స్వాగతం మార్చు

Saivardhangoud12 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Saivardhangoud12 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 02:00, 23 ఫిబ్రవరి 2023 (UTC)Reply

గ్రామ వ్యాసాలలో మీ సవరణలు మార్చు

మీరు వికీపీడియాలో చేరి ఆసక్తితో గ్రామ వ్యాసాలలో సవరణలు చేపడుతున్నందుకు ధన్యవాదాలు.కానీ మీరు రెవెన్యూ గ్రామాలను పట్టణం అని సమాచారపెట్టెలో, వ్యాస పరిచయ విషయ సంగ్రహంలో మార్చుచున్నారు. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, గ్రామం, పట్టణం అనే వాటికి నిర్వచనాలు ఉన్నాయి.మీరు రెవెన్యూ లెక్కలలో రెవెన్యూ గ్రామంగా ఉండి, అది పురపాలక సంఘ ప్రధాన కేంద్రం కాకపోతే అది పట్టణ వాతావరణం కలిగిఉన్ననూ దానిని రెవెన్యూ గ్రామం గానే పరిగణించాలి.అందువలన మీరు పురపాలక సంఘం ప్రధాన కేంద్రం అయితేనే దానిని పట్టణంగా మార్చగలరు.గ్రామ విషయాలలో మీకు ఏదైనా సందేహం వస్తే నా చర్చాపేజీలో ఇప్పుడు మీకు రాసిన విధంగా మీరు రాసి తెలుసుకోవచ్చు.ధన్యవాదాలు.మీరు ధైర్యంగా వికీపీడియాలో సవరణలు చేపట్టండి.ఏమైనా తప్పులు జరిగితే ఇతర వికీపీడియన్లు సవరించగలరు.అయితే మీరు చేసినవాటిని అలా ఎందుకు సవరించారో ఒకసారి ఇటీవలి మార్పులు ద్వారా గమనించండి.అర్థం కాకపోతే అడిగి తెలుసుకొనగలరు. యర్రా రామారావు (చర్చ) 15:32, 2 మార్చి 2023 (UTC)Reply

మహబూబ్ నగర్ జిల్లాలో మీ సవరణలు మార్చు

సాయివర్ధన్‌గౌడ్ గారూ మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి సమాచారం తొలగించారు.ఆ సమాచారం ఉండాలి.కాకపోతే దానిని పునర్య్వస్థీకరణ తరువాత పరిణామాలకు అనుగుణంగా సవరించాలి.అలాగా సాధ్యమైనంతవరకు ఉన్న డేటాను తొలగించే ముందు ఒకసారి పరిశీలించి, సందర్బాన్ని బట్టి అది ఉండాల్సిన అవసరంలేదు అని అనుకుంటేనే తొలగించాలి.సందిగ్దంగా ఉంటే, ఆ వ్యాస చర్చా పేజీలో రాయండి.దానిలో చర్చించి దానికి అనుగుణంగా చేయవచ్చు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:31, 26 జూలై 2023 (UTC)Reply

Ok sir Saivardhangoud12 (చర్చ) 09:42, 27 జూలై 2023 (UTC)Reply