వల్లభనేని బాలశౌరి
వల్లభనేని బాలశౌరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.
వల్లభనేని బాలశౌరి | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 నుండి ప్రస్తుతం | |||
ముందు | కొనకళ్ళ నారాయణరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | మచిలీపట్నం | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | ||
నియోజకవర్గం | తెనాలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోర్జంపాడు, మాచవరం మండలం , గుంటూరు జిల్లా | 1968 సెప్టెంబరు 18||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జోజయ్య నాయుడు , తమసమ్మ | ||
జీవిత భాగస్వామి | భానుమతి | ||
సంతానం | వల్లభనేని అనుదీప్, వల్లభనేని అరుణ్ , వల్లభనేని అఖిల్ |
జననం, విద్యాభాస్యం
మార్చువల్లభనేని బాలశౌరి 1968 సెప్టెంబరు 18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మాచవరం మండలం, మోర్జంపాడు గ్రామంలో జోజయ్య నాయుడు, తమసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.[1]
రాజకీయ జీవితం
మార్చువల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తెనాలి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి 2013 అక్టోబరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, [2] 2014లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.
వల్లభనేని బాలశౌరి 2024 జనవరి 13న వైసీపీకి రాజీనామా చేశాడు.[4][5] ఆయన ఫిబ్రవరి 4న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు.[6] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి సింహాద్రి చంద్ర శేఖర్ రావుపై 223179 ఓట్ల తేడాతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[7]
పోటీ చేసిన స్థానాలు
మార్చు- తెనాలి లోక్‌సభ నియోజకవర్గం 2004 గెలుపు
- నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం 2009 ఓటమి
- గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఓటమి
- మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం 2019 గెలుపు
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
- ↑ Sakshi (13 October 2013). "వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
- ↑ Sakshi (2019). "Machilipatnam Constituency Winner List in AP Elections 2019 | Machilipatnam Constituency Lok Sabha Election Results". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
- ↑ Namaste Telangana (13 January 2024). "ఏపీలో వైసీపీకి మరో షాక్.. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి రాజీనామా". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Eenadu (13 January 2024). "వైకాపాకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
- ↑ 10TV Telugu (4 February 2024). "పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి" (in Telugu). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Machilipatnam". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
http://164.100.47.194/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4021