లక్ష్మీ గోపాలస్వామి

లక్ష్మీ గోపాలస్వామి, దక్షిణ భారత సినీ నటి, భరతనాట్య కళాకారిణి.[1] ఆమె మలయాళంకన్నడ సినిమా, తమిళ సినిమాల్లోనటించింది. కొన్ని టీవీ ధారావాహికల్లో కూడా లక్ష్మీ నటించింది. కన్నడ సినిమా విద్యలో ఆమె నటనకు కర్ణాటక రాష్ట్ర సినీ ఉత్తమ నటి పురస్కారం లభించింది. మలయాళంలో ఆమె మొట్టమొదటిసారి అరయన్నంగలుడే వీడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మమ్ముట్టితో కలసి  నటించిన ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ సహాయ నటి పురస్కారం వచ్చింది. ఏషియానెట్ చానల్ లో వచ్చే వడాఫోన్ తకధిమి అనే నృత్య ప్రధాన షోలో ఆమె న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.

లక్ష్మీ గోపాలస్వామి
జననం
లక్ష్మీ గోపాలస్వామి

జాతీయతIndian
వృత్తి
  • నటి
  • భారతీయ శాస్త్రీయ నృత్యం
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • గోపాలస్వామి
  • ఉమ
పురస్కారాలుఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు (1999, 2007)

తొలినాళ్ళ జీవితం

మార్చు

బెంగళూరులోని కన్నడ కుటుంబంలో జన్మించింది లక్ష్మీ. ఆమె తల్లిదండ్రులు ఎం.కె.గోపాలస్వామి, డాక్టర్ ఉమా గోపాలస్వామి. ఆమెకు ఒక తమ్ముడు అర్జున్.[2] ఆమె తల్లి ఉమ సంగీత కళాకారిణి. ఆమె ప్రోత్సాహంతోనే లక్ష్మి భరతనాట్యం నేర్చుకొంది. 

నటన కెరీర్

మార్చు

2007లో ఆమె రెండో సారి కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకుంది. తనియే సినిమాలోని నటనకు రెండో ఉత్తమ నటి పురస్కారం లభించింది.[3] ఈ సినిమాకు అట్లాస్ సినీ విమర్శకుల ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది లక్మీ నటనకు.[4][5]

మూలాలు

మార్చు
  1. "The Hindu : Metro Plus Bangalore : Framed!!". Chennai, India: The Hindu. 5 July 2008. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 14 September 2013.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-05. Retrieved 2017-04-18.
  3. "Stepping into a new phase". Chennai, India: The Hindu. 14 December 2007. Archived from the original on 6 నవంబరు 2008. Retrieved 21 November 2009.
  4. "Making a foray into Bollywood". Chennai, India: The Hindu. 2 February 2008. Archived from the original on 22 సెప్టెంబరు 2008. Retrieved 21 November 2009.
  5. "Malayalam Cinema News : 'Ore Kadal', 'Thaniye' share critics award for best film". bharatwaves.com. Retrieved 21 November 2009.