వనారస కమలమ్మ రంగస్థల నటి.

వనారస కమలమ్మ
జననంసింధూరి కమలమ్మ
కమలాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
తండ్రిసింధూరి వెంకటప్పయ్య
తల్లినర్సమ్మ

జననం మార్చు

కమలమ్మ, శ్రీమతి సింధూరి నర్సమ్మ, సింధూరి వెంకటప్పయ్య దంపతులకు కమలాపురంలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం మార్చు

నాలుగో ఏట బాలనటిగా రంగస్థలంలోకి ప్రవేశించింది. అనసూయ నాటకంలో (అనసూయ, లక్ష్మి, మన్మథుడు, గంగ, సరస్వతి), శ్రీ కృష్ణలీలలు నాటకంలో (నారద, దేవకి, యశోద), హరిశ్చంద్రలో (చంద్రమతి), మాయాబజార్ లో (సుభధ్ర, రేవతి), సావిత్రిలో (మాళవి, సావిత్రి, సఖి, నారద), గుణసుందరిలో (దాది), కాంతామతిలో (కాంచనమాల, కాంతామతి), గంగావతరణంలో (మోహిని), కురుక్షేత్రంలో (అశ్వథ్థామ, సత్యభామ, ద్రౌపది), ప్రమీలార్జునీయంలో (మలయవతి, చారుమతి), పాతాళ భైరవిలో (రాణి), బొబ్బిలియుద్ధంలో (సూత్రధారుడు, మల్లమదేవి), బాలనాగమ్మలో (భూలక్ష్మి, మాలనాగమ్మ, సంగు), లవకుశలో (సీత), దేవదాసులో (కనకతీర, కమల, తారా, కనకసేనుడు), లంకాదహనంలో (సీత), ప్రహ్లదలో (లీలావతి), శ్రీ కృష్ణతులాభారంలో (రుక్మిణి), చింతామణిలో (రాధ, చిత్ర, చింతామణి), రామాంజనేయ యుద్ధంలో (శాంతిమతి), గయోపాఖ్యానంలో(సుభద్ర, చిత్రలేఖ), సక్కుబాయిలో (రాధ), బ్రహ్మంగారి చరిత్రలో (అచ్చమాంబ, గోవిందమ్మ, వీరపావులాంబ), రంగూన్ రౌడిలో (అన్నపూర్ణ) తదితర పాత్రలో నటించింది.

మూలాలు మార్చు

  • వనారస కమలమ్మ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011.