వింజమూరి భావనాచార్యులు

స్వాతంత్ర్య సమరయోధుడు మరియు గుంటూరు నగర మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్.
(వింజమూరి భావనాచారి నుండి దారిమార్పు చెందింది)

వింజమూరి భావనాచార్యులు స్వాతంత్ర్య సమరయోధుడు, గుంటూరు నగర మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్.[1]

జీవిత విశేషాలు

మార్చు

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరపాలనే విషయమై చర్చించేందుకు నాటి కమిటీ ఆయన నివస్తున్న గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం అరండల్‌పేట 1వ లైనులోని యింటిలో 1913వ సంవత్సరం మార్చి 12వ తేదీన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, ముట్నూరి కృష్ణారావు, జొన్నవిత్తుల గురునాథం వంటి వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రథమాంధ్ర మహాసభలను బాపట్లలో 1913 మే 26,27 తేదీల్లో జరపాలని, అందుకు కొండా వెంకటప్పయ్యను నిర్వహణ కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆంధ్రజాతి అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్ర అవసరమన్న నినాదం ఈ ఇంటిలో జరిగిన సమావేశం నుండే బయలుదేరింది.[1][2]

ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన 1892 జూలై 1లో కృష్ణాజిల్లాలో కాటా శివావధానులు, బుడ్దిరాజు కమలరాజు లతో కలసి కాంగ్రెస్ కమిటీని ప్రారంభించారు. ఈ జిల్లా కమిటీ ప్రారంభానికి పూర్వం కాంగ్రెస్ సభ్యులు 1892 జూన్ 29, 30 తేదీలలో గుంటూరులో సమావేశం నిర్వహించారు. మే 10 1914లో తెనాలిలో గుంటూరు జిల్లా రైతులు నీటిపారుదల సౌకర్యాలకోసం ప్రభుత్వానికి అభ్యర్థించారు. 1914 జూన్ 4, 5 తేదీలలో గుంటూరు జిల్లా సమావేశంలో భవనాచార్యులు మరింత వ్యవసాయ సౌకర్యాలు కావాలని ప్రభుత్వన్ని, స్థానికసంస్థల అధికారులను అభ్యర్థించారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన పోరాటం చేసారు. లార్డ్ రిప్పన్ 1882 వరకు ప్రవేశ పెట్టిన స్వయం సహాయక ప్రభ్యుత్వం గురించి ఆయన చింతించాడు. ఆ సహాయం గుంటూరు జిల్లా ప్రజలకు అందడం లేదని భావించాడు. తన ప్రకటన నిరూపించడానికి ఆయన జిల్లా, తాలూకాలలోని అధికార యంత్రాంగం చేయు ఆధిపత్యం తెలియజేసే పట్టికను అందజేసాడు.[3]

గాంధీజీ ఖద్దరు వస్త్రాలను ధరించాలనే పిలుపునందుకుని 1923 మార్చి 18 న గుంటూరులో "నిరాడంబర లక్షణం" జరిగింది. ఆ రోజు నుండి ఖద్దరు ప్రారంభమైనది. ఖద్దరు అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం చిన్న దౌర్జన్యాలకు దిగింది. ఆ రోజు సాయంత్రం జరిగిన బహిరంగసభలో భవనార్యులు గాంధీ శకం గూర్చి వాటిని ఆచరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.[4]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు