వసంత గీతం 1984 లో వచ్చిన తెలుగు చిత్రం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాధ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2] ఈ చిత్రం ఇదే దర్శకుడి కన్నడ చిత్రం శ్రావణ బంతుకు రీమేక్.

వసంత గీతం
(1984 తెలుగు సినిమా)
Vasantha Geetam.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం భీమవరపు బుచ్చిరెడ్డి
కథ సింగీతం శ్రీనివాసరావు
చిత్రానువాదం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
రాధ,
పండరీబాయి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం పి.ఎస్.సెల్వరాజ్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ క్రియెషన్స్
విడుదల తేదీ ఆగష్టు 24, 1984
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

కుమార్ (అక్కినేని నాగేశ్వరరావు) ఒక ప్రసిద్ధ గాయకుడు, ఒకసారి తన సంగీత పర్యటనలో, ఒక అంతుబట్టని అందమైన అమ్మాయి అతన్ని ఛాయాచిత్రం రూపంలో వెంబడిస్తుంది. ఆ తరువాత, అతను ఇంటికి తిరిగి వస్తాడు. కుమార్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి పరబ్రహ్మ శాస్త్రి (గుమ్మడి) ఆచారాలు, నమ్మకాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఒక రాత్రి కుమార్‌కు ఒక కల వస్తుంది, అందులో అతను ఒక పురాతన ఆలయం కనిపిస్తుంది. మరుసటి రోజు అది శివపురం ఆలయం అని తెలిసి అతడు ఆశ్చర్యపోతాడు. తన మనస్సు ఆ వైపుకు లాగడంతో అతను శివపురం బయలుదేరుతాడు. దారిలో, అతనికి ఒక వింత వ్యక్తి వర్మ (నాగేష్) తో పరిచయమవుతుంది. కుమార్ తనకు ముందే తెలిసినట్లు మాత్లాడతాడు. కుమార్ ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి లోకి వెళ్తాడు.

వర్మ అతన్ని ఆలయానికి తీసుకువెళతాడు, అక్కడ అతనికి పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయి. వర్మ తమ గతాన్ని కుమార్‌కు వివరించడం ప్రారంభిస్తాడు. వాస్తవానికి, వర్మ కుమార్ లు గత జీవితంలో మంచి స్నేహితులు, వర్మ జమీందారు కుమారుడు, కుమార్ అనాథ. వారు సాధారణ స్నేహానికి మించిన బంధాన్ని పంచుకుంటారు. కుమార్ గొప్ప కవి, అతడి రచనలను వర్మ ప్రచురించాలనుకుంటాడు. అతను మాధవి (రాధా) అనే అందమైన దేవదాసి నృత్య కార్యక్రమాన్ని చూస్తాడు. వర్మ ఆమెను ఇష్టపడతాడు. ఆమెకు కుమార్ రాసిన కవిత్వం చాలా ఇష్టం. కాబట్టి, వర్మ అ కవిత్వం రాసింది తానేనని అబద్ధం చెబుతాడు. కుమార్ & మాధవి ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించినప్పుడు, వారి ప్రేమ వికసించినప్పుడు మాధవి నిజం తెలుసుకుంటుంది. ఇంతలో, వర్మ తన తల్లి మందాకిని (ఝాన్సీ) ను ఒప్పించి మాధవితో పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాడు. పెళ్ళి సమయంలో, మాధవి తప్పించుకుంటుంది. కుమార్, మాధవి పెళ్ళి చేసుకుంటారని గ్రహించిన వర్మ తన గూండాలను పంపించి వారిని చంపేయమంటాడు. ఆ గూండాలు కుమార్, మాధవిలను తీవ్రంగా కొడతారు. వర్మకు జ్ఞానోదయమయ్యే సరికి ఆలస్యమౌతుంది. వాళ్ళిద్దరూ అతడి ఒడిలో మరణిస్తారు. బాధపడి, వర్మ ఆత్మహత్య చేసుకుంటాడు. అతని ఆత్మ ఇంకా తిరుగుతూ ఉంటుంది. అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప అతను విముక్తి పొందడు.

ప్రస్తుతం వర్మ, కుమార్ మాధవి లను తిరిగి కలపాలని కోరుకుంటాడు. మాధవి ఒక క్రైస్తవ కుటుంబంలో మేరీగా పునర్జన్మ పొందిందని కుమార్కు చెబుతాడు. కుమార్, వర్మ సహాయంతో ఒక నాటకం ఆడి, మేరీ తనను ప్రేమించేలా చేసుకుంటాడు. ఆశ్చర్యకరంగా, మేరీ కుమార్ మేనత్త లక్ష్మి (అతిలి లక్ష్మి) కుమార్తె అని తెలుసుకుంటాడు. ఆమె జోసెఫ్ (కాంతారావు) అనే క్రిస్టియన్ ను పెళ్ళి చేసుకున్నందుకు కుటుంబం నుండి వెళ్ళగొడతారు. కుటుంబ వివాదాల కారణంగా, జోపేష్ & పరబ్రహ్మ శాస్త్రి ఇద్దరూ ఈ పెళ్ళికి అంగీకరించరు. ఈ పరిస్థితిలో, వర్మ, కుమార్ మళ్ళీ మేరీతో పాటు మరో నాటకం ఆడి, వారి తల్లిదండ్రులు తమ తప్పును గ్రహించేలా చేస్తారు. చివరగా, కుమార్, మేరీల పెళ్ళితో ఈ చిత్రం ముగుస్తుంది. వర్మ ఆత్మ కొత్తగా పెళ్ళైన జంటను ఆశీర్వదిస్తుంది.

నటీనటులుసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

ఎస్. పాట పేరు సాహిత్యం సింగర్స్ పొడవు
1 "ఈనాటి పాటా" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 3:58
2 "రాడేలనే" Rajasri ఎస్.జానకి 3:42
3 "ఊర్వశివో" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, ఎస్. జానకి 3:56
4 "వసంతాలు విరిసే వేళా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్. జానకి 3:37
5 "బృందావనిలో సంధ్యారాగం" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్. జానకి 3:54
6 "మదురమే జీవన సంగీతము" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:35

మూలాలుసవరించు

  1. "Vasantha Geetam (Cast & Crew)". Know Your Films.
  2. "Vasantha Geetam (Review)". IMDb. Archived from the original on 2017-02-02. Retrieved 2020-08-12.
"https://te.wikipedia.org/w/index.php?title=వసంత_గీతం&oldid=3558952" నుండి వెలికితీశారు