లోంగేవాలా యుద్ధం

లోంగేవాలా యుద్ధం
భారత్ పాక్ యుద్ధం 1971లో భాగము

మొదటి వరుస: 1971 యుద్ధంలో ఓడిపోయాక ఢాకాలో లొంగుబాటుపై సంతకం చేస్తున్న లెఫ్టి. జన. ఎ.ఎ.కె. నియాజీ, పాకిస్తాన్ తూర్పు కమాండు కమాండరు, భారత తూర్పు కమాండు కమాండరు లెఫ్టి. జన. జగ్జిత్ సింగ్ అరోరా. కుడివైపున మైకు పట్టుకుని సురోజిత్ సేన్ (ఆలిండియా రేడియో).
రెండవ వరుస (ఎడమ నుండి కుడికి): వైస్ అడ్మి. ఎన్. కృష్ణన్, ఎయిర్ మార్షల్ హరిచంద్ దివాన్, లెఫ్టి.జన. సగత్ సింగ్ రథోడ్, మేజ. జన. జె.ఎఫ్.ఆర్ జాకబ్, ఫ్లైట్.లెఫ్టి. కృష్ణమూర్తి (జాకబ్ భుజం మీదుగా చూస్తున్న వ్యక్తి).
తేదీ1971 డిసెంబరు 4-7
ప్రదేశంలోంగేవాలా రాజస్థాన్ లోని రామ్‌గఢ్ నుండి ~30 కి.మీ. (19 మై.)
27°31′30″N 70°09′24″E / 27.524942°N 70.156693°E / 27.524942; 70.156693
ఫలితంIndian victory[1]
ప్రత్యర్థులు
 India Pakistan
సేనాపతులు, నాయకులు
India మేజర్ జనరల్ జె.ఎఫ్.ఆర్ జాకబ్

India బ్రిగేడియర్ ఇ.ఎన్.రామదాస్

India లెఫ్టి. కల. ఖుర్షీద్ హుసేన్[2]

India మేజర్ కుల్‌దీప్ సింగ్ చాంద్‌పురి

India అసిస్టెంట్ కమాండెంట్ భైరవ్ సింగ్, BSF

India 2nd లెఫ్తి. ధరం వీర్ భాన్

India వింగ్ కమాం. ఎం.ఎస్. బావా
India వింగ్ కమాం. ఆర్.ఎస్. కొవస్‌జీ
India వింగ్ కమాం. సురేష్
India వింగ్ కమాం. షెర్విన్ టల్లీ

India Major Atma Singh
పాకిస్తాన్ మేజ్ జన. బి.ఎం.ముస్తఫా

పాకిస్తాన్ బ్రిగే. తారిక్ మీర్
పాకిస్తాన్ బ్రిగే. జహన్‌జేబ్ అబాబ్
పాకిస్తాన్ లెఫ్టి.కల. అక్రాం హుసేన్

పాకిస్తాన్ లెఫ్టి.కల. జహీర్ ఆలం ఖాన్
పాల్గొన్న దళాలు
India 12th Infantry Division India 122 Squardonపాకిస్తాన్ 18th Infantry Division
  • పాకిస్తాన్ 206 Brigade
  • పాకిస్తాన్ 51 Brigade
  • పాకిస్తాన్ 22 Cavalry (T-59)
  • పాకిస్తాన్ 38 Cavalry (Sherman)
  • పాకిస్తాన్ Field Rgt. (25 pdr)
  • పాకిస్తాన్ 120 mm mortar battery
  • పాకిస్తాన్ 130 mm med. battery
బలం
1 Company (120 soldiers)[3]

2 MMGs
2 L16 81mm mortars
4 rocket launchers
2 Jeep-borne 106mm RCL guns

4 Hawker Hunters
2 Mobile infantry brigade (2,000–3,000 soldiers)[4][5]

40 tanks[5]
1 field regiment

2 artillery batteries
ప్రాణ నష్టం, నష్టాలు
ఇద్దరు సైనికులు మరణించారు[6][7]

1 ట్యాంగు విధ్వంసక గన్ ధ్వంసమైంది[6]

5 ఒంటెలు మరణించాయి
200 మంది సైనికులు మరణించారు[6]
36 ట్యాంకులు ధ్వంసమయ్యాయి
500+ వాహనాలు ధ్వంసమయ్యాయి[6][5]
లోంగేవాలా యుద్ధం is located in Rajasthan
లోంగేవాలా యుద్ధం
Location within India Rajasthan

