రోజ్‌మేరి నూనె
రోజ్మేరి నూనె (రోజ్మేరి) ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం.ఈ నూనెను అటు సుగంధ ద్రవ్యంగాను ఇటు ఆయుర్వేద వైద్యంలో ఔషధముగా ఉపయోగిస్తారు.రోజ్‌మేరి నూనె వలన పలు రుగ్మతలను సులభంగా తగ్గించవచ్చును.రోజ్‌మేరి మొక్క యొక్క పుష్పించే పైభాగాలనుండి (అనగా పూలు, పూమొగ్గలు, పూలకాడలు, లేత ఆకులు) స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు. రోజ్‌మేరి మొక్క దవనం వంటి ఒక ఓషధీ మొక్క. రోజ్‌మేరి నూనె జ్ఞాపకశక్తి పెంచును.అలాగే శ్వాసకోశ ఇబ్బందులను నివారించును.
రోజ్‌మేరి మొక్క
మార్చుఇది లాబీయేటే కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర పేరు రోజ్మారినస్ అఫిసినలిస్ (రోజ్మారినస్ కోరోనరియమ్ అనికూడా అంటారు). రోజ్‌మేరి మొక్క సతతహరిత పొద.ఇది దాదాపు 1.5 మీటర్ల ఎత్తు (4 అడుగులు) వరకు పెరుగును. సూదులవంటి ఆకారమున్న, గ్రీన్-గ్రే రంగు ఆకులను కల్గి వుండును.పూలు నీలిరంగులోవుండును.[1]
ఈ మొక్క మూలస్థావరం ఆసియా అయినప్పటికి ప్రస్తుతం (2018 నాటికి) ఫ్రాన్స్, తూనిసియా,, యుగోస్లేవియా లలో ఎక్కువగా సాగులో ఉంది. రోజ్‌మేరి పేరు లాటిన్ పదం రోజ్మరినస్ నుండి వచ్చింది.ఈజిప్టులు, గ్రీకులు రోమనులు ఈ ఓషది మొక్కను అరుదైన పవిత్రమైన మొక్కగా భావించేవారు. మధ్య యుగంలో ఇదీ చెడ్డ ఆత్మలను పారద్రోలుటకు ఉపయోగించేవారు, ప్లేగు వ్యాధి నుండి రక్షణకు ఉపయోగించే వారు.ఫ్రాన్సులో అంటు వ్యాధులు ప్రభలిన సమయంలో ఆసుపత్రులలో ఈ మొక్కను కాల్చేవారు.[1] తాజా లేదా ఎండబెట్టిన రోజ్మేరి ఆకులను వంటలకు సువాసన కై చేర్చుతారు.[2]
రోజ్‌మేరి నూనె
మార్చురోజ్మెరి నూనె ఒక విశిష్టమైన ప్రత్యేక వాసన కల్గి ఉంది.పారదర్శకమైన నూనె.నీటి వంటి స్నిగ్థత కల్గి ఉంది.రోజ్‌మేరి తైలంలో చాలా రసాయన సమ్మేళనాలు (ఆల్కహాలులు, కీటోనులు, పినోల్స్, టెర్పినోలు వంటివి) వున్నవి, అంతేకాదు ప్రధాన రసాయన సమ్మేళనాలు కార్నోసోల్, కార్నోసిక్ ఆమ్లం, ఉర్సోలిక్ ఆమ్లం, రోజ్మరినిక్ ఆమ్లం,, కాఫిక్ ఆమ్లాలు కూడా ఉన్నాయి.[2]
నూనెలోని రసాయన సమ్మేళనాలు
మార్చురోజ్మేరి తైలంలో చాలా రసాయన సమ్మేళనాలు (ఆల్కహాలులు, కీటోనులు, పినోల్స్, టెర్పినూలు వంటివి) వున్నప్పటికి, అందులో ప్రధానమైనవి, ఎక్కువ ప్రమాణంలో వున్నవి ఆల్ఫా –పినేన్, బోర్నేయోల్,, బీటా పినేన్, కాంపర్, బోర్నైల్ అసిటేట్, 1,8-సినేయోల్, లిమోనేన్ లు.[1] చెట్తు పెరిగిన వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి నూనెలోని రసాయన సమ్మేళన పదార్థాలు వాటి శాతం మారును.
రోజ్మేరి ఆవశ్యక నూనెలో ఇరవై రకాల రసాయన సమ్మేళనాలను గుర్తించారు.అందులోముఖ్యమైన కొన్నిరసాయనాలను కిందిపట్టికలో పొందుపర్చడమైనది.[3]
వరుస సంఖ్య | రసాయన పదార్థం | శాతం |
1 | ఆల్ఫా పినెన్ | 40.55 to 45.10% |
2 | 1,8-సినేయోల్ | 17.40 to 19.35% |
3 | కాంపెన్ | 4.73 to 6.06% |
4 | వెర్బేనోన్ | 2.32 to 3.86% |
5 | బీటా పినేన్ | |
6 | బోర్నైల్ అసిటేట్ | |
7 | బోర్నేయోల్ | |
8 | లిమోనెన్ |
ఆల్ఫా –పినేన్, బోర్నేయోల్,, బీటా పినేన్, కాంపర్, బోర్నైల్ అసిటేట్, 1,8-సినేయోల్, లిమోనేన్ లు.
- దక్షిణ స్పైయిన్ లోని 12రకాల రోజ్మేరి నూనెలను సేకరించి, వాటిని గ్యాస్ క్రొమటోగ్రపి ద్వారావిశ్లేషించి కనుగున్న కొన్ని ముఖ్య రసాయన సమ్మేళనాల పట్టిక[4]
వరుస సంఖ్య | రసాయన సమ్మేళనం | శాతం |
1 | కాంపర్ | 17.2-34.7% |
2 | ఆల్ఫా పినేన్ | 10.2-21.6% |
3 | 1, -సినేయోల్ | 12.1-14.4% |
4 | కాంపెన్ | 5.2-8.6% |
5 | బోర్నెల్ | 3.2-7.7% |
6 | బీటా పినేన్ | 2.3-7.5% |
7 | బీటా కారియో పిల్లేన్ | 1.8-5.1% |
8 | లిమోనేన్ | 2.0-3.8% |
9 | ఆల్ఫా టేర్పినోల్ | 1.2-2.5% |
10 | మైర్సేన్ | 0.9-4.5% |
11 | p-సైమెన్ | 0.2-3.4% |
12 | బొర్నైల్ అసిటేట్ | 0.2-2.3% |
13 | లినలూల్ | 0.3-1.0% |
14 | టెర్పినేన్-4-ఒల్ | 0.4-0.9% |
భౌతిక ధర్మాలు
మార్చురోజ్మేరి నూనె యొక్క భౌతిక ధర్మాల పట్టిక[5]
వరుస సంఖ్య | భౌతికగుణం | విలువల మితి |
1 | అణు ఫార్ములా | రోజ్ మేరీ ఆయిల్:C10H18O1 కార్నోసోల్: C20H26O4 కార్నోసిక్ ఆమ్లం: C20H28O4 రోజ్ మర్నిక్ ఆమ్లం: C18H16O8 |
2 | అణుభారం | రోజ్ మేరీ ఆయిల్ టెర్పేన్:154.25గ్రా/మోల్ కార్నోసోల్:330.4104 కార్నోసిక్ ఆమ్లం:332.43392 రోజ్ మర్నిక్ ఆమ్లం:360:31484 |
4 | రంగు | రంగు లేదు లేదా లేత పసుపు |
5 | సాంద్రత | 0.908 |
6 | ద్రవీభవన స్థానం | 35.37 °C |
7 | బాష్పీభవన స్థానం | 176 °C |
8 | ద్రావణీయత | నీటిలో కరగదు.మెథనోల్ లో కరుగును |
నూనె సంగ్రహణం
మార్చురోజ్మేరి నూనెను మొక్క యొక్క తాజా పూష్పగుచ్చ సముదాయం నుండి ( flowering tops), అనగా పూలు వాటి కాడలు, చుట్టూ వున్న లేత ఆకుల సముదాయం నుండి స్టీము డిస్టిలేసను పద్ధతిలో నూనెను ఉత్పత్తి చేస్తారు.పూల గుచ్చ సముదాయం నుండి 1.0-2.0% వరకు నూనె దిగుబడి వచ్చును.[1]
నూనె ఉపయోగాలు
మార్చువైద్యపర వినియోగం
మార్చు- రోజ్‌మేరి నూనె బాధానివారిణి. వ్యాకులతా నివారిణి, కణ జాలాన్ని, కండరాలను కుంచింపజేసే ఔషధం, వాయుహరమైన ఔషధము, శిరోరోగములకు మందు, మృదువిరేచనకారి, ఉత్సాహమును పుట్టింౘు మందు, జీర్ణకారియైన, కాలేయ సంబంధి మందుగా గుణాలను ధర్మాలను కల్గి ఉంది.[1]
- రోజ్మేరి నూనె క్యాన్సరు నిరోధక ప్రభావం కల్గి ఉంది.యాంటీ ఆక్సిడెంట్ గుణం కల్గి ఉంది.[2]
- కాలేయం పని తీరును మెరుగు పరచును.తలవెంట్రుకలౌ రాలడం తగ్గిస్తుంది.వెంట్రుకలు బాగా పెరుగుటకు దోహద పడును.జ్ఞాపక శక్తిని పెంచును.[2]
నూనె ఉపయోగంలో ముందు జాగ్రత్తలు
మార్చు- గర్భవతిగా వున్నప్పుడు ఈ నూనెను వాడరాదు.అలాగే మూర్ఛరోగం, ఎక్కువ రక్త వత్తిడి వున్నవారికి సరిపడదు.రోజ్మేరి నూనెను దేవదారు, సిట్రోనెల్లా, జెరానియమ్, లావెండరు, లెమన్ గ్రాస్/నిమ్మగడ్డి, పుదీనా, నూనెలతో మిశ్రమం చేసి ఉపయోగించవచ్చు.[1].
బయటి వీడియోల లింకులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Rosemary essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-02-27. Retrieved 2018-08-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 2.2 2.3 "ROSEMARY OIL". draxe.com. Archived from the original on 2018-01-09. Retrieved 2018-08-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Physico-chemical evaluation of Rosmarinus officinalis L. essential oils". scielo.br. Archived from the original on 2017-12-02. Retrieved 2018-08-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chemical Composition and Seasonal Variations of Rosemary Oil from Southern Spain". tandfonline.com. Retrieved 2018-08-31.
- ↑ "Rosemary oil Property". chemicalbook.com. Archived from the original on 2016-08-10. Retrieved 2018-08-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)