వర్గం చర్చ:భారతదేశం లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు

తాజా వ్యాఖ్య: పేరు మార్పు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

పేరు మార్పు మార్చు

 Y సహాయం అందించబడింది

వర్గాన్ని వర్గం:భారత సాంకేతిక సంస్థలు అని పేరు మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ వర్గంలో భారతదేశంలో ప్రారంభించబడిన సాఫ్ట్ వేర్ కంపెనీలను తీసుకురావాలనేది నా లక్ష్యం. మిగతా సభ్యుల అభిప్రాయం, సహాయం కోరుతున్నాను. - రవిచంద్ర (చర్చ) 07:58, 11 మార్చి 2021 (UTC)Reply

ప్రతిపాదించిన వర్గం అచ్చ తెలుగులో సింపుల్ గా బాగుంది. అయితే వర్గం:భారతదేశం లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు అనే వర్గం తొలగించకుండా మూస:Category redirect సాప్ట్ వర్గంగా దారిమార్పుచేయాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 08:20, 11 మార్చి 2021 (UTC)Reply
రామారావు గారూ, నేను కూడా ఇప్పుడున్న వర్గం నుంచి కొత్త పేరుకు దారిమార్పు ఉండవచ్చని అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 08:30, 11 మార్చి 2021 (UTC)Reply
రవిచంద్ర, యర్రా రామారావు గార్లకు, ఆంగ్లవికీలో సాఫ్ట్ దారిమార్పు వాడుకకు కారణం, అటువంటి వర్గాలలో చేరిన వ్యాసాలు బాట్ ద్వారా దారిమార్పు లక్ష్య వర్గానికి చేర్చుతున్నారు. తెవికీలో మానవీయంగానే ఆ పని జరుగుతున్నదని నేను గమనించిన చర్చలద్వారా తెలిసింది. హాట్ కేట్ ద్వారా వర్గాలను చేర్చేటప్పుడు తొలి అక్షరాలు టైప్ చేయగానే ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే వర్గాలు కనబడతాయి. అటువంటప్పడు ఈ సాఫ్ట్ దారిమార్పులు వలన తొలి అక్షరాలు ఒకటే గల వర్గాలకు ఉపయోగం లేదు అని నా అభిప్రాయం. నేరుగా సరియైన వర్గంలోకి వ్యాసాన్ని చేర్చి ఈ వర్గాన్ని తొలగించడమే మంచిది. --అర్జున (చర్చ) 22:22, 11 మార్చి 2021 (UTC)Reply
పేరు మార్పు ఎందుకు చెయ్యాలో అర్థం కాలేదు.
  1. రెండు పేర్లూ ఒకటే అయితే, ఇప్పుడున్న పేరే సరైనది. "సాంకేతిక సంస్థలు" అనే పేరు చదివితే అదేంటో ఠక్కున వెలగడం లేదు. "టెక్నాలజీ" అనే పేరును మీరు సూచించిన అర్థంలో ఇంగ్లీషులో వాడుతున్నప్పటికీ, సాంకేతిక సంస్థలు అనే పదానికి ఆ అర్థం స్ఫురించడం లేదు. ఈ సందర్భంలో సాఫ్ట్‌వేరు సంస్థలు అనే పేరే సరిపోతోందని నా అభిప్రాయం.
  2. ఒకవేళ ఈ రెండూ వేరువేరు అయితే, రెండు వర్గాలూ ఉండాల్సిందే, ఒకదానికొకటి దారిమార్పుగా ఉండజాలవు.
ఈ వర్గం పేరు బానే ఉందని నాకు తోస్తోంది. అయితే...
నిన్న ఈ చర్చ చూసినపుడు, నా అభిప్రాయం రేపు రాద్దాంలెమ్మనుకున్నాను. చర్చలో వచ్చిన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయం ఉన్నపుడు దాన్ని వీలైనంత త్వరగా రాసెయ్యాలని నేను భావిస్తాను. అది ఇక్కడ పాటించలేకపోయాను. దీనిపై చర్య తీసుకునే లోపు నా అభిప్రాయం చెప్పలేకపోయాను, మన్నించండి. __చదువరి (చర్చరచనలు) 02:00, 12 మార్చి 2021 (UTC)Reply
