రైల్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఆదిత్య మూవీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ధనుష్, కీర్తి సురేష్, హరీష్ రావత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించగా, తమిళంలో 'తొడరి' పేరుతో తెలుగులో రైల్ పేరుతో 16 సెప్టెంబర్ 2016న విడుదల చేశారు. [1]

రైల్
దర్శకత్వంప్రభు సాల్మన్
రచనప్రభు సాల్మన్
నిర్మాతఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి
తారాగణంధనుష్
కీర్తి సురేష్
ఛాయాగ్రహణంవెట్రివేల్ మహేంద్రన్
కూర్పుఎల్వికే. దాస్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
ఆదిత్య మూవీ కార్పొరేషన్
విడుదల తేదీ
2016 సెప్టెంబరు 22 (2016-09-22)
సినిమా నిడివి
167 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఢిల్లీ నుంచి చెన్నై కు వెళ్ళే రైల్ లో పాంట్రీలో క్యాంటీన్ బాయ్ గా బల్లి శివాజీ(ధనుష్) పనిచేస్తుంటాడు. అదే రైలులో ప్రయత్నిస్తున్న హీరోయిన్ శ్రీశకు సహాయకురాలు ఉన్న సరోజ (కీర్తి సురేష్) తో శివాజీ ప్రేమలో పడుతాడు. ఆమె కూడా శివాజీని ప్రేమిస్తుంది. ఇద్దరు రైల్ లో సరదాగా ప్రేమాయణం సాగిస్తున్న కేంద్రమంత్రి (రాధారవి) ని టార్గెట్ చేస్తూ కొందరు ఉగ్రవాదులు ట్రైన్ ను హైజాక్ చేస్తారు. ఆ టెర్రరిస్టుల్లో సరోజా కూడా ఉంటుంది. ఇంతకీ సరోజకి, టెర్రరిస్టులకు సంబంధం ఏంటీ ? చివరకు వారిద్దరి ప్రేమ ఏమవుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులుసవరించు

 • ధనుష్
 • కీర్తి సురేష్
 • హరీష్ రావత్
 • తంబి రామయ్య
 • కరుణాకరన్
 • స్వరూపు
 • గణేష్ వెంకట్రామన్
 • హరీష్ ఉత్తమన్
 • పూజ ఝవేరి
 • చిన్ని జయంత్
 • ఇమ్మాన్ అన్నచి
 • అశ్విన్ రాజా
 • సైజు కురుప్
 • జి. జ్ఞానసంబంధం
 • పట్టిమంద్రం రాజా
 • బోస్ వెంకట్
 • అను మోహన్
 • ఆర్.వి. ఉదయ కుమార్
 • ఎ. వెంకటేష్
 • ప్రేమ్
 • బడవా గోపి
 • దుర్బుక శివ
 • మాయ సుందరకృష్ణన్
 • భారతి కన్నన్
 • దళపతి
 • సూపర్ గుడ్ సుబ్రమణి

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఆదిత్య మూవీ కార్పొరేషన్
 • నిర్మాత: ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్
 • సంగీతం: డి. ఇమ్మాన్
 • సినిమాటోగ్రఫీ: వెట్రివేల్ మహేంద్రన్

పాటలుసవరించు

క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "అరెరే ఏంటిది"  హరిచరణ్ 4:52
2. "ఊరంతా విన్నది"  శ్రేయ ఘోషల్, మరియా రో విన్సన్ట్ 4:09
3. "మనిషి మనిషి"  శెంబగరాజ్ 3:35
4. "పోయే ప్రాణం"  హరిచరణ్, శ్రేయ ఘోషల్ 4:34
5. "లవ్ ఇన్ వీల్స్"  అనిత కార్తికేయన్ 3:04
20.14

మూలాలుసవరించు

 1. The Times of India (22 September 2016). "Rail Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
 2. IndiaGlitz. "Rail review. Rail Telugu movie review, story, rating". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
 3. The Hans India (24 September 2016). "Dhanush's Rail Twitter Review" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=రైల్&oldid=3664203" నుండి వెలికితీశారు