వల్లూరి సీతారామారావు
వల్లూరి సీతారామారావు (జూన్ 25, 1924 - జనవరి 23, 2019)[2] ఒక ఇంజనీర్, శాస్త్రవేత్త. లోహాల ఫెటీగ్‌పై చేసిన కృషికి ప్రసిద్ది చెందాడు. ఆయన 1924 లో ఏలూరు లో జన్మించారు. తండ్రి వైద్య వృత్తిలో ఉండేవాడు.[3]
వల్లూరి సీతారామారావు | |
---|---|
జననం | ఏలూరు, మద్రాసు ప్రెసిడెన్సీ | 1924 జూన్ 25
మరణం | 2019 జనవరి 23 బెంగళూరు | (వయసు 94)
జాతీయత | భారతీయుడు |
రంగములు |
|
చదువుకున్న సంస్థలు |
జీవిత విశేషాలు
మార్చుఅతను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1942 లో అప్పటి ఆచార్యుడూ, ఆ విశ్వవిద్యాలయ కులపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరి విద్యాబుద్దులు చూసి, బి.ఎస్.సి ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశానికి సహాయం చేశాడు. 1946 నుంచి 1949 వరకు ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ అఫ్ సైన్స్‌లో తన పరిశోధనలు చేశాడు.
అతను ఎర్నెస్ట్ సెచ్లర్[4] ఆధ్వర్యంలో 1954 లో కాల్‍టెక్ లో డాక్టరేట్ పూర్తి చేశాడు. తరువాత తన పరిశోధనా కృషిని కొనసాగించాడు. 1963 లో, అతను జార్జ్ బోక్రాత్, జేమ్స్ గ్లాస్కోతో కలిసి లోహాలలో పగుళ్ళ విస్తరణకూ, ఫెటీగ్‌కూ మధ్య సంబంధం గురించి తయారుచేసిన తన పరిశోధనాపత్రానికి గాను రైట్ బ్రదర్స్ పతకాన్ని గెలుచుకున్నాడు.[5] తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి మద్రాసులోని ఇండియన్ ఇనిసటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క అప్లైడ్ మెకానిక్స్ విభాగంలో చేరాడు, అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా, అత్యుత్తమ పరిశోధకుడిగా లోహపు సాంద్రత రంగంలో పనిచేసాడు. బెంగళూరులోని సి.ఎస్.ఐ.ఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరక్టర్ గా డాక్టర్. పి. నీలకంఠన్ తరువాత, పదవీ భాద్యతలు స్వీకరించాడు. దీనికి ఇంతకు ముందుగా నేషనల్ ఏరొనాటికల్ లాబోరేటరీ గా ఉండేది. 19 సంవత్సరాల తన పదవీకాలంలో, అతను NAL ను ఇండియన్ ఏరోనాటిక్స్లో ఒక అతిముఖ్యమైన శక్తిగా మార్చాడు. సి.ఎస్.ఐ.ఆర్ లో కొత్త నియామకాలు, అంచనా పథకాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. వల్లూరి / వరదరాజన్ కమిటీ [6] 1981 సంవత్సరంలో సిఎస్ఐఆర్ ప్రయోగశాలలలో నియామకం, అంచనా యొక్క కొత్త విధానాన్ని సిఫారసు చేసింది. భారతదేశంలోని అధునాతన శాస్త్రీయ సంస్థల నుండి ప్రకాశవంతమైన శాస్త్రీయ సిబ్బందిని తమ ఉద్యోగాలు వదల కుండా దారితీసే అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటిగా విస్తృతంగా గుర్తించబడింది.
తను అమెరికాలో కాల్‍టెక్ లో పనిచేస్తున్న సమయం లొ వారికి సతీశ్ ధావన్ సతీష్ ధావన్ తో పాటూ ఇతర అంతరిక్ష పరిశొధకులు కారంచేటి కృష్ణమూర్తి లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అతను 1980 లలో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సిఎ) కార్యక్రమ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాడు. 1985 లో ఎల్సిఎ రూపకల్పన, అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ అయిన బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్‍మెంట్ ఏజెన్సీకి మొదటి డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు.
డాక్టర్ ఎస్.ఆర్. వల్లూరి ఐఐఎస్సి వాల్ ఆఫ్ ఫేం.[7] భారత ప్రభుత్వం పద్మశ్రీ, వాస్విక్ పారిశ్రామిక పరిశోధన అవార్డు (1976) పురస్కారం పొందారు.. [8] అతను 1976 లో ఐఐఎస్సి పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా,[9] 1971 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఫెలోగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ "Remembering S R Valluri: Titan of Indian Aeronautics". Vayu Aerospace and Defence Review (in English). 2019-04-05. Retrieved 2022-10-15.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "A tribute to Dr S R Valluri, former Director of CSIR-NAL and visionary aero-scientist. - CSIR - NAL". www.nal.res.in. Retrieved 17 February 2019.
- ↑ "Remembering SR Valluri – Connect with IISc" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-08-17.
- ↑ Valluri, S.R. (1954) Some studies in the fundamental parameters of fatigue, PhD dissertation.
- ↑ Valluri, S.R., Glassco, J.B., and Bockrath, G.E. (1963) Further Considerations of a Theory of Crack Propagation in Metal Fatigue, SAE Technical Paper 630386, doi:10.4271/630386.
- ↑ "CSIR -New recruitment and assessment scheme" (PDF).
- ↑ "IISc Wall of fame-1986". Archived from the original on 2021-07-21. Retrieved 2021-07-21.
- ↑ "Vasvik award". Archived from the original on 2021-07-15. Retrieved 2021-07-21.
- ↑ "IISc Alumni Association". Archived from the original on 2020-02-18. Retrieved 2021-07-21.
వనరులు
మార్చు- https://connect.iisc.ac.in/2019/03/remembering-sr-valluri/
- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వద్ద డైరెక్టరీ పేజీ
- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుండి సీతారామ్ వల్లూరి గౌరవ ప్రస్తావన