స్వాగతం మార్చు

Viplava Kumar mandula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Viplava Kumar mandula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:25, 25 డిసెంబరు 2020 (UTC)Reply

మందుల విప్లవకుమార్ గారు, మీకు ఈ సందేశం అందినదా తెలుపగలరు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:24, 7 జనవరి 2021 (UTC)Reply

అభినందనలు మార్చు

మందుల విప్లవకుమార్ గారు, ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీరు కొత్త వాడుకరి సొంత పేజీ గురించి రాసుకున్నారు కానీ...ఆ పేజీ అలా కాదు మందుల విప్లవకుమార్ గారు, ఇక్కడ నొక్కి మీ గురించి రాసుకోవచ్చు అలాగే, మీ వాడుకరి పేజీ ఎలా ఉండాలి, అనేది కింద రాశాను, గమనించండి. అలాగే మీరు కొత్త పేజీలు తర్వాత రాయవచ్చు కాని ముందు అన్ని చదవండి, అయితే మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగతం సందేశం పెట్టారు, గమనించారా? చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి మందుల విప్లవకుమార్ గారు,ఇక్కడ నొక్కి ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి, అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి,ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి. మీకు ఈ సందేశం అందినది అని తెలియజేయగలరు. మరోసారి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మీకు అనిపించినది అని అడగండి, తెలుస్తాయి చర్చించండి. ఈ పేజీలోనే అడగండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:02, 30 జనవరి 2021 (UTC)Reply

సార్ మీ సూచనలకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. Viplava Kumar mandula (చర్చ) 17:29, 30 జనవరి 2021 (UTC)Reply

మందుల విప్లవకుమార్ గారు, మంచిది, అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి. మీలాంటి వారితో ఇక్కడ చాలా అవసరం ఉంది. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:38, 30 జనవరి 2021 (UTC)Reply

ప్రభాకర్ గారికి నమస్తే.సరే సార్ thank you. నేను కొన్ని లింక్స్ యాడ్ చేశాను. అవి లేవనే కదా నా మ్యాటర్ తొలగించారు. అలాగేనా చేసేది.? ఇంకా వేరే పద్దతులున్నాయా.? తెలుపగలరు. అలా మ్యాటర్ రద్దు పరచే పని మీరే ఎంచుకున్నారా.? ఎందుకు.? అర్ధం చేయించగలరు._ Viplava Kumar mandula (చర్చ) 18:35, 30 జనవరి 2021 (UTC)Reply

మందుల విప్లవకుమార్ గారు, మంచి ప్రశ్నలు వేశారు. మీకు ఉన్న అనుమానం ఒక్కొక్కటిగా తీర్చడానికి ప్రయత్నిస్తాను, ముందుగా మీరు ఎక్కడ రాసుకున్నారు, మీ సొంత పేజీలోనే ఏమని రాసుకున్నారు, ఒక ప్రజా నాయకుడు అని, వికీపీడియాలో ఇలాగే రాయాలి, కానీ మన గురించి మనం రాసుకోకూడదు, ఇతరుల గురించి మనం రాయాలి,మన పేజీలో ఎలా ఉండాలి నేను ప్రజా నాయకున్ని నేను ప్రకృతి ప్రేమికున్ని అని కదా ఉండాలి, అలా అయితే మీరు రాసిన పాదాలను సరి చేసుకున్నాను అనుకుంటారు, అది కూడా సరి అయినది కాదు, ఎందుకు అంటే ఈ పేజీలోనే ఇతరుల ఖాతాల్లో ఏమి రాసుకున్నారు, గమనించమని ఉదాహరణలకు కొందరి పేర్లు ఇచ్చాను, వారి వాడుకరి పేజీని గమనించండి, వారి వాడుకరి పేజీలో అలా ఉండదు. ఇక లింకులు 2 ఇచ్చారు, చూశాను, అవి చెంచుల గురించి మీరు రాసిన పత్రికలో వచ్చిన వ్యాసాలు మీరు వ్యాసకర్తలు అవి చెంచులకు మూలాలు ఆధారాలుగా ఉపయోగపడతాయి కానీ అవి రాసిన మీకు ఉపయోగపడవు, ఎందుకు అంటే అది విప్లవ్ కుమార్ గురించి ఉన్న లింకులు కాదు విప్లవ్ కుమార్ రాసిన చెంచుల సమస్యల గురించి ఉన్నది. ఉదా. నేను ముఖ్యమంత్రి అయితే నా గురించి మీరు పేపర్లో గొప్పగా రాస్తే అది నాకు ఉపయోగపడుతుంది కానీ, అది రాసిన విలేఖరికి ఆ లింకు విలేఖరి గొప్పతనంకు అంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఆలోచించండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చివరగా ఆ లింకులు మీకు ఉపయోగపడవు. కాబట్టి మీ పేజీ లో మీరే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది. కాబట్టి, మీరే తొలగించుకోండి, మీ గురించి టీవీలలో వార్త పేపర్లలో విప్లవ్ కుమార్ ప్రముఖ వ్యక్తి అని వస్తే మీ గురించి తప్పకుండా ఎవరో ఒక వాడుకరి ఇదే వికీపీడియాలో తప్పకుండ రాస్తారు, అప్పటి వరకు ఆగండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:59, 31 జనవరి 2021 (UTC)Reply