లోంగేవాలా యుద్ధం (1971 డిసెంబరు 4-7) 1971 లో జరిగిన భారత-పాక్ యుద్ధంలో పశ్చిమ రంగంలో జరిగిన తొలి ముఖ్య ఘట్టాల్లో ఒకటి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ దళాలు, రాజస్థాన్ లోని థార్ ఎడారి లోని లోంగేవాలాలో ఉన్న భారత సరిహద్దు పోస్టు వద్ద భారత రక్షణ దళాలపై దాడి చేసాయి. భారత్ తరఫున నాలుగు హంటర్ ఫైటర్ విమానాలు, 120 మంది సైనికులు, పాక్ తరఫున 30-40 ట్యాంకులతో పాటు 2,000–3,000 మంది సైనికులు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.

మేజర్ కులదీప్ సింగ్ చాంద్‌పురి నేతృత్వంలో, భారత సైన్యపు 23వ బెటాలియన్ కు చెందిన పంజాబ్ రెజిమెంటు, మరిన్ని బలగాలు వచ్చేంత వరకూ పాకిస్తానీ మెకనైజ్డ్ పదాతి దళాన్ని ఎదిరించి నిలబడడమో లేదా కాలినడకన పారిపోవడమో చెయ్యాల్సిన పరిస్థితి ఎదురైంది. [8] ఎదిరించేందుకే నిర్ణయించుకున్న చాంద్‌పురి, తన బలగాలను సరిగ్గా మోహరించుకుని తన బలమైన రక్షణ స్థితిని ఉపయోగించుకుంటూ, శత్రు వ్యూహాలలోని లోపాల వల్ల ఏర్పడిన బలహీనతలను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆరు గంటల తర్వాత మరిన్ని బలగాలు వచ్చే లోపు, భారత వైమానిక దళం ఫార్వర్డ్ ఎయిర్ కంట్రోలర్ పోస్టుకు రక్షణగా విమానాలను మోహరించడంతో అతనికి సరైన మద్దతు లభించింది.

ఈ దాడిలో పాకిస్థాన్ కమాండర్లు అనేక సందేహాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. లోంగేవాలా ప్రాంతంలో భారత దాడి విమానాలు ఉంటాయని అంచనా వేయడంలోవ్యూహాత్మక వైఫల్యం, సరైన నిఘా లేకుండా ముందుకు సాగడం, ఇంజనీర్ నిఘా లేకుండా వ్యూహాత్మక దాడి చెయ్యడం వంటివి ఈ వైఫల్యాల్లో భాగం. [9] దీంతో భారత వైమానిక దాడిలో పాకిస్తానీ బ్రిగేడ్ సమూహం బాగా దెబ్బతింది. సాయుధ వాహనాల కదలికకు అనువుగా లేని ఇసుక నేలలో వాటి చక్రాలు దిగబడిపోయాయి. పైగా వాహనాలను ఒకే వరుసలో మోహరించారు. ఇంధన నిల్వను ఉపయోగించడం ద్వారా భారత కాల్పులకు ఎక్కువ అవకాశం కలిగింది. పరిచయం లేని భూభాగంలో రాత్రి పూట దాడిని నిర్వహించడం, బలగాల కదలికలకు అనుకోని అవరోధాలు తలెత్తడంతో పదాతిదళంలో గందరగోళం ఏర్పడం, భారతీయ సైనికుల చిన్న ఆయుధాల నుండీ, పదాతిదళ శతఘ్నుల కాల్పుల నుండీ కాచుకోగలిగే వీలు ఉన్నప్పటికీ, రాత్రి కీలకమైన వేళలో దాడులను ఆపుజెయ్యడం వంటి నిర్ణయాలు కూడా ఈ వైఫల్యాల్లో ఉన్నాయి. [9]

నేపథ్యం

మార్చు

1971 యుద్ధ సమయంలో భారత సైన్యం ప్రధానంగా తూర్పు థియేటర్ వైపు దృష్టి పెట్టింది. పశ్చిమ రంగంలో పాక్ సైన్యం ఏ విధమైన విజయాన్ని సాధించకుండా నిరోధిస్తే చాలుననే ఆలోచనలో భారతదేశం ఉంది. ఆ విధంగా, తూర్పున భారత్ స్వాధీనం చేసుకున్న భూభాగాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్‌కు యుద్ధానంతర బేరసారాల్లో పైచేయి లేకుండా చెయ్యాలని భావించింది. 1971 నవంబరు చివరి వారం నాటికి, భారత సైన్యం తూర్పు సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సరిహద్దు పోస్టులు, కమ్యూనికేషన్ కేంద్రాలపై అట్గ్రామ్ వద్ద ప్రమాదకరమైన దాడులు ప్రారంభించింది. ముక్తి బాహిని కూడా ఈ సమయంలో జెస్సోర్‌పై దాడిని ప్రారంభించింది. [10] ఇక బహిరంగ సంఘర్షణ అనివార్యమని, తూర్పు పాకిస్తాన్‌ను ఎన్నోరోజులు తాము రక్షించుకోలేమనీ ఆ సమయానికి ఇస్లామాబాద్‌కు స్పష్టంగా తెలిసిపోయింది. [11] ఈ సమయంలో పాకిస్తాన్ సమగ్రతను కాపాడటానికి, "తూర్పు పాకిస్తాన్ రక్షణకు కీలకం పశ్చిమాన ఉంది" అనే అయూబ్ ఖాన్ వ్యూహంతో భారతదేశాన్ని నిలువరించడానికి యాహ్యా ఖాన్ ప్రయత్నించాడు. [12]

పూర్వరంగం

మార్చు

పశ్చిమ రంగం

మార్చు

అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా భారత్‌తో బహిరంగ సంఘర్షణ ఎక్కువ కాలం ఉండదని, తూర్పు పాకిస్థాన్‌ను రక్షించుకోలేమనీ, యుద్ధానంతర చర్చల్లో బేరసారాలకు సాధనంగా సాధ్యమైనంత ఎక్కువ భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడం పైననే దృష్టి కేంద్రీకరించాలనీ ఖాన్ భావించాడు. ఈ మేరకు, భారత భూభాగం లోపలకు దాడి చేయాలనీ, "ఈ దాడికి గరిష్ట మద్దతు ఇవ్వడమే పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్సు (పిఏఎఫ్) ప్రాథమ్యత" అనీ జనరల్ టిక్కా ఖాన్ ప్రతిపాదించాడు. దాడికి సంబంధించిన ప్రారంభ ప్రణాళికల్లో, పిఏఎఫ్ కనీసం తాత్కాలిక వైమానిక ఆధిపత్యం సాధించడం, తద్వారా పాక్ సైనిక దళాలు పశ్చిమ భారతదేశంలో బాగా లోతుగా దాడులు చేసి, భూభాగాన్ని ఆక్రమించుకుని నిలదొక్కుకోవడం ఉన్నాయి. ఖాన్ దళాలకు మద్దతుగా పిఏఎఫ్, డిసెంబరు 3 న సాయంత్రం ముందస్తు దాడులను ప్రారంభించింది. దీంతో అధికారికంగా యుద్ధం మొదలైంది. పశ్చిమ రంగంలో అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న రహీమ్ యార్ ఖాన్ పట్టణం ఖాన్ దళాలకు ఒక కీలకమైన కమ్యూనికేషన్ కేంద్రంగా ఉంది. సింధ్ - పంజాబ్ రైలుమార్గంలో ఉన్న ఈ పట్టణం, ఖాన్ లాజిస్టిక్స్‌లో ఒక బలహీనమైన లింకు. రహీమ్ యార్ ఖాన్ పట్టణం భారత బలగాలకు లొంగిపోతే, సింధ్, పంజాబ్ ల మధ్య రైలు, రోడ్డు మార్గాలు తెగిపోతాయి. కరాచీకి నుంచి ఖాన్‌కు వచ్చే ఇంధనం, మందుగుండు సామాగ్రి సరఫరా తెగిపోతుంది.

12వ భారత విభాగం సరిహద్దు మీదుగా సర్కారీ తాలా గుండా ఇస్లాంగఢ్ వైపు దాడి చేసేందుకూ, తదనంతరం రహీమ్ యార్ ఖాన్‌ను ఆక్రమించడానికీ భారత్ యుద్ధ ప్రణాళికలు వేసి, బాగ్లా గుండా ముందుకు సాగింది. ఇది పంజాబ్‌లో మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్‌ రంగంలో కూడా పాకిస్తాన్ రక్షణ వనరులను అస్థిరపరుస్తుంది. దీంతో షకర్‌ఘర్ సెక్టార్‌లో భారత ప్రణాళికాబద్ధమైన దాడితో అక్కడ చిక్కుకున్న పాకిస్తాన్ దళాలను తుడిచిపెట్టడానికి వీలౌతుంది. [13]

