రోజులు మారాయి (1984 సినిమా)

రోజులు మారాయి విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వై. కేశవరెడ్డి నిర్మాతగా, వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గోపాలకృష్ణ అందించగా ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు నిర్వహించారు. సంగీతం శివాజీ రాజా అందించగా, పాటలు ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల రాయగా, నృత్యదర్శకత్వం రాజు చేశారు.

రోజులు మారాయి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ల సత్యనారాయణ
నిర్మాణం వై.కేశవరెడ్డి
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
నూతన్ ప్రసాద్,
ప్రభ,
రాజేంద్రప్రసాద్,
శివకృష్ణ
కళ కొండపనేని రామలింగేశ్వరరావు
విడుదల తేదీ మే 12, 1984
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

సినిమాలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్, ప్రభ, గీత, రాజ్యలక్ష్మి, పి.ఎల్. నారాయణ, డాక్టర్ శివప్రసాద్, రాజ్ వర్మ, హేమసుందర్, రమణారెడ్డి, సాక్షి రంగారావు, కిరణ్ బాబు, రాజు, జానకి తదితరులు నటించారు.[1]

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, మాటలు - పరుచూరి గోపాలకృష్ణ
  • పాటలు - ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల
  • సంగీతం - శివాజీరాజా
  • ఛాయాగ్రహణం - ఆర్.కె.రాజు
  • కళ - కె.రామలింగేశ్వరరావు
  • కూర్పు - బాబూరావు
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - అక్కినేని శ్రీనివాసరావు
  • నృత్యాలు - రాజు
  • నిర్మాత - వై. కేశవరెడ్డి
  • దర్శకత్వం - వేజెళ్ళ సత్యనారాయణ

మూలాలు మార్చు

  1. పత్రిక, ప్రతినిధి (4 June 1983). "దాదాపు పూర్తయిన 'ధర్మాత్ముడు'". సినిమా పత్రిక: 5.