విలువైన సమధానలిచ్చినందుకు ధన్యవాదాలు సర్. నాకు ఇందులో రాయడమే రాదు. పేజీలు ఎలా క్రియేట్ చేయలో తెలియదు. అందుకే ఓ ప్రయోగం నా మీదే చేసుకున్నాను. మీ సూచనలను తప్పక స్వీకరిస్తాను.నేను రాయాల్సిన గొప్ప వాళ్ళు చాల మందే ఉన్నారు. నేర్చుకుని ప్రయత్నిస్తాను. కానీ నేనెవరి గురించి అయినా రాయాలంటే మీరు చెప్పిన లింక్ లు ఉండాలా.? అవి లేకపోవడం వలన మీరు వాటిని కూడా ఎలాంటి సమాచారం లేకుండానే తొలగిస్తారా.? అలా మనం తొలగించవచ్చునా ఎవరివి అయినా.? ఇక నా డబ్బా గురించి నాకు ఆందోళన లేదు. మీరు కూడా వదిలేయగలరు సార్. అయితే నా దానిలో అన్ని లింక్ లు కూడా ఒక సరి చూడగలరు. ఇందులో ఇంక నేర్చుకోవడానికి తగిన సూచనలివ్వగలరు సర్. __

మందుల విప్లవకుమార్ గారు, మంచి ప్రయోగం చాలా మంచిది మేము కూడా అనగా ఇందులో కొత్తగా చేరిన చాలామంది వారి గురించి వికీపీడియా గురించి తెలియక సొంత పేజీలు రాసుకున్న వారే ఆ విధంగా మీరు చేసింది తప్పు ఏమాత్రం కాదు, 5 సంవత్సరాల క్రితం నేను ఇలాగే రాసుకున్నాను, తప్పేమీకాదు, ఇక కొత్త పేజీలు ఎవరి గురించి రాయాలి అనుకుంటున్నారు వికీపీడియాలో ఇంతకుముందు వారివి ఉన్నాయా లేదా వారి పేరు చర్చాపేజీలో వెతకండి గూగుల్ చర్చాపేజీలో వెతకండి, అయితే వారి గురించి పేపర్ లో ఇంతకు ముందు చెప్పినట్టుగా టీవీలో వారి గురించి వారు చేసిన పనుల గురించి గొప్పతనం గురించి లింకులు లభించాలి, అలాంటి వారి గురించి తెలుగు వికీపీడియాలో రాయవచ్చు అయితే ముందు ఆంగ్లంలో వారి పేరును చర్చాపేజీల్లో వెతకండి తెలుగులోనూ వెతకండి ఆంగ్లంలో ఉంది తెలుగులో లేని వారి గురించి రాయడం ప్రారంభించండి, అలాంటి వారి గురించి రాయాలి అంటే ఎమ్మెల్యే ఎంపీ పై స్థాయి వారు లేదా ఏదైనా అంశంలో గొప్ప కృషి చేసిన వారైనా అయి ఉండాలి. మీరు ఎలాంటి వారి గురించి రాయాలి అనుకుంటున్నారు అవసరమైతే మీ చర్చాపేజీలో రాయండి ఎవరో ఒకరు మీకు సమాధానం చెబుతారు. మీరన్నట్లు మీ లింక్ లో అన్ని చూశాను యూనియన్ లీడర్ గా పేపర్ స్టేట్మెంట్ లు వ్యాసాల రచయితగా బాగున్నాయి, అందులో మీ నెంబర్ ఉంది కాబట్టి త్వరలోనే మిమ్మల్ని ఫోన్ చేసి మీతో మాట్లాడతాను, మీ సేవలు వికీపీడియాకి చాలా ఉపయోగపడతాయి అని నేను నమ్ముతున్నాను, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:26, 31 జనవరి 2021 (UTC)Reply

మందుల విప్లవకుమార్ గారు, సహాయం:సూచిక, [మార్పులు], మొదటి పేజీ మీ పేజీలో మీరు తొగించిన సమాచారం చూశానండి చాలా మంచిది, నేను కూడా అనగా ఇందులో కొత్తగా చేరిన తొలిరోజు వికీపీడియా గురించి తెలియక సొంత పేజీలు రాసుకున్న వారే ఆ విధంగా మీరు చేసింది తప్పు ఏమాత్రం కాదు, 5 సంవత్సరాల క్రితం నేను ఇలాగే రాసుకున్నాను, వికీపీడియా నాది అని రాసుకున్నాను, ఇక తరువాత మీ లాగే నేను తొగించాను, ఇది సాధారణంగా జరిగే విషయాలు మీకు కొన్ని లింకులు ఇచ్చాను అవి మీకు ఉపయోగపడతాయి ముందుగా అన్ని నీలం రంగు పేజీలు అన్ని చదవండి ముందుగా చాలా ఉపయోగపడతాయి ముందు ముందు అన్నట్లు మీరు ఈ పేజీని కూడా పైనుండి చదవండి ఎందుకంటే సంతకం మొదట్లో పెట్టారు ఇప్పుడు పెట్టడం మర్చిపోతున్నారు, వికీపీడియాను కంప్యూటర్లో ఏదైనా నెట్ సెంటర్లు ల్యాప్ టాప్ లో చూడండి దానిలో ఎడమ పక్క కొత్త పేజీలు ఆయన ప్రయోగశాల అంటే మీరు ఏదైనా రాయాలనుకున్న దాన్ని అందులో ముందుగా రాసుకోవడానికి ప్రయోగశాల అని ఉంటుంది దాన్ని కూడా ఉపయోగించండి అందుకుగాను కంప్యూటర్ నంది వికీపీడియా కొన్నిసార్లు వాడాలని నా సలహా, సెల్ ఫోన్ ఇంత బాగా వాడుతున్నారు అంటే కంప్యూటర్ తోటి మరింతగా మెరుగు అవుతారు మీరు, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 03:03, 1 ఫిబ్రవరి 2021 (UTC)Reply