పంజాబ్‌ను కార్యాచరణ కేంద్రంగా భావించిన పాకిస్తాన్‌కు, ఈ ప్రాంతంలో బలమైన నిఘా వ్యవస్థ ఉంది. కిషన్‌గఢ్ ద్వారా రామ్‌గఢ్‌కు దక్షిణంగా ఉన్న డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ వైపు ముందస్తు దాడి చేసి, తమ భూ బలగాలకున్న బలహీనతలను అధిగమించాలని ప్రణాళిక వేసింది. [13] పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు స్థానిక వ్యక్తులుగా నటిస్తూ కార్యకలాపాల ప్రాంతంలోకి చొరబడి సమాచారాన్ని అందించగలిగారు. అయితే, లోంగేవాలా పోస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో ఈ నిఘా వర్గాలు విఫలమయ్యాయి. వాస్తవానికి భారత సరిహద్దు భద్రతా బలగాలకు చేందిన ఈ పోస్టు, ఇప్పుడు పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన ఒక కంపెనీ నియంత్రణలో ఉంది. భారత్‌లో విస్తారమైన భూభాగాలను స్వాధీనం చేసుకునే మార్గంలో లోంగేవాలాను ఒక వ్యూహాత్మక స్థానంగా ఏర్పరుచుకుని పాక్, పశ్చిమ రంగంలో భారతదేశంతో తలపడడానికి కీలకమైన యుద్ధ రంగాన్ని ఏర్పాటు చేసుకుంది.

వ్యూహాత్మక ప్రణాళిక

మార్చు

ఈ ప్రాంతంలో దాడి చేయడం వలన శ్రీ గంగానగర్ ప్రాంతంలో పాకిస్తాన్ 1వ ఆర్మర్డ్ డివిజన్‌కు సహాయపడుతుందనే ఊహ ఆధారంగా పాకిస్తాన్ తన వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించుకుంది. సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున, ఉత్తర-దక్షిణ రహదారి లింక్‌ను రక్షించడం చాలా ముఖ్యమని పాకిస్తాన్ హైకమాండ్ కూడా భావించింది. సంయుక్త దాడి ప్రణాళికపై నిర్ణయం తీసుకున్నారు. దాడిలో రెండు పదాతిదళ బ్రిగేడ్‌లు, రెండు సాయుధ రెజిమెంట్లూ భాగంగా ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా 18వ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. 18వ డివిజన్ యొక్క ఆపరేషన్ ఆర్డర్‌ల ప్రకారం భారత రహదారి వ్యవస్థలోని జంక్షన్ అయిన లోంగేవాలాను స్వాధీనం చేసుకుని, ఒక దృఢమైన స్థావరాన్ని స్థాపించడం, ఒక పదాతి దళం (206వ), సాయుధ రెజిమెంట్ (38వ అశ్విక దళం) లు లోంగేవాలాను దాటి జైసల్మేర్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ ప్రణాళికలో భాగం. [14]

లోంగేవాలా, రామ్‌గఢ్, జైసల్మేర్ లను చేరుకోవాలనేది పాకిస్థాన్ ప్రణాళిక. గూఢచర్యమే లేని భూభాగంపై రాత్రి దాడిని నిర్వహించాలని పిలుపునిచ్చినందున ఈ ప్రణాళిక ప్రారంభం నుండే బలహీనంగా ఉంది. వేగమైన కదలికలకు నేల మద్దతు ఇవ్వదని సాయుధ దళాలకు తెలియదు. యుద్ధం ప్రారంభానికి ముందు ఆధిపత్యం ఉన్నప్పటికీ, వాహనాలు మెత్తటి ఇసుకలో కూరుకుపోవడం వల్ల తెల్లవారి రోజు గడిచే కొద్దీ లోంగేవాలా, పాకిస్తాన్‌కు అతిపెద్ద నష్టాలను మిగిల్చింది.

అనంతర పరిణామాలు

మార్చు

భారతీయులు రక్షణ స్థితిలో ఉన్నందున, వారు పాకిస్థానీలకు భారీ నష్టాలను కలిగించగలిగారు: 200 మంది పాక్ సైనికులు మరణించారు, 36 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. 500 అదనపు వాహనాలను కోల్పోయింది. యుద్ధం ముగింపులో ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషను, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను 18 డివిజన్ కమాండరైన మేజర్ జనరల్ ముస్తఫాను విచారించాలని సిఫార్సు చేసింది. [15]

విజయం సాధించినప్పటికీ, నిఘా, వ్యూహాత్మక వైఫల్యాలు భారత్ వైపునా ఉన్నాయి. పశ్చిమ రంగంలో ఇంత పెద్ద సాయుధ దళాల మోహరింపు గురించి హెచ్చరించడంలో భారత నిఘా విభాగం విఫలమైంది. అంతేకాకుండా, రక్షణ స్థావరంలో భారీగా ఆయుధాలు లేవు. చివరగా, భారత వైమానిక దళం వెంబడించగా పారిపోతున్న పాకిస్తానీ ట్యాంకులను నాశనం చేసి, సాధించిన పైచేయిని బలపరచుకోవడంలో భారత్ విఫలమైంది. అయితే, వారు దాదాపు 36 ట్యాంకులను ధ్వంసం చేశారు లేదా స్వాధీనం చేసుకున్నారు. [16] రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఒక యుద్ధంలో ఒకే వైపు చాలా అసమానంగా జరిగిన పెద్ద ట్యాంకు నష్టాలలో ఇది ఒకటి.

అదే సమయంలో, పాకిస్తానీ దళాలు ఇసుకపై నడవడంలో ఎదుర్కొన్న ఇబ్బంది కారణంగాను, రాత్రిపూట, పౌర్ణమి వెలుతురులో దాడిని నిర్వహించడం, బాగా సన్నద్ధంగా ఉన్న రక్షణ స్థానం నుండి ఎదురైన గట్టి ప్రతిఘటన వలనా స్థావరపు రక్షణ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసినట్లైంది. వాస్తవంగా ఎటువంటి వాయుసేన మద్దతు లేకుండా దాడి చేయడంతో, వారు స్థావరంపై దాడి చేయడానికి చాలా సమయం పట్టింది. భారత సేనలకు ఉన్న వాయుసేన మద్దతును అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. పాకిస్తాన్ యొక్క షెర్మాన్ ట్యాంకులు, T-59/టైప్ 59 చైనీస్ ట్యాంకులు ఇసుకతో కూడిన థార్ ఎడారిలో నెమ్మదిగా నడవడం ఈ దాడి ప్రణాళిక అమలు లోపభూయిష్టంగా ఉండడానికి కారణం కావచ్చని కొంతమంది సైనిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. [17] ఇసుకలో దిగబడిపోయిన పాకిస్తానీ ట్యాంకులు బయటపడే ప్రయత్నంలో ఇంజన్లు వేడెక్కి విఫలమవడంతో వాళ్ళు వాటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎడారి యుద్ధభూమిలో భారత వైమానిక దాడుల నుండి పాక్ ట్యాంకులకు, పదాతిదళానికీ ఎటువంటి వైమానిక మద్దతు లభించలేదు. లోంగేవాలాను పట్టుకోవాలనే పథకం బాగానే ఉన్నప్పటికీ, వాయుసేన మద్దతు లేకపోవడం వల్ల విఫలమైంది.

దస్త్రం:KuldipsinghchandpuriGujjar.jpg
మేజర్ కులదీప్ సింగ్ చాంద్‌పురి, MVC

భారతీయ కంపెనీ కమాండరైన మేజర్. (తరువాత బ్రిగేడియరయ్యాడు) కుల్దీప్ సింగ్ చాంద్‌పురికి భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం మహా వీర చక్ర లభించింది. డిఫెండింగ్ కంపెనీ సభ్యులు, బెటాలియన్ కమాండరుకూ ఇతర పురస్కారాలు లభించాయి. మరోవైపు, పాకిస్థాన్ డివిజనల్ కమాండరును సర్వీసు నుంచి తొలగించారు. అయితే, సాహసోపేతమైన దాడి చేసి, భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తానీ 51 బ్రిగేడ్ కమాండర్‌కు తరువాత పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం సితారా-ఇ-ఇమ్తియాజ్ లభించింది.

బ్రిటిష్ మీడియా లోంగేవాలా రక్షణ గురించి వార్తలు రాసింది. జేమ్స్ హాట్టర్, లోంగేవాలా యుద్ధాన్ని 1971 యుద్ధంలో నిర్ణయాత్మక క్షణంగా వర్ణిస్తూ, లోంగేవాలా వద్ద శత్రువుపై దాడి అనే తన వ్యాసంలో రాసాడు. [16] అదేవిధంగా, బ్రిటీష్ చీఫ్ ఆఫ్ ఇంపీరియల్ జనరల్ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ RM కార్వర్, యుద్ధం ముగిసిన కొన్ని వారాల తర్వాత లోంగేవాలాను సందర్శించి, మేజర్ చాంద్‌పురి నుండి యుద్ధం వివరాలను తెలుసుకున్నాడు. [16]

