మోర్జంపాడు

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచవరం మండల కుగ్రామం

మోర్జంపాడు, పల్నాడు జిల్లా మాచవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మోర్జంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మోర్జంపాడు is located in Andhra Pradesh
మోర్జంపాడు
మోర్జంపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°32′28″N 79°54′14″E / 16.541230°N 79.903877°E / 16.541230; 79.903877
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522413
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం

మార్చు

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ అవరణలో పోతురాజుస్వామివారి విగ్రహన్ని ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తాటాకు పందిరిలో హోమం చేసారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నదానం నిర్వహంచారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని, 2016, ఫిబ్రవరి-16వ తేదీ మంగళవారంనాడు గ్రామములో నిర్వహించిన పౌంజసేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి, ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఈ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పొంజసేవ కార్యక్రమంలో పాటకచేరీ పెద్ద ఆకర్షణగా మారినది.

శ్రీ బుగ్గ మల్లేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో 2016, మార్చి-3వ తేదీన్ గురువారంఆడు భ్రమరాంబా అమ్మవారు, రామచంద్రస్వామి, షణ్ముఖ నాగసుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహ, సూర్యనారాయణస్వామివారల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు