవరి 28న లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు[3]. ఆ తరువాత వారికి కూతురు ఆద్య పుట్టింది. వారు 2011లో విడాకుల కొరకు కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వారికి విడాకులు మంజూరైనవి. [4][5][6] 2018లో, దేశాయ్ తనకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది, కానీ తన కాబోయే భర్త గుర్తింపును వెల్లడించలేదు.[7][8]

సంవత్సరం చిత్రం పాత్ర
2000 జేమ్స్ పండు రేణు
2000 బద్రి వెన్నెల
2003 జానీ గీత

కాస్ట్యూం డిజైనర్

మార్చు
సంవత్సరం చిత్రం
2001 ఖుషి
2003 జానీ
2004 గుడుంబా శంకర్
2005 బాలు
2006 అన్నవరం
2022 టైగర్ నాగేశ్వరరావు[9]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-09. Retrieved 2013-06-12.
  2. "Pavan Kalyan gets married". rediff.com. 2009-01-29. Retrieved 2009-02-04.
  3. "Annadatha Sukheebhava host Renu Desai has a message for fans on son Akira's birthday". The Times of India. 9 April 2019. Retrieved 11 April 2019.
  4. "Pawan's estranged wife Renu Desai spotted in Vijayawada". Bay News. 30 October 2012. Archived from the original on 28 February 2018.
  5. Goyal, Divya (26 June 2018). "Pawan Kalyan's Ex-Wife Renu Desai Is Engaged, Kids Attended Ceremony. See Pics". NDTV. Retrieved 11 April 2019.
  6. "Pawan Kalyan's ex-wife Renu Desai gets engaged but keeps her fiance's identity a secret". The Indian Express (in ఇంగ్లీష్). 26 June 2018. Retrieved 4 September 2020.
  7. Goyal, Divya (26 June 2018). "Pawan Kalyan's Ex-Wife Renu Desai Is Engaged, Kids Attended Ceremony. See Pics". NDTV. Retrieved 11 April 2019.
  8. "Pawan Kalyan's ex-wife Renu Desai gets engaged but keeps her fiance's identity a secret". The Indian Express (in ఇంగ్లీష్). 26 June 2018. Retrieved 4 September 2020.
  9. Sakshi (7 May 2022). "బ్రేక్‌కి బ్రేక్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.

బయటి లంకలు

మార్చు