జైసల్మేర్
జైసల్మేర్, దీనికి "ది గోల్డెన్ సిటీ" అనే మారుపేరు ఉంది.ఇది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక నగరం. జైసల్మేర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది రాష్ట్ర రాజధాని జైపూర్ కు పశ్చిమాన 575 కి.మీ. (357 మైళ్లు) దూరంలో ఉంది. ఈ పట్టణం పసుపు రంగుగల ఇసుకరాయి శిఖరంపై ఉంది. పురాతన జైసల్మేర్ కోట ఈ శిఖరం నిర్మించబడింది.ఈ కోటలో రాజభవనం, అనేక అలంకరించబడిన జైన దేవాలయాలు ఉన్నాయి.కోట దిగువన పట్టణంలో అనేక ఇళ్ళు, దేవాలయాలు చక్కగా చెక్కబడిన ఇసుకరాయితో నిర్మించబడ్డాయి.ఈ పట్టణం థార్ ఎడారి నడిబొడ్డున ఉంది.జైసల్మేర్ ఒకప్పుడు జైసల్మేర్ రాజ్యానికి రాజధాని.
జైసల్మేర్ | |
---|---|
జైసల్మేర్ | |
![]() జైసల్మేర్ కోట నుండి జైసల్మేర్ నగర దృశ్యం | |
ముద్దుపేరు(ర్లు): ది గోల్డెన్ సిటీ | |
నిర్దేశాంకాలు: 26°54′47″N 70°54′54″E / 26.913°N 70.915°ECoordinates: 26°54′47″N 70°54′54″E / 26.913°N 70.915°E | |
దేశం | ![]() |
జిల్లా | రాజస్థాన్ |
స్థాపించిన వారు | రావల్ జైసల్ |
ప్రభుత్వం | |
• లోకసభ సభ్యుడు | కైలాష్ చౌదరి |
• శాసనసభ సభ్యుడు | రూపారాం |
విస్తీర్ణం | |
• మొత్తం | 5.1 కి.మీ2 (2.0 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 225 మీ (738 అ.) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 65,471 |
భాషలు | |
• అధికారిక | హిందీ , రాజస్థానీ |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 345 001 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 02992 |
ISO 3166 కోడ్ | RJ-IN |
వాహనాల నమోదు కోడ్ | RJ-15 |
జాలస్థలి | అధికారక వెబ్సైట్ |
UNESCO World Heritage Site | |
Official name | జైసల్మేర్ కోట |
Part of | రాజస్థాన్ రాష్ట్ర కొండ కోటలు |
Criteria | Cultural: (ii)(iii) |
సూచనలు | 247rev-006 |
శాసనం | 2013 (37th సెషన్ ) |
ప్రాంతం | 8 హె. (0.031 చ. మై.) |
Buffer zone | 89 హె. (0.34 చ. మై.) |
పేరు మూలంసవరించు
భట్టి పాలకుడు రావల్ జైసల్ పేరు మీద జైసల్మేర్ పేరు పెట్టిన ఈనగరం 1156 లో స్థాపించబడింది. [1] జైసల్మేర్ అంటే జైసల్ కొండ కోట అనే భావాన్ని తెలుపుతుంది . జైసల్మేర్‌ను కొన్నిసార్లు "భారతదేశ బంగారు నగరం" అని పిలుస్తారు, ఎందుకంటే కోట, దిగువన ఉన్న పట్టణం రెండింటి వాస్తుశిల్పం అంతటా ఉపయోగించిన పసుపురంగుతో ఉన్న ఇసుకరాయి రెండూ ఒక నిర్దిష్ట బంగారు-పసుపు కాంతితో నింపుతుంది.
స్థానంసవరించు
రాజస్థాన్ రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రస్థానం. దేశంలోని ప్రాదేశిక ప్రాంతాల వారీగా 3 వ అతిపెద్ద పట్టణం. పశ్చిమ నైరుతిలో పాకిస్తాన్ సరిహద్దును తాకింది. జైసల్మేర్ జిల్లాకు అనుసంధానించబడిన అంతర్జాతీయ సరిహద్దు పొడవు 464 కి.మీ (288 మైళ్లు) నిడివి ఉంది. ఇది జాతీయ రాజధాని ఢిల్లీ నుండి 790 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భౌగోళికం, వాతావరణంసవరించు
జైసల్మేర్,శుష్క ఎడారి ప్రాంతం.ఉష్ణోగ్రత పరంగా విపరీతమైన వేడి వాతావరణం ఉంటుంది. వేసవికాలానికి, శీతాకాలానికి ఉష్ణోగ్రత పగటి నుండి రాత్రి వరకు చాలా తేడా ఉంటుంది.[2]
జైసల్మేర్‌లో పర్యాటకం ఒక ప్రధాన పరిశ్రమ.భారత ప్రభుత్వం 1955–56లో జైసల్మేర్ ప్రాంతంలో చమురు కోసం విభాగ అన్వేషణను ప్రారంభించింది.[3] భారత చమురు సంస్థ 1988లో జైసల్మేర్ ప్రాంతంలో సహజ వాయువును కనుగొంది.[4]
జైసల్మేర్ నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు సంగీతకారులు,నృత్యకారులు ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలకు పర్యటిస్తారు.మంగనియార్ సంగీతకారులు రాణీ హరీష్,[5] నృత్యాలు,ఎడారి డ్రాగ్ రాణి అనే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి కళాకారులు కొన్ని అంతర్జాతీయ సినిమాల్లో నటించారు.
జైసల్మేర్ ప్రాంతానికి చెందిన అడవి ఒంటెల నుండి తయారు చేయబడిన తోలు, వార్తాహరుల సంచులకు ప్రధాన వనరుగా ఉపయోగిస్తారు.
రవాణాసవరించు
రాజస్థాన్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు,ఇతర, స్వంత బస్సు యజమానులు అందించే బస్సుల ద్వారా జైసల్మేర్ నుండి రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.
జైసల్మేర్‌కు ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో జైసల్మేర్ విమానాశ్రయం ఉంది.విమానాలు ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, సూరత్, జోధ్పూర్ లకు సేవలు అందిస్తున్నాయి.
జైసల్మేర్, జైపూర్ మధ్య జైసల్మేర్ రైల్వే స్టేషన్ నుండి రోజువారీ రైళ్లు నడుస్తాయి.దీని ద్వారా ఢిల్లీ,భారతదేశం అంతటా ఇతర నగరాలకు అనుసంధానించబడి ఉంది.ఈ స్టేషన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే (ఎన్‌డబ్ల్యుఆర్) లోని జోధ్పూర్ (జెయు) విభాగం పరిధిలోకి వస్తుంది.అదనంగా ప్యాలెస్ ఆన్ వీల్స్ అని పిలువబడే లగ్జరీ టూరిస్ట్ రైలు ఉంది.ఇది జైసల్మేర్‌తో సహా రాజస్థాన్‌లోని అన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాలను కలుపుతుంది.
ఆసక్తి ఉన్న ప్రదేశాలుసవరించు
జైసల్మేర్ కోటసవరించు
1156 లో భాటి రాజ్‌పుత్ పాలకుడు జైసల్ నిర్మించిన, జైసల్మేర్ కోట, మేరు కొండపై ఉంది. త్రికూట్ గఢ్ అని పేరు పెట్టబడింది. ఇది అనేక యుద్ధాలకు వేదిక. దీని భారీ ఇసుకరాయి గోడలు పగటిపూట ఒక సింహం రంగుగా గానూ, సూర్యుడు అస్తమించేటప్పుడు తేనెరంగుతో మాయా బంగారంగా కనపడుతుంది.భారతీయ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఒక డిటెక్టివ్ నవల రాశాడు. తరువాత దీనిని ఈ కోటపై ఆధారపడిన సోనార్ కెల్లా (ది గోల్డెన్ ఫోర్ట్రెస్) చిత్రంగా మార్చారు. నగర జనాభాలో నాలుగింట ఒక వంతు ఇప్పటికీ కోట లోపల నివసిస్తున్నారు.కోట లోపల రాజ్ మహల్ (రాయల్ ప్యాలెస్), జైన దేవాలయాలు, లక్ష్మీనాథ్ ఆలయం ప్రధాన ఆకర్షణలు.
జైసల్మేర్ జైన వారసత్వంసవరించు
జైసల్మేర్ నగరం దాని జైన సమాజంతో సుసంపన్నమైంది. ఇది నగరాన్ని ముఖ్యంగా 16 వ తీర్థంకరుడు, శాంతినాథ్, పార్శ్వనాథ్లోని 23 వ తీర్థంకరులకు అంకితం చేసిన అందమైన దేవాలయాలతో అలంకరించింది,
12-15 వ శతాబ్దాలలో నిర్మించిన జైసల్మేర్ కోటలో మొత్తం ఏడు జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో పరస్వనాథ్ ఆలయం అతి పెద్దది. చంద్రప్రభు ఆలయం, రిషబ్‌దేవ్ ఆలయం, శితల్‌నాథ్ ఆలయం, కుంతునాథ్ ఆలయం, శాంతినాథ్ ఆలయాలు మిగిలినవి. మధ్యయుగంలో ప్రధానంగా ఉండే కళ, వాస్తుశిల్పం మొదలగు సున్నితమైన పనులకు పేరుగాంచిన ఈ దేవాలయాలు పసుపు రంగుగల ఇసుకరాయితో నిర్మించబడ్డాయి.వాటిపై క్లిష్టమైన శిల్పకళతో చెక్కబడినవి జైసల్మేర్ భారతదేశంలోని పురాతన గ్రంథాలయాలను కలిగి ఉంది.వీటిలో జైన సంప్రదాయానికి చెందిన అరుదైన చేతివ్రాత గ్రంథాలు, ఇతర కళాఖండాలు అనేకం ఉన్నాయి. జైసల్మేర్ చుట్టూ లోధ్రువా (లోదర్వ), అమర్‌సాగర్, బ్రహ్మసర్ పోఖ్రాన్ వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ప్రదర్శనశాలలుసవరించు
- ఎడారి సంస్కృతి కేంద్రం, ప్రదర్శనశాల
- జైసల్మేర్ ఫోక్లోర్ ప్రదర్శనశాల
- ప్రభుత్వ ప్రదర్శనశాల
- జైసల్మేర్ కోట రాజభవనం
- జైసల్మేర్ యుద్ద ప్రదర్శనశాల
- అకల్ ఫాసిల్ ఉధ్యానవనం
- కాక్టస్ ఉద్యానవనం
- టానోట్ ప్రదర్శనశాల
ఇతరాలుసవరించు
గాడ్సిసార్ సరస్సు - 1367 లో రావల్ గాడ్సి సింగ్ చేత తవ్వబడింది.దీని చుట్టూ చిన్న దేవాలయాలు, ఇతర పుణ్యక్షేత్రాలతో సుందరమైన అమర్ సాగర్ వర్షపు నీటి సరస్సు ఉన్నాయి.ఈ సరస్సు జైసల్మేర్ ప్రధాన నీటి వనరుగా ఉపయోగించబడుతుంది.వ్యవసాయానికి నీటి కొరత ఏర్పడుచున్నందున సరస్సు ఎండిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.[6]
ఎడారి పండుగసవరించు
రాజస్థాన్ ప్రజలు అత్యంత ఇష్టంగా ఎదురుచూసే జైసల్మేర్ ఎడారి ఉత్సవం ముఖ్యమైన సాంస్కృతిక, రంగుల కార్యక్రమం. ఒంటె రేసులు, టర్బన్-టైయింగ్, మిస్టర్ ఎడారి పోటీలు నిర్వహించబడతాయి.ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఉత్సవంలో రాజస్థానీ జానపద పాటల,నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.జైసల్మేర్ ఎడారి పండుగ వేడుకల్లో మరికొన్ని ప్రధాన ఆకర్షణలు గైర్,ఫైర్ డాన్సర్లు,కల్బెలియా నృత్యాలు వంటి ప్రదర్శనలు.ఈ ఉత్సవం విదేశీ పర్యాటకులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇది కూడ చూడుసవరించు
సాంస్కృతిక గ్యాలరీసవరించు
- సాంస్కృతిక చిత్రమాలిక
- Gadsisar,jaisalmer,scene of documentary film soul of jaisalmer.jpg
సోల్ ఆఫ్ జైసల్మేర్ (2016) అనే డాక్యుమెంటరీ చిత్రం పూర్తి షాట్
- Side of gadsisar,scene of documentary film soul of jaisalmer.jpg
సోల్ ఆఫ్ జైసల్మేర్ (2016) అనే డాక్యుమెంటరీ చిత్రం షాట్
మూలాలుసవరించు
- ↑ Balfour, Edward (1885). The encyclopædia of India and of Eastern and Southern Asia. Original from Oxford University: B. Quaritch. p. 406.
- ↑ "India Meteorological Department – Weather Information for Jaisalmer". Worldweather.wmo.int. Retrieved 12 October 2012.
- ↑ "2nd Five Year Plan". Archived from the original on 14 April 2006. Retrieved 30 March 2006.
- ↑ "Rajasthan Exploration Project (RP)". Archived from the original on 30 June 2006. Retrieved 30 January 2021.
- ↑ Sandip Roy, Special to The Chronicle (5 July 2008). "Queen H A R I S H". Queen-harish.blogspot.com. Retrieved 19 August 2012.
- ↑ "Jaisalmer, Rajasthan - Don't Complain Travel". Dont-complain.com. 6 March 2014. Retrieved 15 September 2018.