వడ్లమూడి గోపాలకృష్ణయ్య

సాహితీ పుంభావ సరస్వతిగా, వాఙ్మయ మహాధ్యక్ష అనే బిరుదుతో అనేక శాస్త్రాలలో నిష్ణాతుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పరిశోధకుడిగా సుపరిచితుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య.[1]

జీవిత విశేషాలుసవరించు

కృషాజిల్లా కౌతవరం గ్రామంలో రంగారావు, సరస్వతమ్మ దంపతులకు 1928 అక్టోబరు 24న జన్మించిన వడ్లమూడి సంస్కతంలో భాషా ప్రవీణ వరకు చదువుకున్నారు. తెలుగు, సంస్కత భాషలలో లోతైన పరిశోధనలు చేసి జనరంజక రచనలు అందించారు. సంస్కతం, ఆంద్రం, ఖగోళం, జ్యోతిష్యం, వాస్తు, శిల్ప, నాట్య వేదం, జర్నలిజం, చంధస్సు, అలంకారం, ఆయుర్వేదం, మంత్ర శాస్తాలలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వడ్ల మూడి 24 శాస్తాలలో చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారాన్ని ప్రదానం చేసింది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. గాంధీ శతకం, మానవులు, జయదేవకృతి, ప్రజా నీతి గేయాలు, అమ్మ, వ్యవహార భాష లిపి ధ్వని, వ్యవహారిక భాషా వ్యాకరణం, మనిషి, మహర్షి, ఆయుర్వేదం, బాలన్యాయదర్శనం, జానుతె నుగు, మార్గాదేశి, ఆరవీటి వంశ చరిత్ర, మహాయోగం, కృష్ణ శతకం వంటి కావ్యాలతోపాటు తీరని రుణం, రాజహంస నాటికలను రచించారు. వేదాస్ క్రియేషన్ ఆంగ్ల గ్రంథంలో వేదాల సారాంశాన్ని సోదాహరణంగా వివరిం చారు. మహాయోగం, కృష్ణశతశతి కావ్యాలను 10వేలకు పైగా పద్యాలతో రచించారు. గిడుగు, గాడిచర్ల వంటి సాహితీమూర్తులు వడ్లమూడిని వాజ్మయ మహాధ్యక్ష బిరుదుతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవ స్థానం సమూల శ్రీమదాంధ్ర రుగ్వేద సంహిత రచనకు వడ్లమూడి సంపాదకత్వం వహించారు. పొన్నూరు సంస్కత కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. రాష్ర దేవాదాయ శాఖ ప్రచు రించిన ఆరాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పత్రికకు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాచ్చలిఖిత భాండాగారానికి వ్యవస్థా పక డైరెక్టరుగా వ్యవహరించారు.[2].[3].[4]

మూలాలుసవరించు

  1. http://epaper.andhrajyothy.com/809912/Guntur/15.05.2016#page/2/1
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ధ పరిశోధనాత్మక గ్రంథం 2990100051640 1988 ధ్వని-లిపి-పరిణామం [9] వడ్లమూడి గోపాలకృష్ణయ్య భాష, పరిశోధనాత్మక గ్రంథం 2030020025252 1955 ధనుర్దాసుడు [10] గుదిమెళ్ళ 67 KB (0 పదాలు) - 02:21, 7 సెప్టెంబరు 2015
  3. తెలుగు వ్యుత్పత్తి కోశం రవీంద్ర సాహిత్యం, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వాజ్మయమహాధ్యక్ష డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, కళాప్రపూర్ణ, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ 6 KB (249 పదాలు) - 06:15, 16 అక్టోబరు 2014
  4. http://telugu.oneindia.com/sahiti/essay/2005/vadlamudi.html