రవిచంద్ర గారూ , చదువరి గారి అభిప్రాయం తరువాత మరింత లోతుగా పరిశీలిస్తే software అనే పదానికి నిఘంటుశోధనలో మృదుసామగ్రి అనే అర్థం సూచిస్తుంది.సాంకేతిక అనే పదం software కు ప్రత్యామ్నాయం కాదని క్లియర్ గా అర్థమౌతుంది. నేను కేవలం వర్గం తెలుగులోకి మారుతున్నదే ఆలోచించానుకానీ, అంతలోతుగా అర్థం పరిశీలించలేదు.పాత వర్గం సాగించటానికి నాకేమీ అభ్యంతరంలేదు.ఈ చర్చలో మరింత లోతుగా పరిశీలించకుండా నా అభిప్రాయం తొందరపడి వెల్లడించినందుకు క్షమాపణలు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:16, 12 మార్చి 2021 (UTC)Reply
భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ సంస్థలు, భారతదేశం లోని సాంకెతిక సంస్థలు అనే వర్గాలు వేర్వేరుగా ఉండాలని నా అభిప్రాయం. ఆంగ్లంలో కూడా Software companies of India, Technology companies of India అనే రెండు వర్గాలున్నాయి. పరిశీలించగలరు.-- K.Venkataramana -- 04:18, 12 మార్చి 2021 (UTC)Reply
ముందుగా వెంకటరమణ గారు చెప్పినట్లు సాంకేతిక సంస్థలు/టెక్నాలజీ సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థలకు వేర్వేరు వర్గాలు ఉంటే బాగుంటుందని నాకూ అనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ సంస్థల వర్గం సాంకేతిక సంస్థలకు ఉపవర్గంగా ఉండాలి. ఎందుకంటే సాంకేతికత అంటే ఏదయినా (సాఫ్ట్‌వేర్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇలా...) కావచ్చు. టెక్నాలజీ అనే మాటకు సాంకేతికత అనే పదాన్ని మాధ్యమాల్లో విస్తృతంగా వాడటం గమనించాను కాబట్టి నాకు వ్యక్తిగతంగా సాంకేతిక సంస్థలు అని పేరు పెట్టాలి అని ఉన్నప్పటికీ, అది సముదాయం నిర్ణయిస్తే బాగుంటుంది. కాబట్టి ఓటింగ్ పెడదమా? రవిచంద్ర (చర్చ) 07:18, 12 మార్చి 2021 (UTC)Reply
నా అభిప్రాయం ఇది:
వర్గం:భారతీయ సంస్థలు: భారత దేశానికి చెందిన సంస్థలు మాత్రమే ఈ వర్గం లోకి వస్తాయి. ఎమ్మెన్సీలైతే ఇండియన్ ఎమ్మెన్సీలు వస్తాయి, ఫారిన్ ఎమ్మెన్సీలు ఇందు లోకి రావు. (ఉదా: ఇన్ఫోసిస్ ఈ వర్గం లోకి వస్తుంది, కాగ్నిజాంట్ రాదు)
వర్గం:భారతదేశం లోని సంస్థలు: భారత దేశంలో పనిచేస్తున్న సంస్థలు - ఇండియన్ ఎమ్మెన్సీలైనా, ఫారిన్ ఎమ్మెన్సీలైనా- అన్నీ ఇందు లోకి వస్తాయి. (ఉదా: ఇన్ఫోసిస్, కాగ్నిజాంట్ లు రెండూ ఈ వర్గం లోకి వస్తాయి)
ఆ వర్గ వృక్షం కింది విధంగా ఉంటుందని నా భావన.
పై వర్గ వృక్షంలో ఇంకా చేర్పులుంటాయి. నేను సూచనామాత్రం గానే ఇచ్చాను, జాబితా మొత్తం ఇవ్వలేదు. ఆయా వర్గాల్లో "టెక్నాలజీ" బదులు "సాంకేతిక" అని పెట్టి చూడండి. బానే ఉందనిపిస్తే అలాగే కానిచ్చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 07:16, 15 మార్చి 2021 (UTC)Reply
@రవిచంద్ర: మీకు సహాయం లభించిందని భావిస్తే "సహాయం మూస" ను తొలగించండి.-- K.Venkataramana -- 13:16, 3 ఏప్రిల్ 2021 (UTC)Reply
@K.Venkataramana: గారూ, పై అభిప్రాయాలకు పరిగణనలోకి తీసుకుని ఈ వర్గాలను పునవ్యవస్థీకరిస్తాను. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 05:26, 5 ఏప్రిల్ 2021 (UTC)Reply
Return to "భారతదేశం లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు" page.