వార్ధా జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మధ్యప్రదేశ్ లోని జిల్లాలలో'వార్ధా' జిల్లా (హిందీ:वर्धा जिल्हा) ఒకటి. వార్ధా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,300,774. నగరాలలో వివసిస్తున్న వారి శాతం 26.28%.

వార్థా జిల్లా

वर्धा जिल्हा
మహారాష్ట్ర పటంలో వార్థా జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో వార్థా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనునాగపూర్
ముఖ్య పట్టణంవార్ధా
మండలాలు1. Wardha, 2. Deoli, 3. Seloo, 4. Arvi, 5. Ashti, 6. Karanja, 7. Hinganghat, 8. Samudrapur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలువార్థా
 • శాసనసభ నియోజకవర్గాలుWardha, Deoli, Arvi, Hinganghat
విస్తీర్ణం
 • మొత్తం6,310 km2 (2,440 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం13,00,774
 • సాంద్రత210/km2 (530/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత78.37%
 • లింగ నిష్పత్తి946.1:1000 (Female:Male)
ప్రధాన రహదార్లుNH7
సగటు వార్షిక వర్షపాతం1062.8 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి
పుల్గావ్ వద్ద వార్ధా నది

చరిత్రసవరించు

వార్ధా చరిత్ర చారిత్రక పూర్వం నాటిది. ఇండియన్ నేచురల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇది సరైన ఆధారం. వార్ధా జిల్లాలోని సింధి రైల్వే స్టేషను వద్ద ఆస్ట్రిక్ ఎగ్- షెల్ కనుగొనబడింది. జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు, ఒకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి ఒకతక సామ్రాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది. వతకా పాలకులు సా.శ. 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సామ్రాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది.

పాలకులుసవరించు

తరువాత వార్ధాను చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, దేవగిరికి చెందిన సెయునా యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, బేరర్‌కు చెందిన ముస్లిం పాలకులు, గోండులు, మరాఠీలు పాలించారు. గోండు పాలకుడు రాజా బులంద్ షాహా, బోంస్లే పాలకుడు రఘూజీ మధ్యయుగంలో పాలించిన పాలకులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 1850 నాటికి వార్ధా (అప్పుడు నాగపూర్‌లో భాగంగా ఉండేది) బ్రిటిష్ పాలకుల వశం అయింది. వారు వార్ధాను సెంట్రల్ ప్రోవింస్‌లో విలీనం చేసారు. సేవాగ్రామానికి వార్ధా సహోదర గ్రామంగా ఉండేది. ఇవి రెండు భారతస్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉండేది. 1934 భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి వార్ధాలోని మాహాత్మాగాంధి ఆశ్రమం కేంద్రంగా ఉంది.

బ్రిటిష్సవరించు

1862లో వార్ధా నాగపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత పాలనా సౌలభ్యం కొరకు ఇది నాగపూర్ జిల్లా నుండి విభజించబడింది. పుల్గావ్ సమీపంలోని కవాథా వార్ధా జిల్లా కేంద్రంగా ఉంది. 1866లో జిల్లా కేంద్రం పాలక్వాడి గ్రామానికి మార్చబడింది. ప్రస్తుతం ఇది వార్ధానగరంలో భాగంగా మారింది. వార్ధా జిల్లాలో ఆచార్య వినోభాభావే జన్మించి నివసించిన పవనార్ గ్రామం ఉంది.

ఆధునిక కాలంసవరించు

సమీపకాలంలో వార్ధా రైతుల ఆత్మహత్య కారణంగా వార్తలలో ప్రధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల కొరత, పంట సరిగా అందక, కరువు కారణంగా అప్పులు చెల్లించలేక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రధాన వార్తలలో చోటు చేసుకుంది. తరువాత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్ధాను సందర్శించి పరిస్థితి అవగాహన చేదుకుని ఆర్థిక సాయం ప్రకటించాడు.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,300,774,[1]
ఇది దాదాపు. మొరోషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 377 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 205 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4.8%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 946:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 87.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

కేంద్ర, రాష్ట్ర ప్రతినిధిసవరించు

 
వార్ధా నది

'లోక్ సభ సీటు'

 • వార్ధా రాందాస్ తదాస్ (బిజెపి)

'మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు'

 • వార్ధా : డాక్టర్ పంకజ్ భోయర్ (బిజెపి)
 • డియోలి : రంజిత్ కాంబ్లే (ఐ.ఎన్.సి)
 • ఆర్వి : అమర్ కాలే (ఐ.ఎన్.సి )
 • హింగంఘాట్ : సమీర్ కునవర్ (బిజెపి)

ప్రముఖులుసవరించు

 • బాబా ఆమ్టే భారతదేశం యొక్క సామాజిక, హింగంఘాట్ ( 1914 డిసెంబరు 24 న జన్మించింది) నైతిక నాయకుడు
 • జమ్నాలాల్ బజాజ్, స్వాతంత్ర్య సమరయోధుడు
 • అభయ్ బ్యాంగ్ రాణి బ్యాంగ్, సోషల్ వర్కర్లు, గడ్చిరోలి జిల్లా పేద ఆదివాసి ప్రజలకు వైద్య సేవలు అందించడం.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 10 (help)
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు