జి. సాయన్న

తెలంగాణ రాజకీయ నాయకుడు

జ్ఞాని సాయన్న (1951, మార్చి 5 - 2023, ఫిబ్రవరి 19) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జి. సాయన్న
జి. సాయన్న


పదవీ కాలం
  1994 - 2009, 2014 - 2018, 2018- 2023
నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 5, 1951
చిక్కడపల్లి, హైదరాబాదు, తెలంగాణ
మరణం 2023 ఫిబ్రవరి 19(2023-02-19) (వయసు 71)
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సాయన్న - భూదేవి
జీవిత భాగస్వామి గీత
సంతానం 3 కుమార్తెలు, (లాస్య నందిత[1], నివేదిత, నమ్రత)
నివాసం గృహలక్ష్మి కాలనీ, కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ

జననం, విద్య

మార్చు

సాయన్న 1951, మార్చి 5న సాయన్న - భూదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని చిక్కడపల్లిలో జన్మించాడు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ (బిఎస్సీ), 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

సాయన్నకు గీతతో వివాహం జరిగింది. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4] ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.[5] తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

హోదాలు

మార్చు
  1. ఆరుసార్లు హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వీధి బాలల పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్
  3. హెచ్‌సి చైల్డ్ ట్రాఫికింగ్ ఆంధ్రప్రదేశ్

ఇతర వివరాలు

మార్చు

చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశాలు సందర్శించాడు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న 2023, ఫిబ్రవరి 19న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.[7][8]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (25 August 2023). "నాయకుడు ఆకాశంలోంచి ఊడిపడడు.. ప్రజల్లోంచి వస్తాడు.. కేసీఆర్‌ అలాంటి నాయకుడే : సాయన్న కూతురు లాస్య నందిత". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
  3. "G. Sayanna | MLA | TRS | Secunderabad Cantt | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-03. Retrieved 2021-09-13.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  6. https://telanganatoday.com/sayanna-retains-secunderabad-cantonment/amp
  7. "MLA Sayanna: బీఆర్ఎస్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత.. చికిత్స పొందుతూ.. | Secunderabad Cantonment MLA G Sayanna Passes Away | TV9 Telugu". web.archive.org. 2023-02-19. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Namasthe Telangana, NT News (20 February 2023). "అజాతశత్రువుకు అశ్రునివాళి". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.