2008లో, ఈ యుద్ధం భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఆ కాలంలోని కొందరు అధికారులు పోరాట విజయాన్ని వైమానిక దళానికి ఆపాదించారు. [18] [19] దీంతో కులదీప్ సింగ్ చాంద్‌పురి ఒక రూపాయి టోకెన్ అమౌంట్ కోసం దావా వేసాడు. [20]

జనాదరణ పొందిన సంస్కృతిలో

మార్చు

1997 నాటి బాలీవుడ్ చిత్రం బోర్డర్‌లో లోంగేవాలా యుద్ధాన్ని చిత్రీకరించారు. దీనికి JP దత్తా దర్శకత్వం వహించాడు. సన్నీ డియోల్ మేజ్‌అర్ కులదీప్ సింగ్ చాంద్‌పురిగా నటించాడు. [21] భారతీయ వైమానిక దళం నుండి ఎలాంటి సహాయం రాకముందే భారతీయ బలగాలు దారుణమైన స్థితిలో ఉన్నాయని చూపించడంతో ఈ చిత్రంపై విమర్శ వచ్చింది. నాటకీయ ప్రయోజనాల కోసం భారతీయ మరణాలను మరీ ఎక్కువగా చూపించింది. [22]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. p. 1187, IDSA
  2. Lal, Pratap Chandra (1986). My Years with the Iaf. ISBN 978-81-7062-008-2. Retrieved 6 July 2013.
  3. Karl R. DeRouen; Uk Heo (2007). Civil Wars of the World: Major Conflicts Since World War II. ABC-CLIO. pp. 101–. ISBN 978-1-85109-919-1.
  4. DeRouen, Karl R. (2007). Karl R. DeRouen, Uk Heo (ed.). Civil Wars of the World. ABC-CLIO. p. 596. ISBN 978-1851099191.
  5. 5.0 5.1 5.2 Jaques, Tony (2007). Dictionary of Battles and Sieges: A Guide to 8,500 Battles from Antiquity Through the Twenty-First Century. Greenwood. p. 597. ISBN 978-0313335389.
  6. 6.0 6.1 6.2 6.3 Col J Francis (Retd) (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. pp. 93–96. ISBN 978-93-82652-17-5.
  7. "1971 war hero gives hour-by-hour account of the battle of Longewala". Asianet News Network Pvt Ltd. Retrieved 17 August 2020.
  8. "The Tribune – Windows – Featured story". tribuneindia.com. Retrieved 2 August 2016.
  9. 9.0 9.1 "The 1971 Battle of Longewala: A night of confusion, Sam Manekshaw's order, Pakistan's folly". 3 December 2019.
  10. "Pakistan — Yahya Khan and Bangladesh". Library of Congress Country Studies. April 1994. Retrieved 6 April 2009.
  11. Kyle, R.G. (14 March 1964). "The India-Pakistan War of 1971: A Modern War". Archived from the original on 18 April 2009. Retrieved 6 April 2009.
  12. Failure in Command: Lessons from Pakistan's Indian Wars, 1947–1999.
  13. 13.0 13.1 Thakur Ludra, K. S. (13 January 2001). "An assessment of the battle of Longewala". The Tribune. India. p. 1. Retrieved 6 April 2009.
  14. "Correspondence from Lt. Col. ". Archived from the original on 2006-06-22. Retrieved 2022-05-16.
  15. Hamoodur Rehman; Sheikh Anwarul Haq; Tufail Ali Abdul Rehman. Hamoodur Rahman Commission Report (PDF) (Report). Government of Pakistan. pp. 79–80. Archived from the original (PDF) on 4 మార్చి 2012. Retrieved 19 July 2013.
  16. 16.0 16.1 16.2 Hattar, James (16 December 2000). "Taking on the enemy at Longewala". The Tribune. Archived from the original on 22 April 2009. Retrieved 6 April 2009.
  17. "Pakistan Army Order of Battle — Corps Sectors". Retrieved 14 January 2014.
  18. "The truth of courage". tehelka. Archived from the original on 22 October 2014.
  19. "Army lied to the nation Longewala?". Hindustan times. Archived from the original on 4 November 2014.
  20. Sura, Ajay (29 November 2013). "War veteran's book reiterates doubts over Army's role in Longewala battle". The Times of India.
  21. p. 17, Alter
  22. "Border". 1 January 2000. Retrieved 2 August 2016 – via IMDb.