రొక్కం లక్ష్మీనరసింహ దొర

భారతీయ రాజకీయ నాయకుడు
(రొక్కం లక్ష్మీనరసింహదొర నుండి దారిమార్పు చెందింది)

రొక్కం లక్ష్మీనరసింహదొర భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు.[1]

Rokkam Lakshmi Narasimham Dora
రొక్కం లక్ష్మి నరసింహం దొర
2వ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్
In office
1955 ఏప్రిల్ 23 – 1956 డిసెంబరు 03
గవర్నర్చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది
అంతకు ముందు వారునల్లపాటి వెంకటరామయ్య
నియోజకవర్గంటెక్కలి
వ్యక్తిగత వివరాలు
నివాసంశ్రీకాకుళం జిల్లా

ఇతడు వృత్తిరీత్యా న్యాయవాది. వీరు శ్రీకాకుళం జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా, గంజాం జిల్లా బోర్డు సభ్యుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా, శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సలహాసంఘం అధ్యక్షుడిగా వివిధ పదవులను నిర్వహించారు.

1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆకాలంలో కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణ సంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూసంస్కరణల కమిటీలో సభ్యుడిగా తన సేవలను అందించాడు. 1955 నుండి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేశాడు.[2] [3]ఈయన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకరు ఆగష్టు 15 1950 న శ్రీకాకుళం జిల్లా పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం, పార్వతీపురం రెవెన్యూ డివిజన్లతో ఏర్పడినది. జనవరి 3 1951 న శ్రీకాకుళం జిల్లా బోర్డు ఏర్పడింది. దీనికి మొదటి అధ్యక్షునిగా రొక్కం లక్ష్మీనరసింహదొర ఎన్నికయ్యారు.[4]

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో లక్ష్మీనరసింహదొర టెక్కలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.[5] 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఆ సభలో సభ్యుడుగాఅ కొనసాగాడు.

మూలాలు

మార్చు
  1. ఆంధ్ర శాసనసభ్యులు, 1955 పుస్తకంలో పేజీ. 2..
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.
  3. "Former Speakers - Legislative Assembly - Liferay DXP". web.archive.org. 2024-06-23. Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "శ్రీకాకుళం బ్లాగు". Archived from the original on 2015-04-19. Retrieved 2015-05-17.
  5. BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.